Brahmamudi, September 21st episode: రుద్రాణి-రాహుల్ ప్లాన్ సక్సెస్.. విగ్రహాలన్నీ మాయం! దెబ్బలతో పడిఉన్న కృష్ణమూర్తి.. కావ్య ఏం చేస్తుంది?
గత సోమవారం నుంచి బ్రహ్మముడి ఎపిసోడ్ లో ట్విస్టుల మీద ట్విస్టులు నెలకొంటున్నాయి. దీంతో ఈ సీరియల్ ఎపిసోడ్స్ కానీ, ప్రోమోస్ కానీ ఎలాంటివి ముందుగా రిలీజ్ చేయడం లేదు. ప్రేక్షకుల్ని సస్పెన్స్ పెడుతున్నారు. దీంతో ఈ సీరియల్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా.. అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. అనుకున్నట్టుగానే కావ్య, కృష్ణమూర్తి ఫ్యామిలీకి పెద్ద షాక్ ఇచ్చింది రుద్రాణి. దీంతో ఏం చేయాలో తెలీని నిస్సహాయ స్థితిలో ఉంది కృష్ణ మూర్తి ఫ్యామిలీ..
గత సోమవారం నుంచి బ్రహ్మముడి ఎపిసోడ్ లో ట్విస్టుల మీద ట్విస్టులు నెలకొంటున్నాయి. దీంతో ఈ సీరియల్ ఎపిసోడ్స్ కానీ, ప్రోమోస్ కానీ ఎలాంటివి ముందుగా రిలీజ్ చేయడం లేదు. ప్రేక్షకుల్ని సస్పెన్స్ పెడుతున్నారు. దీంతో ఈ సీరియల్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా.. అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. అనుకున్నట్టుగానే కావ్య, కృష్ణమూర్తి ఫ్యామిలీకి పెద్ద షాక్ ఇచ్చింది రుద్రాణి. దీంతో ఏం చేయాలో తెలీని నిస్సహాయ స్థితిలో ఉంది కృష్ణ మూర్తి ఫ్యామిలీ.
నిన్నటి ఎపిసోడ్ లో కూడా మంచి టర్నింగ్ పాయింట్స్ ఉన్నాయి. సీతారామయ్య, ఇందిరా దేవి దంపతుల ఆశీర్వాదం తీసుకుని బయలు దేరుతుంది కావ్య. ఈ లోపు కళ్యాణ్, అనామికను కలిసేందుకు వెళ్తుంది. ఇక అనామిక కళ్యాణ్ కి ట్విస్ట్ ఇస్తుంది. పెళ్లి కార్డ్ ఇచ్చి ప్రపోజ్ చేస్తుంది. కళ్యాణ్ కూడా అనామికకు ఓకే చెప్పి.. ఇద్దరూ ఒక్కటవుతారు. ఆ నెక్ట్స్ కావ్యని దెబ్బ తీయాలని కుట్ర పన్నుతుంది రుద్రాణి. కావ్యని, కృష్ణ మూర్తి ఇంటి సభ్యులను కోలుకోలేని దెబ్బ తీయాలని రాహుల్ కి ఫోన్ చేసి చెప్తుంది. తల్లి చెప్పినట్టు ప్లాన్ సిద్ధం చేస్తాడు.
ఎంత రాత్రైనా కావ్య ఇంటికి రాకపోయే సరికి సీతారామయ్య.. రాజ్ కి కాల్ చేస్తాడు. కావ్య దగ్గరకు వెళ్లి తీసుకు రమ్మని పంపుతాడు. రాజ్ కారులో కృష్ణ మూర్తి ఇంటి ముందు ఆగుతాడు. అది చూసిన కావ్య.. కారు ఎక్కి రాజ్ తో వెళ్తుంది. ఇక్కడే అసలైన ట్విస్ట్ నెలకొంటుంది.
టుడే స్టన్నింగ్ ఎపిసోడ్:
రుద్రాణి, రాహుల్ ప్లాన్ చేసినట్టు.. కావ్య, కృష్ణమూర్తి వాళ్లు కష్ట పడి చేసిన విగ్రహాలన్నీ రౌడీలు వచ్చి లారీలో ఎత్తుకెళ్లిపోతారు. అంతే కాకుండా కృష్ణ మూర్తిని దారుణంగా కొడతారు. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో అక్కడే పడిపోయి ఉంటాడు కృష్ణ మూర్తి. ఆ తర్వాత రోజు కావ్య, కనకం, రాజ్, అప్పు వచ్చి చూసే సరికి అక్కడున్న విగ్రహాలన్నీ మాయం అయిపోతాయి. అది చూసి షాక్ అయిన వాళ్లు.. కారు దిగి చూసే సరికి కృష్ణ మూర్తి గాయాలతో పడి ఉంటాడు. ఇక కనకం, అప్పు, కావ్యలు బోరున ఏడుస్తూ ఉంటారు.
మరి అలాంటి సమయంలో కావ్య ఎలా రియాక్ట్ అవుతుంది? దీని వెనక రుద్రాణి, రాహుల్ ఉన్నారని తెలుస్తుందా? ఈ విషయంలో కావ్యకి రాజ్ అండగా నిలుస్తాడా? రుద్రాణి పన్నాగాన్ని బయట పడుతుందా.. లేదా తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే. మొత్తానికి ప్రేక్షకుల్ని సీరియల్ ముందు నుంచి కదలనివ్వకుండా మంచి స్టోరీ నడిపిస్తున్నాడు బ్రహ్మముడి డైరెక్టర్.