Actress: అప్పుడేమో స్లిమ్‌గా.. ఇప్పుడేమో బబ్లీగా.. ఈ బిగ్ బాస్ బ్యూటీని గుర్తు పట్టారా?
పై ఫొటోలో టెడ్డీ బేర్ పట్టుకుని పోజులు ఇస్తున్నదెవరో గుర్తు పట్టారా? అప్పుడు స్లిమ్ లుక్‌లో క్యూట్‌గా కనిపించిన ఈ వయ్యారీ ఇప్పుడు బబ్లీగా మారిపోయింది. అలాగనీ అందం ఏ మాత్రం తగ్గలేదు. పైగా అప్పటికంటే ఇప్పుడే ఈ భామ బాగా ఫేమస్ అయిపోయింది. కెరీర్ ప్రారంభంలో పలు సీరియల్స్‌లో నటించి బుల్లితెర ఆడియెన్స్ ను మెప్పించింది.
పై ఫొటోలో టెడ్డీ బేర్ పట్టుకుని పోజులు ఇస్తున్నదెవరో గుర్తు పట్టారా? అప్పుడు స్లిమ్ లుక్‌లో క్యూట్‌గా కనిపించిన ఈ వయ్యారీ ఇప్పుడు బబ్లీగా మారిపోయింది. అలాగనీ అందం ఏ మాత్రం తగ్గలేదు. పైగా అప్పటికంటే ఇప్పుడే ఈ భామ బాగా ఫేమస్ అయిపోయింది. కెరీర్ ప్రారంభంలో పలు సీరియల్స్‌లో నటించి బుల్లితెర ఆడియెన్స్ ను మెప్పించింది. ఆ తర్వాత ఫేమస్ కామెడీ షో జబర్దస్త్ లో అడుగు పెట్టింది. అక్కడ తన కామెడీ పంచులు, ప్రాసలతో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించింది. జబర్దస్త్ తో ఈ అందాల తార జీవితమే మారిపోయింది. సినిమాల్లోనూ అవకాశాలు వచ్చాయి. ఇక బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ లోనూ అవకాశం వచ్చింది. మూడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా అడుగు పెట్టింది. హౌస్ లో ఉన్నన్నీ రోజులు తన ఆట, మాట తీరుతో ఆడియెన్స్ ను బాగానే ఎంటర్ టైన్ చేసింది. అయితే టైటిల్ మాత్రం గెలవలేకపోయింది. మూడో సీజన్ లో మెయిన్ కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన ఈ జబర్దస్త్ బ్యూటీ ఇప్పుడు లేటెస్ట్ గా ఎనిమిదో సీజన్ లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. మరి ఈ బ్యూటీ ఎవరో ఈ పాటికే చాలా మందికి అర్థమై ఉంటుంది. మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్.. ఆమె మరెవరో కాదు బిగ్ బాస్ సీజన్ 8 లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అడుగ పెట్టిన జబర్దస్త్ నటి రౌడీ రోహిణి. ఇది ఆమె టీనేజ్ నాటి ఫొటో.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో భాగంగా ఆదివారం (అక్టోబర్ 06) మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్స్ అడుగు పెట్టారు. హరితేజ, టేస్టీ తేజ, నయని పావని, మెహబూబా, రౌడీ రోహిణీ, గౌతమ్ కృష్ణ, ముక్కు అవినాష్, గంగవ్వ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. వీరందరికీ బిగ్ బాస్ హౌస్ కొత్తేమీ కాదు. గతంలో వివిధ సీజన్లలో కంటెస్టెంట్స్ గా వచ్చిన వారే. అయితే ఈ సీజన్ లో బిగ్ బాస్ హౌస్ లో కామెడీ లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే జబర్దస్త్ నటి రోహిణీని మళ్లీ పిలిచారు. ఈ సందర్భంగా బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ శివజ్యోతి.. రోహిణికి ఆల్ ది బెస్ట్ చెబుతూ ఒక స్పెషల్ వీడియోను పంపింది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌసులో కామెడీకి లోటు బాగా ఉందని, నువ్వు దాన్ని భర్తీ చేయాలని చెప్పుకొచ్చింది. మరి ఈసారైనా రోహిణి బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే వరకు చేరుకుంటుందా? లేదా? అనేది చూడాలి!
బిగ్ బాస్ లో రోహిణీ
Rohini is the latest wild card entry in the Bigg Boss house! Will she stir things up and shift the game’s dynamics? Keep watching to find out! 🔥#BiggBossTelugu8 #Rohini #StarMaa @iamnagarjuna @DisneyPlusHSTel pic.twitter.com/1WF9ZLJfkZ
— Starmaa (@StarMaa) October 6, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.