Brahmamudi, October 7th Episode: కావ్యకు ఛాలెంజ్ విసిరిన అపర్ణ.. చిచ్చు రాజేసిన రుద్రాణి..

బెడ్‌రూమ్‌లో కావ్యపై కోపంతో రగిలిపోతూ ఉంటాడు రాజ్. అప్పుడే రాజ్ అంతరాత్మ ఎంట్రీ ఇస్తుంది. కళావతికి సంబంధించిన జ్ఞాపకాలు ఇంట్లో ఉండకూడదని బయట పడేసి తగులబెట్టేస్తా అనుకున్నావ్ కదా.. పదా వర్షం తగ్గింది. వెళ్లి కాల్చేద్దాం అంటాడు. దీంతో రాజ్ కోపంగా చూస్తూ ఉంటాడు. కళావతి అంటే అస్సలు ఇష్టం లేనట్లుగా అందరి ముందు అరుస్తావు. కానీ మనసులో మాత్రం భార్యపై ప్రేమ పొంగిపోతూ ఉంటుందని ఉంటుందని అంతరాత్మ అంటుంది. ఏంటి నాది ప్రేమనా..

Brahmamudi, October 7th Episode: కావ్యకు ఛాలెంజ్ విసిరిన అపర్ణ.. చిచ్చు రాజేసిన రుద్రాణి..
BrahmamudiImage Credit source: Disney Hot Star
Follow us
Chinni Enni

|

Updated on: Oct 07, 2024 | 10:56 AM

బెడ్‌రూమ్‌లో కావ్యపై కోపంతో రగిలిపోతూ ఉంటాడు రాజ్. అప్పుడే రాజ్ అంతరాత్మ ఎంట్రీ ఇస్తుంది. కళావతికి సంబంధించిన జ్ఞాపకాలు ఇంట్లో ఉండకూడదని బయట పడేసి తగులబెట్టేస్తా అనుకున్నావ్ కదా.. పదా వర్షం తగ్గింది. వెళ్లి కాల్చేద్దాం అంటాడు. దీంతో రాజ్ కోపంగా చూస్తూ ఉంటాడు. కళావతి అంటే అస్సలు ఇష్టం లేనట్లుగా అందరి ముందు అరుస్తావు. కానీ మనసులో మాత్రం భార్యపై ప్రేమ పొంగిపోతూ ఉంటుందని ఉంటుందని అంతరాత్మ అంటుంది. ఏంటి నాది ప్రేమనా.. అని రాజ్ అంటాడు. ప్రేమ ఉంది కాబట్టే.. కావ్యతో మాట్లాడేందుకు ఎక్స్‌పోలో గొడవ పట్టావు. నిజానికి నిన్ను ఎవరైనా మోసం చేస్తే.. కనీసం దగ్గరకు కూడా రానివ్వవు. అస్సలు వాళ్లతో మాట్లాడవు. కానీ కళావతితో మాత్రం గొడవ పడ్డావు. నీ భార్య ఏం చేసినా నీకు మాత్రమే చేయాలి. నీకు మాత్రమే సొంతం కదా అని నీ మనసులో ఉందని అంతరాత్మ అంటే.. ఆపుతావా? మర్యాదగా నువ్వు వెళ్లు.. అని పూల కుండీతో కొడతాడు రాజ్. తొక్కలో సిద్ధాంతాలు చెప్పొద్దు. కళావతిని నేను ప్రేమించడం ఏంటి? అది చేసిన మోసానికి జీవితంలో ఎప్పటికీ క్షమించనని రాజ్ అంటాడు.

అపర్ణను కలిసిన కావ్య..

