Papam Pasivadu: ర్యాంప్ ఆడించే ర్యాప్.. పాపం పసివాడు టైటిల్ సాంగ్ వచ్చేసింది.. ఆహాలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఇండియన్ ఐడల్ విజేత, ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్, హోస్ట్ శ్రీరామచంద్ర ఇప్పుడు నటుడిగా ఎంట్రీ ఇవ్వనున్నారు. ఆయన కీలక పాత్రలో నటిస్తోన్న మొదటి వెబ్ సిరీస్ పాపం పసివాడు. లలిత్ కుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సిరీస్‌లో రాశీసింగ్, గాయత్రి చాగంటి, శ్రీవిద్యా మహర్షి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ది వీకెండ్ షో బ్యానర్‌పై అఖిలేష్ వర్ధన్ పాపం పసివాడు వెబ్ సిరీస్‌ను నిర్మించారు.
ఇండియన్ ఐడల్ విజేత, ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్, హోస్ట్ శ్రీరామచంద్ర ఇప్పుడు నటుడిగా ఎంట్రీ ఇవ్వనున్నారు. ఆయన కీలక పాత్రలో నటిస్తోన్న మొదటి వెబ్ సిరీస్ పాపం పసివాడు. లలిత్ కుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సిరీస్‌లో రాశీసింగ్, గాయత్రి చాగంటి, శ్రీవిద్యా మహర్షి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ది వీకెండ్ షో బ్యానర్‌పై అఖిలేష్ వర్ధన్ పాపం పసివాడు వెబ్ సిరీస్‌ను నిర్మించారు. ఇప్పటికే అన్నిహంగులు పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో సెప్టెంబర్ 29 నుంచి ఈ వెబ్ సిరీస్ అందుబాటులోకి రానుంది. తాజాగా ‘పాపం పసివాడు’ ఒరిజినల్‌లోని పాటను రిలీజ్ చేశారు మేకర్స్. ర్యాంప్ ఆడించే ర్యాప్ సాంగ్ వచ్చేసింది. ఈ పసివాడి కన్ఫ్యూజన్‌కి ఒక థీమ్ సాంగ్’ అంటూ ఈ పాటను విడుదల చేశారు మేకర్స్. వెబ్ సిరీస్‌లోని పాత్రలను తరచి చూస్తూనే భావోద్వేగ ప్రయాణాన్ని ఈ పాటలో ఆవిష్కరించారు మేకర్స్. ఈ ర్యాప్ సాంగ్‌కు జోస్ జిమ్మీ ట్యూన్ అందించగా, ఆదిత్య రావ్ గంగసాని ఆలపించారు. ఇక పాటలోని ఓకల్స్‌ను కార్తీక వైద్యనాథన్, ఐశ్వర్య దస్తూరి ఆలపించారు. కాగా పాపం పసివాడు వెబ్ సిరీస్‌లో మొత్తం 5 ఎపిసోడ్స్ ఉంటాయి. ప్రేమలో చిక్కుకున్న ఓ యువకుడి జీవితంలో ఎలాంటి గందరగోళం క్రియేట్ అయ్యిందనే విషయాన్ని అందరూ ఎంజాయ్ చేసేలా చక్కగా తెరకెక్కించారు.
పాపం పసివాడు సిరీస్ విషయానికి వస్తే ఇందులో పాతికేళ్ల కుర్రాడైన మన కథానాయకుడు క్రాంతి ప్రేమ కోసం హృదయమంతా బాధతో పరితపిస్తూ ఎదురు చూస్తుంటాడు. అయితే ఉన్నట్లుండి ఒకరు కాదు ఇద్దరు కాదు.. ముగ్గురు అమ్మాయిలు అతని జీవితంలోకి ప్రవేశిస్తారు. దాంతో అతని జీవితంలో ఊహించిన ఘటనలు జరుగుతాయి. లైఫ్ అనేక మలుపులు తిరుగుతుంది. ఈ రొమాంటిక్ జర్నీలోకి విషయాల చుట్టూ కథ నడుస్తున్నప్పుడు తెలియని గందరగోళం క్రియేట్ అవుతుంది. దాన్ని ప్రేక్షకులు ఎంతో ఎంజాయ్ చేస్తారు. ఈ సిరీస్‌కు అనుబంధంగానే ఆహా ..‘పాపం పసివాడు’ అనే పాటను విడుదల చేసింది. పాపం పసివాడు సిరీస్ కు కైషోర్ కృష్ణ సహ దర్శకుడిగా, గౌకుల్ భారతి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. నిఖిల్ స్పై సినిమాకు దర్శకత్వం వహించిన గ్యారీ బీహెచ్ ఈ సిరీస్ కు ఎడిటర్ కాగా, విజయ్ మక్కెన ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. మరి ఇప్పటివరకు సింగర్‌గా, హోస్ట్‌గా ఆకట్టుకున్న శ్రీరామచంద్రం పాపం పసివాడులో సరికొత్త అవతారంలో కనిపించనున్నారని, ఇది అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంటుందంటున్నారు మేకర్స్.
పాపం పసివాడు టైటిల్ సాంగ్ రిలీజ్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..