TOP 9 ET: అల్లు అర్జున్‌ ఖాతాలో మరో ఘనత.. | విజయ్‌ ఆంటోని కూతురి చివరి వీడియో.

TOP 9 ET: అల్లు అర్జున్‌ ఖాతాలో మరో ఘనత.. | విజయ్‌ ఆంటోని కూతురి చివరి వీడియో.

Anil kumar poka

|

Updated on: Sep 21, 2023 | 9:49 AM

డిప్రెషన్‌తో సూసైడ్ చేసుకున్న విజయ్‌ ఆంటోని కూతురి చివరి వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతూ.. అందర్నీ ఎమోషనల్ అయ్యేలా చేస్తోంది. చెన్నై చర్ఛ్ పార్క్‌ స్కూల్లో ప్లస్ 2 చదువుతున్న మీర.. ఆ స్కూల్లో కల్చలర్ యక్టివిటీ సెక్రటరిగా ఇటీవల నియాకమైంది. ఎంతో కాన్ఫిడెంట్‌గా ప్రమాణ స్వీకారం కూడా చేసింది. అయితే ఇందుకు సంబంధిచిన వీడియోనే ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ పాపా సూసైడ్ చేసుకుంది అనే కామెంట్ వచ్చేలా చేస్తోంది.

01.Allu Arjun
రీజనల్ స్టార్ టూ పాన్ ఇండియన్ స్టార్‌గా ఎదిగిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరో.. ఘనత సాధించారనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అకార్డింగ్ టూ ఆ న్యూస్.. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో.. బన్నీ వ్యాక్స్‌ స్టాచ్యూ ఏర్పాటు చేసేందుకు ఆ మ్యూజియం నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు. ఇక మన పుష్ప రాజ్‌… స్టాచ్యూ కోసం కొలతలిచ్చేందుకు తొందర్లో యూకే కూడా వెళ్లనున్నారట. అయితే అఫీషయిల్ గా కన్ఫర్మ్ కానీ ఈ న్యూస్‌.. బన్నీ ఫ్యాన్స్ కారణంగా.. అఫీషియల్‌ రేంజ్‌లో.. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది,.

02. Vijay Antony Daughter Video
డిప్రెషన్‌తో సూసైడ్ చేసుకున్న విజయ్‌ ఆంటోని కూతురి చివరి వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతూ.. అందర్నీ ఎమోషనల్ అయ్యేలా చేస్తోంది. చెన్నై చర్ఛ్ పార్క్‌ స్కూల్లో ప్లస్ 2 చదువుతున్న మీర.. ఆ స్కూల్లో కల్చలర్ యక్టివిటీ సెక్రటరిగా ఇటీవల నియాకమైంది. ఎంతో కాన్ఫిడెంట్‌గా ప్రమాణ స్వీకారం కూడా చేసింది. అయితే ఇందుకు సంబంధిచిన వీడియోనే ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ పాపా సూసైడ్ చేసుకుంది అనే కామెంట్ వచ్చేలా చేస్తోంది.

03.Samantha
చాలా రోజుల తరువాత సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించిన సమంత ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. అప్‌ కమింగ్ సినిమాల విషయంలో డిఫరెంట్‌గా ఆలోచిస్తానన్న ఈ బ్యూటీ, రెగ్యూలర్‌గా కాకుండా.. తన కంఫర్ట్‌ జోన్ దాటి మరీ సినిమాలు చేయాలనుకుంటున్నా అని చెప్పారు. ఇక సామ్ ప్రస్తుతం బాలీవుడ్ వెబ్‌ సిరీస్ సిటాడెల్‌ వర్క్‌లో బిజీగా ఉన్నారు.

04.ANR
అక్కినేని నాగేశ్వరరావు వందో జయంతి సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఆయన విగ్రహాణ్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అక్కినేనితో వాళ్ల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

05.Devara
దుబాయ్‌లో జరిగిన సైమా అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొని వచ్చిన ఎన్టీఆర్‌, ఈ రోజు నుంచి దేవర షూటింగ్‌లో జాయిన్ అవుతున్నారు. భారీ యాక్షన్‌ ఎపిసోడ్ చిత్రకరణకు ప్లాన్ చేస్తోంది చిత్రయూనిట్‌. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్‌ విలన్‌గా నటిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌.

06. Rakshasa kavya
పాండమిక్ తర్వాత ఓటీటీల్లో నెగటివ్‌ కంటెంట్‌కి ఆదరణ పెరిగిందని అన్నారు ప్రముఖ నిర్మాత దిల్‌రాజు. ఆ ట్రెండ్‌ని పట్టుకుని రాక్షస కావ్యం సినిమా చేశారని అన్నారు. ఇప్పటి ఆడియన్స్ కి కావాల్సిన పర్ఫెక్ట్ సినిమా రాక్షస కావ్యం అని ప్రశంసించారు దిల్‌రాజు.

07.Gangs
విశ్వక్‌సేన్ హీరోగా తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ఎనౌన్స్‌ చేశారు. వినాయకచవితి సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో డిసెంబర్‌ 8న ఈ సినిమా రిలీజ్ అవుతుందని క్లారిటీ ఇచ్చారు. నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీకి యువన్ శంకర్‌ రాజా సంగీతమందిస్తున్నారు.

08.Jawan
షారూఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ జవాన్‌. భారీ వసూళ్లు సాధిస్తున్న ఈ సినిమాను ఆస్కార్‌కు తీసుకెళ్లే ఆలోచనలో ఉంది చిత్రయూనిట్‌. తాజాగా ఇదే విషయాన్ని నేషనల్ మీడియాతో పంచుకున్నారు అట్లీ. జవాన్‌ను ఆస్కార్‌కు తీసుకెళ్లటంపై షారూఖ్‌తో చర్చిస్తున్నామని చెప్పారు

09.Aryank Khan
షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా పరిచయం అవుతూ రూపొందిస్తున్న వెబ్‌ షో షూటింగ్ ఫైనల్ స్టేజ్‌కు చేరింది. ప్రస్తుతం చివరి షెడ్యూల్‌ చిత్రీకరణలో ఉన్నారు ఆర్యన్‌. ఆరు ఎపిసోడ్స్‌గా రిలీజ్‌ కానున్న ఈ షోకు స్టార్ డమ్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఈ షోలో టాప్‌ బాలీవుడ్‌ సెలబ్రిటీస్‌ గెస్ట్ రోల్స్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..