Brahmamudi, October 18th episode: ఇంట్లో నగలు ఎత్తుకెళ్తూ అడ్డంగా దొరికిపోయిన రాహుల్.. పట్టుకున్న రాజ్!
ఈ రోజు బ్రహ్మ ముడి సీరియల్ ఎపిసోడ్ లో అదిరిపోయే ట్విస్ట్ నెలకొంది. మొత్తానికి రాహుల్ బండారం మొత్తం బయటపడే సీన్ ఉంది. మరి దీన్ని రాహుల్, రుద్రాణిలు ఎలా కవర్ చేసుకుంటారో తెలీదు కానీ.. రాహుల్ దొంగతనం బయట పడబోనుంది. గత వారంలో స్వప్నని ఎలాగైనా చంపాలని వీర లెవల్ లో ప్లాన్ వేసిన రాహుల్ ప్లాన్ బోల్తా పడింది. కావ్య, కనకం, రాజ్ లు రంగంలోకి దిగడంలో మైఖేల్ ఆట కట్టించి.. స్వప్నని సురక్షితంగా బయట పడేశారు. ఈ ప్లాన్ ఫెయిల్ కావడంలో నిరాశలో..
ఈ రోజు బ్రహ్మ ముడి సీరియల్ ఎపిసోడ్ లో అదిరిపోయే ట్విస్ట్ నెలకొంది. మొత్తానికి రాహుల్ బండారం మొత్తం బయటపడే సీన్ ఉంది. మరి దీన్ని రాహుల్, రుద్రాణిలు ఎలా కవర్ చేసుకుంటారో తెలీదు కానీ.. రాహుల్ దొంగతనం బయట పడబోనుంది. గత వారంలో స్వప్నని ఎలాగైనా చంపాలని వీర లెవల్ లో ప్లాన్ వేసిన రాహుల్ ప్లాన్ బోల్తా పడింది. కావ్య, కనకం, రాజ్ లు రంగంలోకి దిగడంలో మైఖేల్ ఆట కట్టించి.. స్వప్నని సురక్షితంగా బయట పడేశారు. ఈ ప్లాన్ ఫెయిల్ కావడంలో నిరాశలో ఉన్నాడు రాహుల్. ఇక మైఖేల్ ని అయితే పోలీసులు తీసుకెళ్తారు. అయితే అప్పుడు జైలు కెళ్లిన మైఖేల్ ని విడిపించి తీసుకు రావాలని లాయర్ ఫోన్ చేస్తాడు. మీరు డబ్బు ఎప్పుడు అరేంజ్ చేస్తారు. దాన్ని బట్టి మైఖేల్ ని విడిపించి తీసుకు రావాలి అని చెప్తాడు రాహుల్. దీంతో ఏం చేయాలో తెలీక రాహుల్ ఆలోచనలో పడతాడు.
ఇంటికి దొంగలా నగలన్నీ ఎత్తుకెళ్తున్న రాహుల్:
ఇక నేరుగా ఇంటికి వచ్చి.. కొన్ని నగలను బ్యాగ్ లో వేసుకుని బయలు దేరతాడు రాహుల్. మెట్లు దిగుతూ ఉండగా.. రాజ్ ఎదురు పడతాడు. రాజ్ ని చూసిన రాహుల్.. బిత్తర చూపులు చూస్తూ.. మెల్లగా జారుకుంటాడు. ఇది గమనించిన రాజ్.. రాహుల్ అని పిలుస్తాడు. చేతిలో ఏంటది? అని అడుగుతాడు. రాహుల్ ఎలాంటి సమాధానం చెప్పకుండా.. అటూ ఇటూ చూస్తూంటాడు. ఈ లోపు ప్రకాష్ ఏవో కొత్త డిజైన్స్ అనుకుంటా.. అని అడుగుతాడు. రాహుల్ అవునని.. కాదని చెప్పలేక నసుగుతూంటాడు. ఏది చూపించు అంటూ లాక్కుంటాడు. రాహుల్ బ్యాగ్ వెనక్కి లాగుతూ ఉంటాడు. ఇలా రాహల్ చేయి జారుతుంది. అందులో నుంచి నగలున్న బాక్సులు అన్నీ కింద పడిపోతాయి. ఇవన్నీ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావ్ అని రాజ్.. రాహుల్ ని నిలదీస్తాడు. దీంతో సమాధానం చెప్పలేక రాహుల్ అలా నిల్చుని ఉంటాడు.
