AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7: ఈసారి సీరియల్ బ్యాచ్ టార్గెట్ పాట బిడ్డ..

ప్రశాంత్ గేమ్స్ బాగా ఆడుతున్నాడు. నామినేషన్స్‌లో గట్టిగా డిపెండ్ చేసుకుంటున్నాడు.. అతనికి బయట విపరీతమైన పాపులారిటీ ఉందని హౌస్‌లో అందరికీ క్లారిటీ వచ్చింది. అందుకే ప్రశాంత్‌తో బాగా కలిసిపోతున్నారు. ఇప్పుడు వారికి దొరికిన ఏకైక వ్యక్తి భోలే. ప్రియాంక అయితే ఏకంగా తూ అంటూ ఊసింది. భోలే భూతులు మాట్లాడాడు. అతనికి సంస్కారం లేదు. మరి....

Bigg Boss 7: ఈసారి సీరియల్ బ్యాచ్ టార్గెట్ పాట బిడ్డ..
Priyanka Jain - Shoba Shetty - Bhole Shavali
Ram Naramaneni
|

Updated on: Oct 18, 2023 | 3:36 PM

Share

భోలే షావలి.. వైల్డ్ కార్డు కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ సీజన్ 7లోకి ఎంట్రీ ఇచ్చాడు. తనని తాను పాట బిడ్డగా ప్రమోట్  చేసుకున్నాడు. తన తింగరి పనులతో జనాల అటెన్షన్ గ్రాబ్ చేశాడు. ఆట బయట నుంచి ముందే చూసి వచ్చి.. శివాజీ, పల్లవి ప్రశాంత్‌లతో సన్నిహితంగా మెలుగుతున్నాడు. నవ్వుతూ… నలుగురిని నవ్విస్తూ.. నాలుగు రోజులు ఉండి వెళ్తానని ఆయన బహిరంగంగానే చెబుతున్నాడు. తెలంగాణలోని మారుమూల పల్లె ప్రాంతానికి చెందిన వ్యక్తి భోలే. ఆయన భోళా మనిషి అని చూస్తేనే అర్థం అవుతుంది. బిగ్ బాస్‌లో స్ట్రాటజీలు భోలేకు బొత్తిగా అర్థం కావడం లేదు. మిగిలిన కంటెస్టెంట్స్ వేసే వలలో ఈజీగా చిక్కుకుపోతున్నాడు. తత్తరపాటులో బయట మాట్లాడినట్లు భూతులు కూడా జారుతున్నాడు. ఇక సీరియల్ బ్యాచ్ ఊరుకుంటుందా చెప్పండి.. మాటలు, చేష్టలతో అతడిపై ఎగబడిపోతున్నారు. హౌస్‌లో ఉన్న సీరియల్ బ్యాచ్ సభ్యులు.. అమర్, అర్జున్, శోభా, ప్రియాంక, పూజా అందరూ ఈ వారం భోలేను నామినేట్ చేశారు. అందరూ చెప్పిన కారణాలు అవే.. మీకు ఆట ఆడటం చేతకాదు. అనవసర విషయాల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు అని. మొత్తంగా సీరియల్ బ్యాచ్ టార్గెట్.. అటు రైతు బిడ్డ వైపు నుంచి పాట బిడ్డ వైపు షిఫ్ట్ అయినట్లు ఉంది.

ప్రశాంత్ గేమ్స్ బాగా ఆడుతున్నాడు. నామినేషన్స్‌లో గట్టిగా డిపెండ్ చేసుకుంటున్నాడు.. అతనికి బయట విపరీతమైన పాపులారిటీ ఉందని హౌస్‌లో అందరికీ క్లారిటీ వచ్చింది. అందుకే ప్రశాంత్‌తో బాగా కలిసిపోతున్నారు. ఇప్పుడు వారికి దొరికిన ఏకైక వ్యక్తి భోలే. ప్రియాంక అయితే ఏకంగా తూ అంటూ ఊసింది. భోలే భూతులు మాట్లాడాడు. అతనికి సంస్కారం లేదు. మరి ప్రియాంక చేసిన పని సమర్థనీయమా..? దీనికి వీక్షకులే సమాధానం చెప్పాలి.

అయితే హౌస్‌లో పాట బిడ్డను టార్గెట్ చేయడంతో అతని ఫాలోవర్స్ నొచ్చుకుంటున్నారు. బోలేశావలి అన్న.. చాలా కింది స్థాయి నుంచి పైకి ఎదిగిన వ్యక్తి అని.. కల్మషం లేని మంచి వ్యక్తి అని చెబుతున్నారు. బయట ఎలా ఉంటాడో బిగ్ బాస్ హౌజ్‌లో కూడా బోలే అలానే ఉన్నాడని..  ఆయన మనసులో ఎలాంటి దురుద్దేశాలు ఉండవని చెబుతున్నారు. ఒక రైట్ పర్సన్ రాంగ్ ప్లేసులో ఉన్నాడని కామెంట్స్ పెడుతున్నారు. భోలేకి ఓట్లు వేయాల్సింది పోయి…’ ఇరుకు మనుషుల మధ్య నువ్వొద్దు అన్న .. ఈ వారం బయటకి వచ్చే యి’ అని కోరుతున్నారు. కనీసం బయట పీఆర్‌ను కూడా పెట్టుకున్నట్లు లేడు భోలే. మరి ఈ వారం ఏం జరుగుతుందో చూద్దాం.

Bhole Shavali

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.