Aryan Khan: వెబ్‌ సిరీస్‌తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్న షారుక్‌ ఖాన్‌ తనయుడు.. ఆర్యన్‌ ఖాన్‌ ‘స్టార్‌డమ్‌’ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

బాలీవుడ్‌ బాద్‌ షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ గత రెండేళ్లుగా వార్తల్లో నిలుస్తున్నాడు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో ఆర్యన్‌ పేరు బాగా వినిపించింది. అయితే ఆ డ్రగ్స్ కేసు నుంచి ఆర్యన్ బయటపడ్డాడు. దర్యాప్తు సంస్థ స్వయంగా ఆర్యన్ పేరును చార్జ్ షీట్ నుంచి తొలగించింది. డ్రగ్స్ కేసు తర్వాత ఆర్యన్ ఖాన్ తన సొంత బ్రాండ్‌ను ప్రారంభించి వ్యాపార రంగంలోకి దిగాడు

Aryan Khan: వెబ్‌ సిరీస్‌తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్న షారుక్‌ ఖాన్‌ తనయుడు.. ఆర్యన్‌ ఖాన్‌ 'స్టార్‌డమ్‌' స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
Shah Rukh Khan, Aryan Khan
Follow us
Basha Shek

|

Updated on: Sep 19, 2023 | 9:19 PM

బాలీవుడ్‌ బాద్‌ షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ గత రెండేళ్లుగా వార్తల్లో నిలుస్తున్నాడు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో ఆర్యన్‌ పేరు బాగా వినిపించింది. అయితే ఆ డ్రగ్స్ కేసు నుంచి ఆర్యన్ బయటపడ్డాడు. దర్యాప్తు సంస్థ స్వయంగా ఆర్యన్ పేరును చార్జ్ షీట్ నుంచి తొలగించింది. డ్రగ్స్ కేసు తర్వాత ఆర్యన్ ఖాన్ తన సొంత బ్రాండ్‌ను ప్రారంభించి వ్యాపారంలోకి దిగాడు. ఇప్పుడు తన తండ్రి అడుగుజాడల్లో నడవాలని నిర్ణయించుకుని సినిమా రంగంలోకి కూడా అడుగుపెట్టాడు. కుమారుడి కోసం షారుక్‌ ఖాన్‌ మరోసారి నిర్మాతగా మారనున్నారు. షారుక్‌లాగే ఆర్యన్‌ ఖాన్‌కు కూడా సోషల్‌ మీడియాలో కూడా ఫుల్‌ క్రేజ్‌ ఉంది. అయితే తండ్రిలాగా ఆర్యన్‌ నటనను కెరీర్‌గా ఎంచుకోలేదు. బదులుగా అతను కెమెరా వెనుక పని చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆర్యన్ ఖాన్‌కు దర్శకత్వంపై ఉంది. ఇందులో భాగంగా ఓ వెబ్ సిరీస్‌తో ఎంట్రీ ఇవ్వనున్నాడు. తాజాగా ఈ వెబ్‌ సిరీస్‌పై లేటెస్ట్‌ అప్డేట్‌ వచ్చింది. ‘స్టార్‌డమ్’ పేరుతో కొత్త వెబ్ సిరీస్‌కి ఆర్యన్ ఖాన్ దర్శకత్వం వహించారు. గత డిసెంబర్‌లో వెబ్ సిరీస్ షూటింగ్ ప్రారంభమైంది. ఆర్యన్ ఖాన్ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తయ్యి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకొంటోంది. వెబ్ సిరీస్‌లోని నటీనటులు, సాంకేతిక నిపుణులు తదితరుల వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. అయితే త్వరలోనే ఈ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కానుందని సమాచారం.

కాగా గతంలో ఐపీఎల్ వేలం ప్రక్రియలో ఆర్యన్‌ ఖాన్‌ పాల్గొనడంతో షారుక్‌ కుమారుడు వ్యాపార రంగంలోకి అడుగుపెట్టనున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆర్యన్ ఖాన్ తన సొంత బ్రాండ్ ‘డి యావోల్’ పేరుతో బట్టలు, ప్యాషన్ యాక్సెసరీస్ విక్రయాలను ప్రారంభించాడు. ఈ బ్రాండ్స్‌కు షారుక్ ఖాన్ అంబాసిడర్‌గా వ్యవహరించడం గమనార్హం. షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ కూడా ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. జోయా అక్తర్ దర్శకత్వం వహించిన ‘ఆర్చిస్’ అనే చిత్రంలో సుహానా ఖాన్ నటించింది. ఈ సినిమా మరికొద్ది రోజుల్లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఇది కాకుండా, సుహానా కొన్ని వాణిజ్య ప్రకటనలలో నటించడం ప్రారంభించింది. తీరా అనే కాస్మెటిక్ ఉత్పత్తికి సంబంధించిన ఓ ప్రకటనలో సుహానా నటించింది.

ఇవి కూడా చదవండి

షారుక్ తో ఆర్యన్ ఖాన్..

View this post on Instagram

A post shared by Aryan Khan (@___aryan___)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే