AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదేం ట్రాఫిక్‌ బాబోయ్.. 4 కిలోమీటర్లకు 47 నిమిషాలా..? ఈ రోజు బయల్దేరితే రేపటికి చేరుతాం!

బెంగళూరు నగరం అనగానే అందరికీ గుర్తొచ్చేది అక్కడ ఉండే ఐటీ కంపెనీలు, ఆహ్లాదకరమైన వాతావరణం. కానీ, వీటితో పాటు ఆ నగరాన్ని నిత్యం వేధించే ప్రధాన సమస్య ట్రాఫిక్. బెంగళూరు ట్రాఫిక్ నరకానికి సంబంధించి రోజుకో కొత్త కథనం లేదా ఫన్నీ మీమ్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతూనే ఉంటుంది. తాజాగా, అటువంటి సంఘటనే ఒకటి నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది. వైరల్ పోస్ట్ వెనుక కథేంటో ఇప్పుడు చూద్దాం..

ఇదేం ట్రాఫిక్‌ బాబోయ్.. 4 కిలోమీటర్లకు 47 నిమిషాలా..? ఈ రోజు బయల్దేరితే రేపటికి చేరుతాం!
Bengaluru Traffic Viral Post
Jyothi Gadda
|

Updated on: Jul 25, 2026 | 6:30 PM

Share

బెంగళూరు నగరంలో ట్రాఫిక్ సమస్య మళ్లీ వార్తల్లో నిలిచింది. ఆదిత్య సక్సేనా అనే నెటిజన్ షేర్ చేసిన గూగుల్ మ్యాప్స్ నేవిగేషన్ స్క్రీన్‌షాట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అందులో కేవలం 4 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి ఏకంగా 47 నిమిషాల సమయం పడుతుందని చూపిస్తోంది. రోజురోజుకూ తీవ్రమవుతున్న ఈ ట్రాఫిక్ నరకంపై నెటిజన్లు రకరకాల కామెంట్లు, మీమ్స్‌తో స్పందిస్తున్నారు. బెంగళూరులో ఐటీ వృద్ధికి సమానంగా మౌలిక వసతులు పెరగకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని మండిపడుతున్నారు. వైరల్‌గా మారిన వీడియో ప్రకారం..

ఆదిత్య సక్సేనా అనే నెటిజన్ తన ఎక్స్ ఖాతాలో గూగుల్ మ్యాప్స్ నేవిగేషన్ ఆధారంగా ఒక స్క్రీన్‌షాట్‌ను షేర్‌ చేశారు. అందులో ఆయన ప్రయాణించాల్సిన దూరం కేవలం 4 కిలోమీటర్లు. కానీ, దానికి పడుతున్న సమయం మాత్రం 47 నిమిషాలు! ఈ దృశ్యాన్ని చూసి విస్తుపోయిన ఆయన, 4 కిలోమీటర్ల దూరం వెళ్లడానికి 47 నిమిషాలు పడుతోంది. అంటే నేను వాహనం కంటే నడిచి వెళ్లడమే చాలా వేగంగా చేరుకునేలా ఉన్నాను! అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్‌గా మారింది. బెంగళూరు వాసులు, ఇతర నెటిజన్లు దీనిపై రకరకాలుగా స్పందించారు. బెంగళూరులో కారు కంటే కాళ్లను నమ్ముకోవడమే ఉత్తమం అని కొందరు కామెంట్ చేయగా, బెంగళూరులో దూరాలను కిలోమీటర్లలో కాకుండా సమయం లెక్కించాలి అంటూ మరికొందరు విమర్శించారు. ఈ ట్రాఫిక్‌లో కూర్చుని ఒక సినిమా మొత్తం లేదంటే, ఓవర్ చూసేయొచ్చు అని మరికొందరు వ్యంగ్యంగా స్పందించారు.

వీడియో ఇక్కడ చూడండి..

అసలు విషయం ఏంటంటే.. బెంగళూరు నగరంలో వాహనాల సంఖ్య గణనీయంగా పెరగడం, కొనసాగుతున్న మెట్రో నిర్మణ పనులు, ఇరుకైన రోడ్లు, వర్షాల సమయంలో నీరు నిలవడం వంటి కారణాల వల్ల ట్రాఫిక్ స్తంభించిపోతోంది. ఎంత సమయం ముందు బయలుదేరినా అనుకున్న సమయానికి చేరుకోవడం గగనంగా మారుతోంది. బెంగళూరును సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పిలుస్తున్నప్పటికీ, ఇక్కడి ట్రాఫిక్ సమస్యలు మాత్రం నగరవాసుల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. మౌలిక వసతులను వేగవంతంగా మెరుగుపరిస్తే తప్ప ఈ ట్రాఫిక్ కష్టాల నుండి ఉపశమనం లభించదు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us