AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth: జబర్దస్త్ కమెడియన్స్ జీవితంలో కష్టాలు.. చిన్నోడి గుండెకి ఆపరేషన్.. అప్పులపాలు..

ఈషో ద్వారా ఫేమస్ అయినవారిలో పృథ్వీరాజ్, రిషి కుమార్ కూడా ఉన్నారు. ఈ చైల్డ్ ఆర్టిస్టులిద్దరూ తమ కామెడీ పంచులతో నవ్వులు పూయిస్తున్నారు. కానీ నిజజీవితంలో మాత్రం ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది. కామెడీ షోలో తమదైన స్టైల్లో పంచులతో ప్రేక్షకులను నవ్విస్తున్న ఈ ఇద్దరి అన్నదమ్ముల్ల జీవితంలో అనేక కష్టాలు ఉన్నాయని.. చిన్నాబ్బాయి గుండెకు హోల్ ఉండడంతో ఆపరేషన్ చేయించామని చెప్పుకొచ్చింది పృథ్వీ, రిషిల తల్లి శ్రీలత.

Jabardasth: జబర్దస్త్ కమెడియన్స్ జీవితంలో కష్టాలు.. చిన్నోడి గుండెకి ఆపరేషన్.. అప్పులపాలు..
Jabardasth Comedians
Rajitha Chanti
|

Updated on: Oct 18, 2023 | 4:35 PM

Share

బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షోకు ఉన్న టీఆర్పీ గురించి చెప్పక్కర్లేదు. ఈ షో ద్వారా ఎంతోమంది కమెడియన్స్‏గా గుర్తింపు తెచ్చుకున్నారు. జబర్దస్త్ కామెడీ షో వేదికపై తమ స్కిట్టులతో నవ్వులు పూయించి.. ఇప్పుడు సినీ పరిశ్రమలో నటీనటులుగా కొనసాగుతున్న వారి గురించి తెలిసిందే. ఈషో ద్వారా ఫేమస్ అయినవారిలో పృథ్వీరాజ్, రిషి కుమార్ కూడా ఉన్నారు. ఈ చైల్డ్ ఆర్టిస్టులిద్దరూ తమ కామెడీ పంచులతో నవ్వులు పూయిస్తున్నారు. కానీ నిజజీవితంలో మాత్రం ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది. కామెడీ షోలో తమదైన స్టైల్లో పంచులతో ప్రేక్షకులను నవ్విస్తున్న ఈ ఇద్దరి అన్నదమ్ముల్ల జీవితంలో అనేక కష్టాలు ఉన్నాయని.. చిన్నాబ్బాయి గుండెకు హోల్ ఉండడంతో ఆపరేషన్ చేయించామని చెప్పుకొచ్చింది పృథ్వీ, రిషిల తల్లి శ్రీలత. తాజాగా ఆమె తన కుమారులతో కలిసి ఓ ఇంటర్వ్యూకు హాజరై తమ జీవితం గురించి చెప్పుకొచ్చింది.

తనకు ఆ దేవుడు ఇద్దరు పిల్లల్ని మరుగుజ్జులుగా పుట్టించాడని.. మూడోసారి ప్రెగ్నెన్సీ వస్తే మళ్లీ వీరిలాగే పుడతారేమో అని ఆపరేషన్ చేయించుకున్నట్లు తెలిపింది. తన భర్త ఆటో డ్రైవర్ అని.. రోజుకు రూ.400 వరకు సంపాదిస్తాడని.. ఇక తన తల్లికి రోడ్డు ప్రమాదంలో చేయి పోవడంతో ఆమెను కూడా తనే చూసుకుంటున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా శ్రీలత మాట్లాడుతూ.. “నా పిల్లలతోపాటు మా అమ్మను నేనే చూసుకుంటున్నాను. నా పిల్లలకు జబర్దస్త్ షోలో వచ్చే డబ్బులు రానుపోను చార్జీలకే సరిపోతున్నాయి. హైదరాబాద్ వచ్చి వెళ్లడానికి ఏడు వేలు ఖర్చవుతున్నాయి. ఇక చిన్నాబ్బాయి రిషికి గుండెలో హోల్ ఉంది. ఆపరేషన్ చేయించాం. కానీ మూడు నెలలకోసారి చెకప్ కు తీసుకెళ్లాలి.

ఇవి కూడా చదవండి

అప్పుడు రూ.10 వేలు ఖర్చవుతాయి. తనకు ఆరోగ్యకరమైన ఆహారం పెట్టాలన్నారు. కానీ మాకున్న స్థోమతకు మంచి ఆహారాన్ని సమకూర్చలేము. గతంలో ఐదేళ్లు జూనియర్ ఆర్టిస్టుగా కష్టపడ్డాను. ఇప్పుడు నా పిల్లలు కష్టపడుతున్నారు. ఇద్దరు పిల్లల ఆరోగ్యం బాలేకపోవడంతో రూ.5 లక్షల వరకు అప్పులు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు వాటికి వడ్డీ కడుతున్నాం. కానీ అప్పు తీర్చేంత డబ్బు మా చేతిలో లేదు” అంటూ భావోద్వానికి గురైంది శ్రీలత.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తగ్గేదేలేదు.. స్టార్ హీరోల మధ్య టఫ్ ఫైట్.. రికార్డ్స్ సెట్ చేస్తు
తగ్గేదేలేదు.. స్టార్ హీరోల మధ్య టఫ్ ఫైట్.. రికార్డ్స్ సెట్ చేస్తు
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
తల్లి పడుకున్న గదిలో ఒక్కసారిగా పెద్ద శబ్దం..
తల్లి పడుకున్న గదిలో ఒక్కసారిగా పెద్ద శబ్దం..
ఇలా చేస్తే రైల్వే టికెట్లపై 6 శాతం డిస్కౌంట్.. రైల్వేశాఖ ఆఫర్
ఇలా చేస్తే రైల్వే టికెట్లపై 6 శాతం డిస్కౌంట్.. రైల్వేశాఖ ఆఫర్
ఫ్రోజెన్ చికెన్ తింటున్నారా..? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే..!
ఫ్రోజెన్ చికెన్ తింటున్నారా..? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే..!
హీరోయినే అసలు విలన్.. అడియన్స్ సైతం అవాక్కు.. ఇప్పుడు ఓటీటీలో..
హీరోయినే అసలు విలన్.. అడియన్స్ సైతం అవాక్కు.. ఇప్పుడు ఓటీటీలో..
సక్సెస్ వైపు అడుగులు వేయడం ఎలాగో చెప్పిన ఎలాన్ మస్క్!
సక్సెస్ వైపు అడుగులు వేయడం ఎలాగో చెప్పిన ఎలాన్ మస్క్!
ఐపీఎల్ 2026కు ముందు బీసీసీఐ భారీ స్కెచ్.. ఏడాదికి ఎంతో తెలుసా..?
ఐపీఎల్ 2026కు ముందు బీసీసీఐ భారీ స్కెచ్.. ఏడాదికి ఎంతో తెలుసా..?
దావోస్ వేదికపై సీఎం రేవంత్ ప్రతిపాదన..ప్రతి జులైలో హైదరాబాద్ లో
దావోస్ వేదికపై సీఎం రేవంత్ ప్రతిపాదన..ప్రతి జులైలో హైదరాబాద్ లో
మంచి డిమాండ్‌ ఉన్న బిజినెస్‌.. కళ్లు చెరిగే ఆదాయం!
మంచి డిమాండ్‌ ఉన్న బిజినెస్‌.. కళ్లు చెరిగే ఆదాయం!