Krishna Mukunda Murari Episode September 21st, 2023: ముకుందని సెట్ చేసే పనిలో కృష్ణ.. తన చేతే తన గొయ్యి తవ్విస్తానన్న ముకుంద..
ఈ తింగరిది నన్ను అడ్డం పెట్టుకుని ఏ ప్లాన్ వేస్తుంది.. ఏ ప్లాన్ అయినా వెయ్యని.. కృష్ణను ఈ ఇంట్లో నుంచి మా జీవితాల్లో నుంచి ఎలాగా బయటకు పంపేస్తా కదా అని ముకుంద ఆలోచిస్తుంది. రేవతి ఇంట్లో అదేమైనా ప్లైలెట్ ట్రైనింగ్ అవుతుందా గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతుందా.. ఇంటి పని వంట పనిగా నేను నేర్పుతాను నువ్వు హాస్పటల్ కి వేళ్ళు అంటుంది. ముకుంద కలుగజేసుకుని కృష్ణకు నా ప్రేమ విషయం చెప్పి ఎలాగైనా వెళ్ళగొడతాను అనుకుంటూనే .. కృష్ణకు సపోర్ట్ గా మాట్లాడుతుంది.
మురారీ ప్రేమ.. పెళ్లి తర్వాత అతని మనసు ఏమిటో తెలుసుకున్న కృష్ణ ఎప్పటిలా సరదగా మారిపోతుంది. మురారీని చిన్నపిల్లాడిలా రెడీ చేసి అల్లరి చేస్తుంది. మురారీ, కృష్ణ దొంగ పోలీసు ఆట ఆడుతుంటే.. అది చూసిన ముకుందకు మండిపోతుంది. దండించడానికి పోలీసులు నేరస్థుల పరిమిషన్ తీసుకోరమ్మా అని మురారీ అంటే.. శిక్షిస్తానంటే ఎవరూ లొంగిపొరమ్మా అని కౌంటర్ ఇస్తుంది కృష్ణ.. మరి ఎలా లొంగదీసుకోవాలని అని మురారీ అడుగుతాడు.. ప్రేమతో దగ్గర చేసుకోవాలని కృష్ణ చెబుతుంది. కృష్ణా నా ఇష్టం.. నా ప్రేమ నా జీవితం అన్నీ నువ్వీ అని మురారీ అని అంటే.. అయితే మీ ప్రేమకి నేను దాసిని సార్ అంటుంది మురారీ. నువ్వు చేసిన నేరానికి శిక్ష ఏమిటో తెలుసా.. అంటూ మురారీ నా గుండెల్లో నిన్ను జీవితకాలం బంధిస్తున్నా.. అంటే అప్పుడు నేను జీవితకాలం బంధినైపోతాను అని అంటుంది కృష్ణ. మురారీతో కృష్ణ ఒక విషయం చెప్పాలి అని అంటుంది.
ఇంట్లో అందరికి అలుసైపోతున్నా ..
కృష్ణను ఎలా ఇంట్లో నుంచి పంపించెయ్యాలంటే ఏమి చెయ్యాలో అర్ధం కావడం లేదు. ఎంత తెగించినా అలుసైపోతున్నానే తప్ప ఫలితం ఉండడం లేదు. మురారీలో ఎలాంటి మార్పు లేదు.. కృష్ణ, రేవతి, మధు ఇలా ఇంట్లో అందరూ ప్రత్యర్థులే అని ముకుంద.. ఇంతలో మురారీ కృష్ణలు మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు.. తనకు ఫుడ్ బాల్ అంటే ఇష్టమని.. కాలేజీలో ఆదర్శ్, తన వల్ల ఎప్పుడూ ఏ మ్యాచ్ లో ఓడిపోలేదని చెబుతాడు మురారీ.. ఇంతలో కృష్ణ.. ముకుందని చూసి.. నిన్న ఏసీపీ సార్ కి ఇష్టమైన వంటలు చేశావు. ఈ రోజు ఎవరికీ నచ్చిన వంటలు చేసావు అని అడుగుతుంది. నువ్వు ఎవరికి నచ్చినవి వండితే తింటావో వాళ్ళకి నచ్చినవే చేశా ముకుంద అని అంటుంది.. నిన్ను ఎలా దారిలో పెట్టాలో నాకు తెలుసు ముకుంద అని కృష్ణ అనుకుంటుంది. నిన్ను సెట్ చేయడానికి ప్లాన్ వేశాను. అందరికి ఇష్టమైన వంటలే చేసి ఉంటావు పద అని అంటుంది.
