AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth Praveen : 9వ తరగతిలోనే తల్లి మరణం.. నాన్న చనిపోయాక చెడ్డపేరు రావొద్దని.. జబర్దస్త్ ప్రవీణ్ జీవితంలో ఇన్ని కష్టాలా..

జబర్దస్త్ ప్రవీణ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. పటాస్ షోతో ఫేమ్ తెచ్చుకుని ఇప్పుడు జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ.. లాంటి పలు షోలతో బిజీగా ఉన్నాడు. అప్పుడప్పుడు పలు సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. ఇటీవలే వంశిత అనే నటి, డ్యాన్సర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తన నటన, కామెడీ పంచులతో తక్కువ సమయంలోనే పాపులర్ అయ్యాడు ప్రవీణ్.

Jabardasth Praveen : 9వ తరగతిలోనే తల్లి మరణం.. నాన్న చనిపోయాక చెడ్డపేరు రావొద్దని.. జబర్దస్త్ ప్రవీణ్ జీవితంలో ఇన్ని కష్టాలా..
Jabardasth Praveen
Rajitha Chanti
|

Updated on: May 17, 2026 | 7:08 PM

Share

తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షో ద్వారా తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నవారు చాలా మంది ఉన్నారు. అందులో ప్రవీణ్ ఒకరు. అంతకుముందే పటాస్ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన ప్రవీణ్.. జబర్దస్త్ షో ద్వారా మరింత ఫేమస్ అయ్యాడు. ఇప్పుడు బుల్లితెరపై పలు షోలతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే తనతోటి నటి వంశిత అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడిప్పుడే కొత్త లైఫ్ స్టార్ట్ చేసిన ప్రవీణ్.. తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తండ్రి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. అలాగే తన కెరీర్, లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ప్రవీణ్ తండ్రి 2022లో మరణించారు. తన తండ్రి మరణం తర్వాత తాను చేసిన పని గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

ఎక్కువ మంది చదివినవి : Sai Pallavi : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. అతడంటే చెప్పలేనంత ఇష్టం.. మనసులోని మాట చెప్పిన సాయి పల్లవి..

ప్రవీణ్ మాట్లాడుతూ.. “కొన్నాళ్ల క్రితం మా నాన్న చనిపోయారు. ఆయన అప్పులు చేయలేదు. కానీ షూరిటీ సంతకాలు పెట్టారు. దీంతో ఆ డబ్బులు మేము కట్టాల్సి వచ్చింది. మా నాన్న చనిపోయాక ఆయనకు చెడ్డ పేరు రావొద్దని నేను దాచుకున్న డబ్బులు మొత్తం కట్టేసాను. అలా ఆర్థికంగా ఒకటి రెండు దెబ్బలు పడ్డాయి. చేసింది ఆయన కదా అని నేను డబ్బులు ఇవ్వకపోతే.. జనాల డబ్బులు ఎగ్గొట్టి నేను ఇల్లు, కారు కొనుకున్నా అంటారు. అందుకే ఆయనకు చెడ్డ పేరు రాకూడదని మొత్తం అప్పులు తీర్చేశా. పదవ తరగతి పూర్తి కాగానే ఇండస్ట్రీలోకి వచ్చాను. అప్పుడు మా నాన్న నాకు ఎంతో సపోర్ట్ చేశారు. 9వ తరగతిలోనే అమ్మ చనిపోయింది. మమ్మల్ని పెంచడానికి ఆయన మరో పెళ్లి చేసుకోలేదు. ఇండస్ట్రీకి వచ్చాక భయపడితే ఎంతో ధైర్యం చెప్పారు” అంటూ ఎమోషనల్ అయ్యాడు.

ఎక్కువ మంది చదివినవి : Actor : ఏంటీ సర్.. ఇలా మారిపోయారు.. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్.. కట్ చేస్తే.. ఆటో డ్రైవర్‏గా పనిచేస్తున్న పాపులర్ నటుడు..

జబర్దస్త్ షో ద్వారా కమెడియన్ గా తనను తాను నిరూపించుకున్నానని చెప్పుకొచ్చాడు ప్రవీణ్. డబ్బులు సంపాదించి అక్కడకు ఇక్కడకు వెళ్లాలని లేదని.. కానీ తనకు నచ్చింది చేస్తానని చెప్పుకొచ్చాడు. బుల్లితెరపై తన కామెడీతో నవ్వించే ప్రవీణ్ నిజ జీవితంలో మాత్రం ఎన్నో కష్టాలను, సవాళ్లను ఎదుర్కొన్నాడు.

ఎక్కువ మంది చదివినవి : యూట్యూబ్ నుంచి 30 లక్షల సంపాదన.. అసలు విషయం చెప్పిన సీరియల్ నటి..

ఎక్కువ మంది చదివినవి : Vijay Deverakonda : విజయ్ దేవరకొండ గుండెలపై కాలు పెట్టిన హీరోయిన్.. రౌడీ జనార్దన్ నుంచి పోస్టర్ రిలీజ్..

Follow Us