- Telugu News Photo Gallery Cinema photos Actress Trisha Krishnan likely to tie the knot with Malayalam Producer says reports
Trisha: త్వరలో పెళ్లిపీటలెక్కనున్న త్రిష! ఆ నిర్మాతతో కలిసి ఏడడుగులు నడవనున్న అందాల తార
సినిమా ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలం పాటు కెరీర్ కొనసాగుతోన్న హీరోయిన్లలో త్రిష ఒకరు. సుమారు 15 ఏళ్లకు పైగా హీరోయిన్‌గా సినిమాలు చేస్తుందామె. మధ్యలో కొంతకాలంలో గ్యాప్ ఇచ్చినా ఇప్పుడు మళ్లీ జెట్ స్పీడ్‌లో సినిమాలు చేస్తోది. ముఖ్యంగా మణిరత్నం తెరకెక్కించిన 'పొన్నియిన్ సెల్వన్ 1', 'పొన్నియిన్ సెల్వన్ 2' సినిమాలతో త్రిష కెరీర్ స్పీడందుకుంది.
Updated on: Sep 20, 2023 | 9:38 PM

సినిమా ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలం పాటు కెరీర్ కొనసాగుతోన్న హీరోయిన్లలో త్రిష ఒకరు. సుమారు 15 ఏళ్లకు పైగా హీరోయిన్‌గా సినిమాలు చేస్తుందామె. మధ్యలో కొంతకాలంలో గ్యాప్ ఇచ్చినా ఇప్పుడు మళ్లీ జెట్ స్పీడ్‌లో సినిమాలు చేస్తోది. ముఖ్యంగా మణిరత్నం తెరకెక్కించిన 'పొన్నియిన్ సెల్వన్ 1', 'పొన్నియిన్ సెల్వన్ 2' సినిమాలతో త్రిష కెరీర్ స్పీడందుకుంది. 2. ఇప్పుడు ఆమె దళపతి విజయ్ సినిమాలో హీరోయిన్ నటిస్తోంది. సినిమా

ఇప్పుడు ఆమె దళపతి విజయ్ సినిమాలో హీరోయిన్ నటిస్తోంది. సినిమాల సంగతి పక్కన పెడితే.. త్రిష వ్యక్తిగత జీవితానికి సంబంధించి సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరలవుతోంది. త్వరలోనే ఆమె పెళ్లిపీటలెక్కనుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

కాగా త్రిష వయసు ఇప్పుడు 40 ఏళ్లు. గతంలో ఒక వ్యాపారవేత్తతో నిశ్చితార్థం చేసుకుంది. అయితే ఏమైందో తెలియదు కానీ వెంటనే అతనికి బ్రేకప్ చెప్పేసింది. మరోవైపు త్రిషను రీల్ లైఫ్‌లో పెళ్లి కూతురిగా చూడాలనుకుంటున్నారు ఫ్యాన్స్. అయితే ఇప్పుడా శుభముహూర్తానికి సమయం ఆసన్నమైందని అంటున్నారు. ఓ మలయాళ నిర్మాతను త్రిష పెళ్లి చేసుకోనుందని సమాచారం.

అయితే త్రిష పెళ్లిచేసుకోనున్నా ఆ నిర్మాత ఎవరు? మరి పెళ్లి ఎప్పుడు జరుగుతుందనే విషయాలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. జనవరి 23, 2015న చెన్నైకి చెందిన వ్యాపారవేత్త వరుణ్ మణియన్‌తో త్రిష నిశ్చితార్థం జరిగింది. అయితే మూడు నెలలకే అంటే మే 2015లో ఇద్దరూ విడిపోయారు. దీనికి కారణం ఇంకా తెలియరాలేదు.

విజయ్, త్రిష నటించిన లియో సినిమా త్వరలోనే విడుదల కానుంది. దీనికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో పాటు పలు తమిళ్, మలయాళ సినిమాల్లో నటిస్తోందీ అందాల తార.





























