Jabardast: ‘కిర్రాక్ ఆర్పీ పెద్ద ఫ్రాడ్‌’.. గుట్టు రట్టు చేసిన జబర్దస్త్‌ మాజీ మేనేజర్..

ఇక కిర్రాక్ ఆర్పీ చేసిన కామెంట్స్ తో కదిలిన జబర్దస్ తుట్టె.. రిమైనింగ్ ఆర్టిస్టులను కూడా బయటికి వచ్చేలా చేస్తోంది. మల్లెమాలకు అనుకూల వర్గంగా.. ప్రతికూల వర్గంగా.. ఆర్టిస్టులు మారేలా చేస్తోంది.

Jabardast: 'కిర్రాక్ ఆర్పీ పెద్ద ఫ్రాడ్‌'.. గుట్టు రట్టు చేసిన జబర్దస్త్‌ మాజీ మేనేజర్..
Jabardasth
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 16, 2022 | 5:48 PM

జబర్దస్త్ అందర్నీ నవ్వించడమే కాదు.. ఎప్పుడూ వివాదాల్లో కూడా మునిగితేలుతుంటుంది. ఇక ఇందులోని కమెడియన్స్.. జోకుల పేరుతో వంకర మాటలు.. పంచ్‌ల పేరుతో విమర్శలు చేస్తారనే కామెంట్‌ కూడా బలంగా ఉంది. వీటన్నింటికి తోడు.. జబర్దస్త్ నుంచి బయటికి వచ్చిన కంటెస్టెంట్స్ చేస్తున్న కామెంట్స్ కూడా ఇప్పుడు టూ స్టేట్స్ లో వైరల్ అవుతున్నాయి. వైరల్ అవడమే కాదు.. జబర్దస్త్ ప్రొడక్షన్ హౌస్ మల్లెమాల పరువును బజారుకీడుస్తున్నాయి. ప్రొడ్యూసర్ శ్యాంప్రసాద్ రెడ్డిని తల పట్టుకునేలా చేస్తున్నాయి.

ఇక కిర్రాక్ ఆర్పీ చేసిన కామెంట్స్ తో కదిలిన జబర్దస్ తుట్టె.. రిమైనింగ్ ఆర్టిస్టులను కూడా బయటికి వచ్చేలా చేస్తోంది. మల్లెమాలకు అనుకూల వర్గంగా.. ప్రతికూల వర్గంగా.. ఆర్టిస్టులు మారేలా చేస్తోంది. ఒకరిపై ఒకరు విమర్శల పేరుతో.. అబాసుపాలయ్యేలా చేస్తోంది. ఇక ఇప్పటికే సుడిగాలి సుధీర్‌కు జబర్దస్త్‌లో అవమానం జరిగిందంటూ.. ఆర్టిస్టులను మల్లెమాల ప్రొడక్షన్ వారు మనుషులుగా చూడరంటూ.. ఆర్పీ చేసిన కామెంట్స్ పై క్లారిటీ ఇచ్చారు హైపర్ ఆది అండ్ ఆటో రాం ప్రసాద్. అలాంటిది ఏం లేదంటూ.. కొట్టిపారేశారు. ఇక వీరి బాటలోనే ఆర్పీ మాటలను కొట్టిపడేశారు జబర్దస్త్ మాజీ మేనేజర్ ఏడుకొండలు. కొట్టిపడేయడమే కాదు.. కిర్రాక్ ఆర్పీ పై విరుచుకుపడ్డారు.

చాలా యేళ్లు మల్లెమాల సంస్థలో పనిచేసిన ఏడుకొండలు.. జబర్దస్త్ కు మొదటి నుంచి మేనేజర్ గా వ్యవహరించారు. కంటెస్టెట్స్ తన మీద పేల్చే పంచులతో.. తెలుగు టూ స్టేట్స్‌లో ఫేమస్ కూడా అయ్యారు. కాని ఇటీవల జబర్దస్త్‌ నుంచి మల్లెమాల నుంచి దూరంగా వచ్చేశారు. ఈ క్రమంలోనే.. కిర్రాక్ ఆర్పీ మల్లెమాలపై చేసిన విమర్శలకు బదులు చెప్పుందుకు ఓ ఛానెల్లో ప్రత్యక్షమయ్యారు. ఆర్పీ నిజస్వరూపం ఎలాంటిదో అందరికీ తెలిసేలా చేశారు.

ఇవి కూడా చదవండి

శ్యాంప్రసాద్ రెడ్డికి జబర్దస్త్ తల్లి లాంటిదని చెప్పిన ఏడుకొండలు.. దానిపై ఆర్పీ చెడుగా మాట్లాడాడాన్ని తప్పు బట్టారు. అంతేకాదు.. ఆర్ఫీ ఫ్రాడ్‌ వేశాలను దగ్గర నుంచి తాను చూసినట్టు చెప్పారు. “నేను జబర్దస్త్ నుంచి బయటికి వచ్చేశాక.. చాలా సినిమాలకు మేనేజర్ గా పనిచేశా. ఓసారి ఓ సినిమా డబ్బింగ్ కోసం ఆర్పీ ఆఫీసు ఉన్న ఏరియాకు వెళ్లా. అక్కడ ఆర్పీ నన్ను చూశాడు. తన ఆఫీసుకు తీసుకెళ్లాడు. తన సినిమాకు మేనేజర్ గా ఉండమన్నాడు. జీతం కూడా నెలకు 30 వేలు ఇస్తా అన్నాడు. కానీ.. నేను 50 వేలు అయితే చేస్తా అన్నా. దీంతో 50 వేలు ఇవ్వడానికి రెడీ అన్నాడు. ఒక నెల అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. దీంతో ఆఫీసుకు వెళ్లడం స్టార్ట్ చేశా. ఆఫీసుకు వెళ్లాకే.. ఆర్పీ ఎంత ఫ్రాడ్ చేస్తున్నాడో అర్థం అయింది. అసలు సినిమాలో ఎవరు నటిస్తున్నారు అని అడిగితే ఏదో సమాధానం చెప్పేవాడు. బుకాయించేవాడు. ప్రభాస్ కజిన్ అంటూ చెప్పేవాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు బాడీ హెవీగా ఉందని.. అది తగ్గిన తర్వాత మన సినిమా మొదలు అవుతుందని చెప్పాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు చిన్ని చరణ్ అనే మ్యూజిక్ డైరెక్టర్ కు అడ్వాన్స్ ఇచ్చామని చెప్పాడు. ఆ తర్వాత ఓ సినిమాటోగ్రఫర్ కు కూడా అడ్వాన్స్ ఇచ్చినట్టు చెప్పాడు. ఆ సినిమా నిర్మాతను అడిగితే.. అది అబద్ధం అని తేలింది. ఇలా.. సినిమా కోసం చాలా ఫ్రాడ్ చేశాడు. ” అని కిర్రాక్ ఆర్పీ మోసాన్ని బయటపెట్టారు ఏడుకొండలు.