AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆదిలాబాద్ రిమ్స్‌లో కీచకపర్వం.. వైద్య విద్యార్థినిపై నర్సింగ్ ఆఫీసర్ అరాచకం!

ఆదిలాబాద్ రాజీవ్ గాంధీ వైద్య విజ్ఞాన సంస్థ (RIMS) లో దారుణం వెలుగుచూసింది. విధుల్లో ఉన్న ఒక వైద్య విద్యార్థినిపై ఓ నర్సింగ్ ఆఫీసర్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. ఈ షాకింగ్ ఘటనతో ఆదిలాబాద్ రిమ్స్ వైద్య విద్యార్థి లోకం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సదరు అధికారికి అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఆదిలాబాద్ రిమ్స్‌లో కీచకపర్వం.. వైద్య విద్యార్థినిపై నర్సింగ్ ఆఫీసర్ అరాచకం!
Adilabad Rims Hospital
Naresh Gollana
| Edited By: |

Updated on: May 17, 2026 | 6:21 PM

Share

ఆదిలాబాద్ రాజీవ్ గాంధీ వైద్య విజ్ఞాన సంస్థ (RIMS) లో దారుణం వెలుగుచూసింది. విధుల్లో ఉన్న ఒక వైద్య విద్యార్థినిపై ఓ నర్సింగ్ ఆఫీసర్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సదరు అధికారికి అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో ఓ కీచకుడి బాగోతం బట్టబయలైంది. మహిళా వైద్య విద్యార్థులకు రక్షణగా ఉండాల్సిన ఓ నర్సింగ్ ఆఫీసర్ కామంతో కల్లు మూసుకుపోయి దారుణానికి ఒడిగట్టాడు. ఓ అర్థరాత్రి రిమ్స్ ఆస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్ లో విధులు ముగించుకుని హాస్టల్ కు వెళ్లేందుకు సిద్దమైన ఓ వైద్య విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆపరేషన్ థియేటర్ డోర్లు మూసివేసి ఆ జూనియర్ డాక్టర్ పై దారుణానికి యత్నించాడు. వెంటనే అలర్ట్ అయిన వైద్య విద్యార్థిని పెద్ద పెద్ద కేకలు వేస్తూ ఆ కామాంధుడి చెర నుండి బయటపడి ఆస్పత్రి బయటకు పరుగులు తీసింది. ఈ షాకింగ్ ఘటనతో ఆదిలాబాద్ రిమ్స్ వైద్య విద్యార్థి లోకం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటన వారం రోజుల క్రితం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది‌.

మే నెల 8వ తేదీన అర్థరాత్రి ఓ వైద్య విద్యార్థిని రిమ్స్ ఆస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్ లో విధులు ముగించుకుని హాస్టల్ కు వెళ్లేందుకు సిద్దమైంది. ఇదే సమయంలో ఆ ఆపరేషన్ థియేటర్ రూంలో మేల్ స్టాప్ నర్స్ గా విధులు నిర్వహిస్తున్న కోటేవార్ సాయిరాం అనే నర్సింగ్ ఆఫీసర్ అసభ్యంగా ప్రవర్తించాడు. భోజనం చేస్తారంటూ మాటలు కలిపి తాకరాని చోట తాకేందుకు యత్నించాడు. ఈ హఠాత్తు పరిణామంతో షాక్ కు గురైన వైద్య విద్యార్థిని పెద్ద పెద్ద గా కేకలు వేస్తూ బయటకు పరుగెత్తింది. ఆపరేషన్ థియేటర్ డోర్ పెట్టి ఆ వైద్య విద్యార్థిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు ఆ నర్సింగ్ ఆఫీసర్. ధైర్యంగా ఆ కామాంధుడిని తోసుకుంటూ ఆస్పత్రి జనరల్ వార్డ్ లోకి పరుగులు తీసింది ఆ వైద్య విద్యార్థిని. ఈ విషయం తెలుసుకున్న తోటి జూడాలు ఆ నర్సింగ్ ఆఫీసర్ పట్టుకునే ప్రయత్నం చేయగా ఆస్పత్రి‌ నుండి పరారయ్యాడు.

ఈ విషయాన్ని మరుసటి రోజు రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, జూడాల దృష్టికి తీసుకెళ్లగా.. వెంటనే అలర్ట్ అయిన డైరక్టర్ ఏడుగురు సభ్యులతో విచారణ కమిటీని వేశారు. ప్రాథమిక విచారణలో ఘటన నిజమేనని తేలడంతో, ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్, క్షేత్రస్థాయిలో లోతైన విచారణ జరపాలని మహిళా శిశు సంక్షేమ శాఖను ఆదేశించారు.

మరో వైపు ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా జాగ్రత్తగా వ్యవహారించారు. ఈ సంఘటనను కలెక్టర్ రాజర్షి షా దృష్టికి తీసుకెళ్లడంతో క్షేత్రస్థాయిలో లోతైన విచారణ చేపట్టాలని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని ఆదేశించారు. ఈనెల 10వ తేదీన విచారణ చేపట్టిన డీడబ్ల్యూఓ అదికారిని నర్సింగ్ ఆఫీసర్ వైద్య విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పట్టుగా తేల్చారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టి నిందితుడు సాయిరాంను ఈ నెల 13వ తేదీన అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అయితే విషయం కాస్త బయటకు పొక్కడంతో రిమ్స్ లో కీచక పర్వం వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అటు వైద్య విద్యార్థినుల్లో వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళనకు కారణమైంది. జూడాలకే రక్షణ లేకుంటే ఇక మా పరిస్థితి ఏంటని రిమ్స్ లోని కింది స్థాయి సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ భద్రత చర్య లు తీసుకోవాలని జూనియ ర్ వైద్యుల సంఘం నాయకులు, వైద్య విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ఘటన చోటు‌చేసుకోవడం దురదృష్టకరమని.. మరోసారి‌ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపడుతామని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తెలిపారు. గతంలో వైద్య విద్యార్థుల రీల్స్ వ్యవహారం సంచలనం సృష్టించగా.. తాజాగా వైద్య విద్యార్థినిపై లైంగిక వేదింపుల ఘటనతో రిమ్స్ లో అసలు ఏం జరుగుతుంది అన్న చర్చ తెర పైకి వచ్చింది.

అయితే ఈ ఘటన సున్నితమైనది కావడంతోనే జిల్లా యంత్రాంగం చాలా జాగ్రత్తగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. నిందితుడి వివరాలు సైతం గోప్యంగా ఉంచింది. నిందితుడిపై బీఎన్ఎస్ 75, 78, 127(2) సెక్షన్ల‌ కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు ఆదిలాబాద్ టూటౌన్ పోలీసులు. ఇలాంటి ఘటనలు రిమ్స్ లో మరోసారి చోటు‌ చేసుకోకుండా రక్షణ చర్యలు చేపడుతామని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us