Athidhi Web Series: ఓటీటీలోకి వచ్చేసిన హార్రర్ థ్రిల్లర్ తెలుగు వెబ్ సిరీస్.. వేణు ‘అతిథి’ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో తన ట్యాలెంట్‌ను పరీక్షించుకోవడానికి వచ్చాడు వేణు. 'అతిథి' అనే పేరుతో ఓ హార్రర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌తో మన ముందుకు వచ్చాడు. ఇప్పటికే రిలీజైన టీజర్, పోస్టర్స్, ట్రైలర్ డిఫరెంట్‌గా ఉండడం, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు షో రన్నర్‌గా వ్యవహరించడంతో అతిథిపై ఆసక్తిని పెంచేశాయి. తాజాగా ఈ హార్రర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
సుమారు 25 ఏళ్ల క్రితం స్వయం వరం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు వేణు తొట్టెంపూడి. తన నటనతో ముఖ్యంగా కామెడీ పంచులతో ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకున్నాడు. ఆతర్వాత చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్, కల్యాణ రాముడు, పెళ్లాం ఊరెళితే, పెళ్లాంతో పనేంటి, చెప్పవే చిరుగాలి, సదా మీ సేవలో, శ్రీకృష్ణ 2006, అల్లరే అల్లరి, యమగోల మళ్లీ మొదలైంది, గోపి గోపిక గోదావరి తదితర సూపర్‌హిట్ సినిమాల్లో నటించి మెప్పించాడు. అయితే హీరోగా తన సక్సెస్‌ను కంటిన్యూ చేయలేకపోయాడు. చింతకాయల రవి, దమ్ము తదితర సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, గెస్టు రోల్స్‌లో కనిపించాడు. ఇక గతేడాది వచ్చిన రవితేజ రామారావు ఆన్ డ్యూటీలో నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్ పోషించాడు. అయితే సినిమా ప్లాఫ్ కావడంతో వేణుకు నిరాశ తప్పలేదు. అందుకే ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో తన ట్యాలెంట్‌ను పరీక్షించుకోవడానికి వచ్చాడు వేణు. ‘అతిథి’ అనే పేరుతో ఓ హార్రర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌తో మన ముందుకు వచ్చాడు. ఇప్పటికే రిలీజైన టీజర్, పోస్టర్స్, ట్రైలర్ డిఫరెంట్‌గా ఉండడం, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు షో రన్నర్‌గా వ్యవహరించడంతో అతిథిపై ఆసక్తిని పెంచేశాయి. తాజాగా ఈ హార్రర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. మంగళవారం (సెప్టెంబర్ 19) నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో అతిథి స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సిరీస్ అందుబాబులో ఉంది.
డైరెక్టర్ భరత్ తెరకెక్కించిన అతిథి వెబ్ సిరీస్‌లో వేణుతో పాటు అవంతిక, రవివర్మ, భద్రం, అదితీ గౌతమ్, వెంకటేష్ కాకుమాను, చాణక్య తేజ, గాయత్రి చాగంటి, పూజ తదితరులు ఈ సిరీస్‌లో కీలక పాత్రలు పోషించారు. రాండమ్ ఫ్రేమ్స్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రవీణ్ సత్తారు ఈ వెబ్ సిరీస్‌ను నిర్మించారు. ధర్మేంద్ర కాకర్ల ఎడిటర్‌గా వ్యవహరించగా, మనోజ్ కాటసాని సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. కపిల్ కుమార్ బాణీలు అందించారురు. ఇక అతిథి సిరీస్ కథ విషయానికి వస్తే.. ఇందులో రవి (వేణు) ఒక రైటర్. నాస్తికుడు కూడా. దయ్యాలంటే నమ్మకం, భయమూ రెండూ ఉండవు. అలాంటిది రవి ఉన్న ఇంట్లోకి అతిథిగా ఒక అమ్మాయి వస్తుంది. తను దెయ్యం అని ఫ్రెండ్స్ చెప్పినా వేణు వినడు. అమ్మాయి అడుగుపెట్టిన తర్వాత ఆ భవంతిలో చిత్ర విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటాయి.మరి ఇంతకీ ఆమె ఎవరు? రవి ఇంట్లోకి ఎందుకొచ్చిందో తెలుసుకోవాలంటే అతిథి వెబ్ సిరీస్ చూడాల్సిందే.
View this post on Instagram
‘అతిథి’ వెబ్ సిరీస్ ట్రైలర్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..