ముకుందని సెట్ చేసే పనిలో కృష్ణ
డైనింగ్ టేబుల్ దగ్గర.. అందరూ కూర్చిని తింటుంటే.. ముకుందని కూడా కూర్చో మంటే.. లేదు నేను వడ్డిస్తా అంటుంది ముకుంద. మురారీ గురించి రేవతి తెలియని కూడా నాకు తెలుసు.. అనిభవానీ అంటే.. కృష్ణ పెద్దత్తయ్య నేను ఒక నిర్ణయం తీసుకున్నా.. అంటే నువ్వు క్యాంప్ కి వెళ్లాలా అంటే అదేం లేదు.. నేను హాస్పటల్ కు లాంగ్ లీవ్ పెట్టాను అంటే అందరూ షాక్ తో చూస్తారు. ఇంతలో భవానీ ఎందుకు అంటే నేను.. ముకుందకు ఇవ్వాల్సిన బాకీ చాలా ఉంది.. నేను హాస్పటల్ అంటూ నాపనిలో నేను బిజీగా ఉంటె.. ఇంట్లో ఖాళీగా ఉన్న ముకుంద నాకాపురంలో నిప్పులు పోయడానికి చూస్తుంది. నా అకౌంట్ క్లియర్ చేయాలంటే నాకు ఈ మాత్రం టైమ్ కావాలి. అనుకుంటుంటే.. భవానీ ఎందుకు అంటే ముకుంద వైపు చూస్తావేమి అని ఆడుతుంది. అంటే పెద్దయ్య మీరు ఎలాగా పేదల కోసం హాస్పటల్ కట్టిస్తాను అన్నారు కదా.. ఆ హాస్పటల్ నిర్మాణం అయ్యేవరకూ ఇంట్లో ఉండి .. ఆదర్శ్ వచ్చే వరకూ ముకుందకు దగ్గర ఉండి అన్ని పనులు నేర్పిస్తానను అంటుంది కృష్ణ.
కృష్ణ లీవ్ ని సపోర్ట్ చేసిన ముకుంద
ఈ తింగరిది నన్ను అడ్డం పెట్టుకుని ఏ ప్లాన్ వేస్తుంది.. ఏ ప్లాన్ అయినా వెయ్యని.. కృష్ణను ఈ ఇంట్లో నుంచి మా జీవితాల్లో నుంచి ఎలాగా బయటకు పంపేస్తా కదా అని ముకుంద ఆలోచిస్తుంది. రేవతి ఇంట్లో అదేమైనా ప్లైలెట్ ట్రైనింగ్ అవుతుందా గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతుందా.. ఇంటి పని వంట పనిగా నేను నేర్పుతాను నువ్వు హాస్పటల్ కి వేళ్ళు అంటుంది. ముకుంద కలుగజేసుకుని కృష్ణకు నా ప్రేమ విషయం చెప్పి ఎలాగైనా వెళ్ళగొడతాను అనుకుంటూనే .. కృష్ణకు సపోర్ట్ గా మాట్లాడుతుంది. మీరు ఊ అనండి చాలు ముకుందని నేను సెట్ చేస్తాను అంటుంది కృష్ణ. మీరిద్దరూ ఎవరికీ సమస్య వచ్చినా ఇలాగె ఒకరికోసం ఒకరు ఎప్పుడూ స్టాండ్ తీసుకోవాలి. అంటూనే రేవతి ఒపీనియన్ అడుగుతుంది. నాకు కృష్ణ నిర్ణయం నచ్చలేదు అని చెబుతుంది. కృష్ణను వదులుకోను ముకుందని తాను సెట్ చేస్తానని .. లాంగ్ లీవ్ పెట్టకుండా చూస్తానని తల్లికి చెప్పిన మురారీ..
మన ఇద్దరి బతుకు ప్రేమాలయం
నా వాళ్లు అందరూ ఏమి అనుకుంటారో నిజం తెలిస్తే ఏమనుకుంటారో ఈ రెండు భయాలు వాదిస్తే మన ఇద్దరి బతుకు ప్రేమాలయం అవుతుంది అని ముకుంద ఆలోచిస్తుంటే.. అలేఖ్య వచ్చి.. నాకు ఎందుకో.. కృష్ణకు మీ ప్రేమ విషయం తెలిసిపోయింది అనిపిస్తుంది చెబుతుంది. నీకు ఎలా తెలుసు.. అంటే నాకు అనిపించింది.. అని అంటే అలేఖ్య అంటే.. ఇలాంటివి నేను నమ్మను అలేఖ్య.. అంటూనే.. అయినా కృష్ణకు మా ప్రేమ విషయం తెలిస్తే ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అందుకే కదా.. తనకు తెలియాలని నేను ఇంతగా ఆరాట పడుతున్నాను అని ముకుంద.. అంటుంటే.. మురారీకి నీమీద ప్రేమని లేదని కృష్ణకు తెలిస్తే ఇక్కడే ఉండిపోతుంది అలేఖ్య అంటే.. ఎక్కడ ఉండాలో ఎక్కడ ఉండాలో కృష్ణకు తెలుసు .. తనకు ఆత్మాభిమానం ఉంది అని నేను అనుకుంటున్నా.. ఒకవేళ తాళి, బంధం అంటూ రేవతి కోడలిగా ఆలోచిస్తే.. కృష్ణను నేను ఇంట్లో ఉండనివ్వను అని ముకుంద చెబుతుంది. నీ తెగింపు చూసి నాకు టెన్షన్ గా ఉంది. అంటుంటే.. ఏమి చేస్తావు మురారీ కూడా కృష్ణను ప్రేమిస్తున్నాడు కదా అని అంటుంది అలేఖ్య. కృష్ణను ఈ ఇంట్లో నుంచిం వెళ్లగొడితే.. ఆదర్శ్ ఎప్పటికీ రాకపోతే.. మురారీ.. ముకుందలు ఒంటరిగా మిగిలిపోతారు. అందుకే కృష్ణను ఇంట్లో నుంచి పంపించేసి.. ఆదర్శ్ ను రాకుండా చేసి నా మురారీని నేను దక్కించుకుంటాను అని చెబుతుంది ముకుంద..తనకు పని నేర్పించే సమయంలో తన చేతే తన గొయ్యి తవ్విస్తానన్న ముకుంద చెబుతుంది. అప్పుడు నీ ప్రేమ సక్సెస్ అవుతుందని చెప్పిన అలేఖ్య.
గోడ కుర్చీ వేసి మరీ ఆలోచిస్తున్న కృష్ణ
ప్రేమని చేతల్లో చూపిస్తూ.. మాటల్లో చెప్పకర్లేదా అని అనుకుంటుంది. ఇంతలో మురారీ వచ్చి గోడకుర్చీ ఎందుకు వేశావు అని అడిగితె.. కాళ్ల నొప్పులు వచ్చాయి.. అందుకే గోడ కుర్చీ వేస్తే తగ్గుతాయి అని అంటే.. స్కూల్ డేస్ నుంచా అని అంటే ఎప్పుడూ టాపర్ నేను అంటే.. అప్పటి నుంచి తింగరితనం అలవాటు అయిందన్న మాట అంటాడు మురారీ. మీరు అయితే ఇప్పటికీ ఎబిసిడీ అలబ్బాయి అని అంటుంది. మధు తో బాధగా మాట్లాడడం చూశాను అని అడుగుతుంది. ఓహో వినేశారా దొంగలా అనీ వినేస్తారు. అంటూ మధు ఒక ట్రైయాంగ్ లవ్ స్టోరీ చెప్పాడు. నేను దానికి జడ్జిమెంట్ ఇచ్చాను.. రాజమౌళి 100 కోట్లు సినిమా తీసినా ప్రేక్షకులే జడ్జిమెంట్ కదా అని అంటుంది. కృష్ణ నీకు సైకాలజీ తెలుసుకదా ముకుంద గురించి తెలుసుకోవాలని అనుకుంటాడు. అమ్మాయిల మెండ్ సెట్ కు, అబ్బాయిల మెండ్ సెట్ కు తేడా ఏమిటి అని అడుగుతాడు.
అబ్బాయిల ఆలోచన మురారీ చెబితే.. ఆడవాళ్ళ మైండ్ సెట్ గురించి కృష్ణ చెబుతుంది. కృష్ణ ఆగకుండా చెబుతూనే ఉంటుంది.
రేపటి ఎపిసోడ్ లో
రేపు ప్రపంచ భర్తల దినోత్సవం. భర్తకు ఇష్టమైనవి చెయ్యాలి కదా.. ఆదర్శ్ కు ఇష్టమైన వంటకాలు ముకుందతో చేయిస్తా అని చెబుతున్న కృష్ణ..