ఎన్‌సీసీ డ్రెస్‌లో ఉన్న ఈ స్టార్‌ హీరోను గుర్తుపట్టారా? వెరైటీ కాన్సెప్ట్స్‌తో సినిమాలు.. సపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌

ఎన్‌సీసీ డ్రెస్‌లో ఉన్న ఈ స్టార్‌ హీరోను గుర్తుపట్టారా? 'నలుగురికి నచ్చినది.. నాకసలు నచ్చదులే' అని ఓ సినిమాలో మహేశ్‌ బాబు పాడిన లైన్స్‌ ఈ నటుడికి సరిగ్గా సరిపోతాయి. ఎవరికీ తోచని వెరైటీ కాన్సెప్ట్‌లు, సరికొత్త సబ్జెక్టులతో సినిమాలు చేయడంలో ఈ స్టార్‌ హీరో దిట్ట. ఆయన, ఆయన తీసే సినిమాలకు సపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ ఉంది. చాలామంది ముఖ్యంగా యువత ఆయన సినిమాలను తెగ ఇష్టపడతారు.

ఎన్‌సీసీ డ్రెస్‌లో ఉన్న ఈ స్టార్‌ హీరోను గుర్తుపట్టారా? వెరైటీ కాన్సెప్ట్స్‌తో సినిమాలు.. సపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌
Tollywood Actor
Follow us
Basha Shek

|

Updated on: Sep 18, 2023 | 6:13 PM

ఎన్‌సీసీ డ్రెస్‌లో ఉన్న ఈ స్టార్‌ హీరోను గుర్తుపట్టారా? ‘నలుగురికి నచ్చినది.. నాకసలు నచ్చదులే’ అని ఓ సినిమాలో మహేశ్‌ బాబు పాడిన లైన్స్‌ ఈ నటుడికి సరిగ్గా సరిపోతాయి. ఎవరికీ తోచని వెరైటీ కాన్సెప్ట్‌లు, సరికొత్త సబ్జెక్టులతో సినిమాలు చేయడంలో ఈ స్టార్‌ హీరో దిట్ట. ఆయన, ఆయన తీసే సినిమాలకు సపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ ఉంది. చాలామంది ముఖ్యంగా యువత ఆయన సినిమాలను తెగ ఇష్టపడతారు. పేరుకు కన్నడ నటుడే అయినా తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ స్టార్‌ హీరో సుపరిచితమే. కేవలం హీరోగానే కాదు దర్శకుడిగానూ సత్తాచాటారాయన. రాజకీయాల్లోనూ ప్రవేశించారు. 50వ సినిమాకు రెడీ అవుతోన్న ఈ వెర్సటైల్‌ యాక్టర్‌ ఇవాళ (సెప్టెంబర్‌ 18) పుట్టిన రోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా అతని చిన్ననాటి, అరుదైన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. పై ఫొటో అలాంటిదే. అందులో ఎన్‌సీసీ డ్రెస్‌లో ఎంతో అమాయకంగా కనిపిస్తున్న హీరో ఎవరో గుర్తుపట్టారా మరి? కష్టంగా ఉందా? అయితే సమాధానం కూడా మేమే చెబుదాం లెండి. అతను మరెవరో కన్నడ సూపర్‌ స్టార్ ఉపేంద్ర అలియాస్‌ ఉప్పీ. ఏ, రా, ఉపేంద్ర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైపోయారు హీరో ఉపేంద్ర. సరికొత్త కాన్సెప్టులతో సినిమాలు తీసే ఆయన తెలుగులో రాజశేఖర్‌తో కలిసి ఓంకారం అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. ఆతర్వాత ఉపేంద్ర నటించిన పలు కన్నడ సినిమాలు తెలుగులోకి విడుదలై సూపర్‌ రెస్పాన్స్‌ దక్కించుకున్నాయి.

ఇక కన్యాదానం, ఒకేమాట, రక్తకన్నీరు, నీతోనే ఉంటాను, టాస్‌, సన్నాఫ్‌ సత్యమూర్తి, గని వంటి తెలుగు స్ట్రెయిట్‌ సినిమాల్లో కూడా నటించారు ఉపేంద్ర. కొన్నినెలల క్రితం కబ్జా సినిమాతో పాన్‌ ఇండియా హీరోగా మారిపోయారాయన. ఈ సినిమా నిరాశపర్చినా ఓపెనింగ్‌ కలెక్షన్లు రికార్డు స్థాయిలో వచ్చాయంటే ఉప్పీ కున్న క్రేజ్‌ను ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం కబ్జా సినిమాకు సీక్వెల్‌ రెడీ చేసే పనిలో ఉన్నారు. అలాగే తన సూపర్‌ హిట్‌ సినిమా ఉపేంద్రకు కూడా సెకండ్‌ పార్ట్‌ను తీసే యోచనలో ఉన్నారు. ఇక డైరెక్టర్‌గానూ యూఐ అనే సినిమాను కూడా తెరకెక్కిస్తున్నారు. ఇవాళ ఉపేంద్ర బర్త్‌ డే సందర్భంగా ఈ సినిమా టీజర్‌ కూడా రిలీజైంది. ఇక పుట్టిన రోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఉప్పీకి బర్త్‌డే విషెస్‌ చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఉపేంద్ర ఇన్ స్టాగ్రామ్ పోస్ట్

View this post on Instagram

A post shared by Upendra (@nimmaupendra)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే