AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gandeevadhari Arjuna OTT: ఇట్స్‌ అఫీషియల్‌.. ఓటీటీలోకి ‘గాండీవ ధారి అర్జున’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ హీరోగా క్రియేటివ్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌ సత్తారు తెరకెక్కించిన సినమా 'గాండీవ ధారి అర్జున'. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ మూవీలో ఏజెంట్ బ్యూటీ సాక్షి వైద్యలో కథానాయికగా నటించింది. విరూపాక్ష లాంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ సినిమాను నిర్మించిన బీవీఎస్‌ఎసన్‌ ప్రసాద్‌ ఎస్వీసీసీ బ్యానర్‌పై గాంఢీవ ధారి అర్జున సినిమాను రూపొందించారు. మిక్కీ జే మేయర్ బాణీలు సమకూర్చారు. ఈ సినిమా పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లు హాలీవుడ్

Gandeevadhari Arjuna OTT: ఇట్స్‌ అఫీషియల్‌.. ఓటీటీలోకి 'గాండీవ ధారి అర్జున'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Gandeevadhari Arjuna Movie
Basha Shek
|

Updated on: Sep 20, 2023 | 7:44 PM

Share

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ హీరోగా క్రియేటివ్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌ సత్తారు తెరకెక్కించిన సినమా ‘గాండీవ ధారి అర్జున’. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ మూవీలో ఏజెంట్ బ్యూటీ సాక్షి వైద్యలో కథానాయికగా నటించింది. విరూపాక్ష లాంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ సినిమాను నిర్మించిన బీవీఎస్‌ఎసన్‌ ప్రసాద్‌ ఎస్వీసీసీ బ్యానర్‌పై గాంఢీవ ధారి అర్జున సినిమాను రూపొందించారు. మిక్కీ జే మేయర్ బాణీలు సమకూర్చారు. ఈ సినిమా పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లు హాలీవుడ్ యాక్షన్‌ సినిమాను తలపించినా తీరా థియేటర్లలోకి వచ్చాక మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. సినిమాలో మితిమీరిన యాక్షన్‌ సన్నివేశాలు ఉండడం, ఆసక్తికరంగా కథ లేకపోవడంతో ప్రేక్షకులు పెదవి విరిచారు. ఆగస్టు 25న థియేటర్లలోకి వచ్చిన గాండీవధారి బాక్సాఫీస్‌ వద్ద ఓ మోస్తరు కలెక్షన్లతో సరిపెట్టుకుంది. ఇప్పుడీ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ వరుణ్‌ తేజ్‌ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను సొంతం చేసుకుంది. సెప్టెంబర్‌ 24 నుంచి గాండీవధారి అర్జున ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది సదరు ఓటీటీ సంస్థ. ‘సెప్టెంబరు 24న రానున్నది గాండీవధారి అర్జున సినిమానే కాదు ఓ ఏజెంట్‌ తెచ్చే ధైర్యం కూడా’ అని ఇందులో పేర్కొంది నెట్‌ఫ్లిక్స్‌.

గాండీవధారి అర్జున సినిమా అంతా లండన్‌ నేపథ్యంలో సాగుతుంది. వరుణ్ తేజ్‌ జవాన్‌గా, బాడీగార్డ్‌గా రెండు రోల్స్‌లో కనిపిస్తారు. సాక్షి వైద్యతో పాటు నాజర్‌, వినయ్‌రాయ్‌, విమలారామన్‌, మనీష్‌ చౌదరి, రవి వర్మ, రోషిణీ ప్రకాష్‌, అభినవ్‌ గోమఠం తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. జవాన్‌ గా పనిచేసిన అర్జున్‌ (వరుణ్‌ తేజ్‌) ఓ ఏజెన్సీ తరఫున లండన్‌లో బాడీ గార్డుగా జాయిన్‌ అవుతాడు. జీ 20 సదస్సు కోసం యూకే వెళ్లిన కేంద్రమంత్రి ఆదిత్య రాజ్‌ బహదూర్‌ ను కాపాడేందుకు రంగంలోకి దిగుతాడు. మరి అక్కడ కేంద్రమంత్రిని చంపాలన్న కుట్ర వెనక ఎవరున్నారు? అందుకు కారణమేంటి? ప్రమాదంలో ఉన్న ఆదిత్య రాజ్‌ ప్రాణాలను అర్జున్‌ కాపాడాడా? ఇందులో ఐఏఎస్‌ సారా (సాక్షి వైద్య), రణ్‌వీర్‌ (వినయ్‌ రాయ్‌) రోల్స్‌ ఏమిటి? అన్నది తెలుసుకోవాలంటే గాండీవధారి అర్జున సినిమా చూడాల్సిందే. మరి థియేటర్లలో ఈ సినిమాను మిస్‌ అయ్యారా? అయితే ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. ఈ సినిమా తర్వాత మట్కా అనే సినిమాలో నటిస్తున్నాడు వరుణ్‌ తేజ్‌. పలాస ఫేమ్‌ కరుణ్‌ కుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
విజేతకే కాదు.. రన్నరప్‌తోపాటు ఆ జట్లపైనా కాసుల వర్షం.. !
విజేతకే కాదు.. రన్నరప్‌తోపాటు ఆ జట్లపైనా కాసుల వర్షం.. !
ఏడాది పాటు వచ్చే ఆకు కూరలు.. ఒక్కసారి నాటితే 365 రోజులు కూరలే ..
ఏడాది పాటు వచ్చే ఆకు కూరలు.. ఒక్కసారి నాటితే 365 రోజులు కూరలే ..
ఆ సినిమా ఫ్లాప్ అని ప్రభాస్‌కు చెబితే షాక్ అయ్యాడు.. చివరకు
ఆ సినిమా ఫ్లాప్ అని ప్రభాస్‌కు చెబితే షాక్ అయ్యాడు.. చివరకు
ఇదో వింత ప్రేమాయణం..1995 నాటి ప్రేయసి ముందు లక్షలు పోసినా తక్కువే
ఇదో వింత ప్రేమాయణం..1995 నాటి ప్రేయసి ముందు లక్షలు పోసినా తక్కువే
వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..? రుతుపవనాలపై బిగ్ అప్డేట్
వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..? రుతుపవనాలపై బిగ్ అప్డేట్
మీ గోళ్లే మీ ఆరోగ్యాన్ని తెలియజేస్తాయని తెలుసా?
మీ గోళ్లే మీ ఆరోగ్యాన్ని తెలియజేస్తాయని తెలుసా?
కేంద్రం ఇలా చేస్తే పెట్రోల్‌ ధర లీటర్‌కు రూ.22 వరకు తగ్గుతుంది?
కేంద్రం ఇలా చేస్తే పెట్రోల్‌ ధర లీటర్‌కు రూ.22 వరకు తగ్గుతుంది?
SRH బ్యాటర్ల ఊచకోత.. ఐపీఎల్ హిస్టరీలోనే భువీ చెత్త రికార్డ్..!
SRH బ్యాటర్ల ఊచకోత.. ఐపీఎల్ హిస్టరీలోనే భువీ చెత్త రికార్డ్..!
పిల్లలకు ఎంతో ఇష్టమైన మట్కా కుల్ఫీ.. ఇంట్లో ఎలా చేయాలి అంటే
పిల్లలకు ఎంతో ఇష్టమైన మట్కా కుల్ఫీ.. ఇంట్లో ఎలా చేయాలి అంటే
ఈ ఒక వస్తువు మీ ఇంట్లో ఉంటే చాలు.. లక్ష్మీ కటాక్షం ఎప్పుడూ మీపైనే
ఈ ఒక వస్తువు మీ ఇంట్లో ఉంటే చాలు.. లక్ష్మీ కటాక్షం ఎప్పుడూ మీపైనే