రాహుల్ బాగోతం చూసి షాక్ అయిన దుగ్గిరాల ఫ్యామిలీ:
అయితే అక్కడే హాలులో ఇందిరా దేవి, రుద్రాణి, అపర్ణా దేవి, ధాన్య లక్ష్మి, సుభాష్, సీతా రామయ్య అందరూ అక్కడే ఉంటారు. కావ్య ఏమో వంట గదిలో వంట చేస్తూ ఉంటుంది. కనకం మెట్ల మీద నుంచి దిగుతూ ఉంటుంది. ఇక రుద్రాణి కూడా అక్కడే హాలులో కూర్చుని ఉంటుంది. ఇలా ఒక్కసారిగా బ్యాగ్ లో నుంచి నగలు పడగానే అందరూ షాక్ అవుతారు. ఇక బిత్తర చూపులు చూసుకుంటూ అక్కడే నిల్చుని ఉంటాడు. రుద్రాణికి కూడా ఏం అర్థం కాక షాక్ అవుతుంది. మరి నగలన్నీ బయట పడ్డాక.. తల్లీ కొడుకులు ఎలాంటి కథలు అల్లుతారో.. ఇంట్లో వాళ్లను ఎలా మ్యానేజ్ చేస్తారో చూడాలి. మొత్తానికి ఈ ట్విస్ట్ కారణంగా ఇవాళ్లి ఎపిసోడ్ ని రిలీజ్ చేయాలి. దీంతో ఈ రోజు ఏం జరుగుతుందా అని ఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇక నిన్నటి ఎపిసోడ్ లో..
రాహుల్, కావ్యలు పాన్ తినడానికి ఇంట్లో ఎవరికీ తెలీకుండా బయటకు వెళ్తారు. అలా ఇద్దరూ కలిసి బండి మీద వెళ్తారు. కావ్య ఇక ప్రేమగా రాజ్ ని హగ్ చేసుకుంటుంది. రాజ్ కూడా షాపు కోసం వెతుకుతూ ఉంటాడు. అర్థరాత్రి ఎన్ని షాపులు చూసినా క్లోజ్ చేసి ఉంటాయి. అలా చివరకు ఒక షాపు కనిపిస్తుంది. దీంతో ఇద్దరూ కలిసి ఆ షాపులోకి దొంగ తనంగా వెళ్తారు. ఇక కావ్య కోసం పాన్ రెడీ చేసి ఇస్తాడు రాజ్. అది చైసిన కావ్య షాక్ అవుతుంది. ఇక పాన్ సిద్ధం చేసి కావ్య తింటూ హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్ట్స్ కావ్య కూడా రాజ్ కోసం మసాలా పాన్ కట్టి.. నోట్లో పెడుతుంది. ఆ తర్వాత వాళ్లిద్దరూ కాసేపు సరదాగా ఆడుతూ పాడుతూ గడుపుతారు.
ఇక అప్పుడే షాపు యజమాని వచ్చి.. షాపులో నుంచి పాటలు రావడం చూసి వెంటనే దొంగలు పడ్డారని గమనించి పోలీసులకు ఫోన్ చేస్తాడు. వెంటనే వాళ్లు వచ్చి షటర్ ఓపెన్ చేస్తారు. పోలీసులను చూసిన రాజ్, కావ్యలు షాక్ అవుతారు. వెంటనే బయటకు వస్తారు. వీళ్లు ముదురు దొంగలుగా ఉన్నారు అని యజమాని అంటాడు. మేము దొంగలం కాదని రాజ్ చెప్తాడు. మళ్లీ అలానే చెప్తున్నారేంటి? అని పోలీసులు ప్రశ్నిస్తారు. కావ్య ఏమో ఈయన ఎవరో మీకు తెలుసా? అని చెప్పబోతుండగా.. రాజ్ ఆపేస్తాడు. ఆ తర్వాత కిల్లీ షాపు యజమాని డబ్బులు ఇవ్వమని అడుగుతాడు. ఇక రాజ్ ఏదో చెప్పబోతే నాలిక దలసరి అయి.. మాటలు సరిగ్గా రావు. ఇక కావ్య అదేం కాదు కిల్లీ తినడానికి మాత్రేమే వచ్చామని చెప్తుంది.