AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కూతురిని వరల్డ్ నంబర్ వన్‌గా నిలిపిన తల్లి.. 60+లో ఊహించని ఫిట్‌నెస్ ఛాలెంజ్!

భారత బ్యాడ్మింటన్ స్టార్, మాజీ వరల్డ్ నంబర్ వన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ తన ఆటతీరుతో దేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా ఎలా చాటిందో మనందరికీ తెలిసిందే. అయితే ఆమెను ఆ స్థాయికి చేర్చిన వెనుక ఒక గట్టి నమ్మకం, అకుంఠిత దీక్ష కలిగిన తల్లి హస్తం ఉంది. వయసు కేవలం ఒక నంబర్ మాత్రమేనని నిరూపిస్తూ, సైనా తల్లి వర్కవుట్ చేస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

కూతురిని వరల్డ్ నంబర్ వన్‌గా నిలిపిన తల్లి.. 60+లో ఊహించని ఫిట్‌నెస్ ఛాలెంజ్!
Saina Nehwal With Her Mother
Nikhil
|

Updated on: May 17, 2026 | 6:32 PM

Share

సూర్య నమస్కారాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచిన సైనా నెహ్వాల్ తల్లి, తాజాగా సాంప్రదాయ భారతీయ వ్యాయామమైన ‘ఉతక్ బైఠక్’ (స్క్వాట్స్) చేస్తూ సోషల్ మీడియాలో సరికొత్త ఫిట్‌నెస్ గోల్స్‌ను సెట్ చేస్తోంది. తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్‌లో ఈ వీడియోను షేర్ చేస్తూ.. “ఆమె ఎప్పుడూ లొంగిపోదు.. నన్ను ప్రపంచ నంబర్ 1 స్థానానికి చేర్చిన నా తల్లి.. నా ఫైటర్ మామ్” అంటూ ఎంతో గర్వంగా రాసుకొచ్చింది సైనా. ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకోవడంతో పాటు, గూగుల్ ట్రెండ్స్‌లో సైతం టాప్‌లో నిలిచింది.

‘ఉతక్ బైఠక్’ ప్రాముఖ్యత

శరీర బరువు ఆధారంగా చేసే లోతైన స్క్వాట్స్‌ను మన దేశంలో సాంప్రదాయకంగా ‘ఉతక్ బైఠక్’ అని పిలుస్తారు. ఇది కేవలం ఒక సాధారణ వ్యాయామం మాత్రమే కాదు, శారీరక దృఢత్వానికి అద్భుతమైన సాధనం అని క్లినికల్ డైటీషియన్ మరియు ఫిట్‌నెస్ నిపుణులు పేర్కొంటున్నారు.

  • ఈ వ్యాయామం ప్రధానంగా తొడలు (క్వాడ్రిసెప్స్), పిరుదులు (గ్లూట్స్), హామ్‌స్ట్రింగ్స్ మరియు కోర్ కండరాలపై ప్రభావం చూపిస్తుంది. వృద్ధాప్యంలో ఎవరి సహాయం లేకుండా స్వతంత్రంగా జీవించడానికి ఈ కండరాలు బలంగా ఉండటం చాలా ముఖ్యం.
  • కిందకు కూర్చుని మళ్లీ సులభంగా పైకి లేవగలగడం అనేది మంచి కండరాల బలానికి, కీళ్ల కదలికలకు (మొబిలిటీ) నిదర్శనం. ఇది వయసు పైబడిన వారిలో ఆకస్మికంగా కింద పడిపోయే ప్రమాదాలను (ఫాల్ రిస్క్) తగ్గించి, జీవన నాణ్యతను మెరుగుపరుస్తుంది.
  • జిమ్‌లలో ఉండే మెషిన్ల సహాయంతో చేసే వర్కవుట్ల కంటే, ఇవి రోజువారీ జీవితంలో మనం చేసే సహజమైన కదలికలకు శిక్షణ ఇస్తాయి. నియంత్రిత పద్ధతిలో చేసే ఈ వ్యాయామం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడటమే కాకుండా, కీళ్ల మధ్య లూబ్రికేషన్ (జిగురు) సక్రమంగా అందుతుంది.
  • బరువును మోస్తూ చేసే ఇలాంటి వ్యాయామాలు ఎముకల సాంద్రతను (బోన్ డెన్సిటీ) పెంచుతాయి. ముఖ్యంగా మహిళల్లో మెనోపాజ్ తర్వాత వచ్చే ఆస్టియోపోరోసిస్ (ఎముకల బలహీనత) వ్యాధి ముప్పును తగ్గించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.

జాగ్రత్తలు తప్పనిసరి

ఈ వ్యాయామం ఎంతో మేలు చేసినప్పటికీ, శారీరక సామర్థ్యాన్ని బట్టి మాత్రమే దీనిని చేయాలి. తీవ్రమైన మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పి లేదా బ్యాలెన్స్ తప్పే సమస్యలు ఉన్నవారికి ఈ డీప్ స్క్వాట్స్ సరిపోకపోవచ్చు. అలాంటి వారు నేరుగా కిందకు కూర్చోకుండా.. ఒక కుర్చీ మద్దతు తీసుకుని గానీ, లేదా తక్కువ లోతు వరకు మాత్రమే వంగుతూ మోడిఫైడ్ వెర్షన్స్ చేయడం సురక్షితం. ఈ వైరల్ వీడియో కేవలం శారీరక వ్యాయామాన్ని మాత్రమే కాకుండా, ఆలోచనా విధానంలో రావాల్సిన మార్పును చూపిస్తోంది. ఫిట్‌నెస్ అనేది వయసుతో ముడిపడి ఉన్నది కాదు, అది క్రమశిక్షణ, నిరంతర సాధనపై ఆధారపడి ఉంటుంది.

Follow Us
నరాల బలహీనతకు, శరీర బలానికి కత్తిలాంటి ఫుడ్.. నెలకు ఒక్కసారైనా ఈ
నరాల బలహీనతకు, శరీర బలానికి కత్తిలాంటి ఫుడ్.. నెలకు ఒక్కసారైనా ఈ
బటర్ వర్సెస్ చీజ్.. డైట్‌లో ఉన్న వారికి ఏది బెస్ట్..
బటర్ వర్సెస్ చీజ్.. డైట్‌లో ఉన్న వారికి ఏది బెస్ట్..
కేవలం రెండున్నర గంటల్లోనే తిరుపతి వెళ్లొచ్చు.. కొత్త హైవే..
కేవలం రెండున్నర గంటల్లోనే తిరుపతి వెళ్లొచ్చు.. కొత్త హైవే..
శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం.. ఇక్కడ స్నానం చేస్తే..
శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం.. ఇక్కడ స్నానం చేస్తే..
నలుగురు ఫట్.. ఇద్దరు హిట్.. టీ20 సిరీస్‌ నేర్పిన 5 కీలక పాఠాలు..!
నలుగురు ఫట్.. ఇద్దరు హిట్.. టీ20 సిరీస్‌ నేర్పిన 5 కీలక పాఠాలు..!
కివీస్‌తో వన్డే సిరీస్‌.. ఈ నలుగురు బెంచ్‌కే ఫిక్స్.. ఎందుకంటే?
కివీస్‌తో వన్డే సిరీస్‌.. ఈ నలుగురు బెంచ్‌కే ఫిక్స్.. ఎందుకంటే?
పొలంలో పని చేస్తుండగా పంజా విసిరిన చిరుతపులి.. ఆ తర్వాత..
పొలంలో పని చేస్తుండగా పంజా విసిరిన చిరుతపులి.. ఆ తర్వాత..
మహిళలకు తెలంగాణ ప్రభుత్వం దీపావళి గిఫ్ట్
మహిళలకు తెలంగాణ ప్రభుత్వం దీపావళి గిఫ్ట్
రాత్రైతే చాలు గ్రామంలో వింత ఆకారం.. ఏంటని సీసీ కెమెరాలు చూడగా..
రాత్రైతే చాలు గ్రామంలో వింత ఆకారం.. ఏంటని సీసీ కెమెరాలు చూడగా..
కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టిస్తోన్న ముద్దుగుమ్మ..
కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టిస్తోన్న ముద్దుగుమ్మ..