గుడిలో అపర్ణను కలుస్తుంది కావ్య. అత్తయ్య గారు అని పిలవగానే.. ఎవరు నువ్వు? నన్ను ఎందుకు గుడికి రమ్మని పిలిచావు? నీకూ నాకు సంబంధం ఏంటని అడుగుతుంది అపర్ణ. అపర్ణ మాటలకు షాక్ అయిన కావ్య.. నేను ఎవరో మీకు తెలీదా? అని అడుగుతుంది. ఈ నువ్వు నాకు తెలీదు. నాకు తెలిసిన కావ్య నువ్వు కాదు. అప్పుడు మా ఇంట్లో ఉన్నావు. ఇప్పుడు పుట్టింట్లో ఉన్నావని అపర్ణ అంటుంది. అంది మీ ఇల్లు కదా.. మీ ఇంట్లో చోటు, మీ అబ్బాయి మనసులో స్థానం లేదని పుట్టింటికి పోయానని కావ్య అంటుంది. నా ఇల్లు నీ ఇల్లు కదా? నా కొడుకు నీ భర్త కాదా? వాడి మనసులో నువ్వు లేకపోతే సంవత్సరం కలిపి కాపురం చేసేవాడా? అని అపర్ణ అడుగుతుంది. కాపురం.. మీరు బలవంతం చేస్తేనే నాతో కాపురం చేశారని అన్నారు కదా అని కావ్య అనగానే.. కావ్యా అని దగ్గరకు వెళ్లి హగ్ చేసుకుని.. ఇద్దరూ ఏడుస్తారు.

ఇప్పుటికి నేను గుర్తొచ్చానా?

మీరు ఎలా ఉన్నారు అత్తయ్యా? అని కావ్య అడగ్గానే.. ఇప్పుడు నేను గుర్తుకు వచ్చానా? అని అపర్ణ అడుగుతుంది. ముఖం కూడా చూడకూడదని మీ అబ్బాయి గారే ఆ ఆస్పత్రి నుంచి వెళ్లగొట్టారు. అందుకే రాలేదు. నేను అక్కడ లేకపోయినా.. మీ యోగ క్షేమాలు కనుక్కుంటూనే ఉన్నానని కావ్య అంటుంది. కనీసం నేను వచ్చేదాకా అయినా అక్కడ ఉండాల్సింది కదా అని అపర్ణ అంటే.. ఉంటే.. అక్కడే ఉండనిచ్చి బలవంతంగా కాపురం చేసేవారని కావ్య అంటుంది. మరి ఇప్పుడు ఎందుకు పిలిచావు? మీ గొడవ గురించి చెప్పడానికా అని అపర్ణ అంటే.. ఏం జరిగిందో మీకు తెలుసని నాకూ తెలుసు. నిన్న జరిగిన కథ వేరు. అందుకే మీకు సంజాయిషీ ఇవ్వాల్సిన బాధ్యత నాదని కావ్య అంటే.. ఎందుకు నువ్వు తప్పు చేయలేదని నమ్మినప్పుడు ఇంకెందుకు చెప్పడం అని అపర్ణ అంటుంది.

ఇవి కూడా చదవండి

ఇంటికి వచ్చి బుద్ధిగా కాపురం చేసుకో..

ఇది చెప్పేంత వరకు నాకు మనశ్శాంతిగా ఉండదు. నేను పుట్టింటికి వెళ్లాక భారం కాకూడదని.. నాకు వచ్చిన కళతో డిజైన్స్ వేద్దామని అనుకున్నా. కానీ దీని వెనుక అనామిక ఉందని.. ఇదంతా చేస్తుందని ఊహించలేదు. అలాంటివి ఏమీ తెలియక నేను మోసపోయాను. అంతే తప్ప ఆయన ఓడిపోలేదని నేనెందుకు అనుకుంటానని కావ్య అంటుంది. అర్థమైంది.. అనామిక నిన్ను చేసింది.. ఇటు నీ జీవితాన్ని.. అటు కంపెనీని దెబ్బ కొట్టిందని అపర్ణ అంటుంది. ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదని కావ్య అంటే.. ఇంటికి వచ్చి బుద్ధిగా కాపురం చేసుకోమని అపర్ణ అంటుంది. నేను రానని కావ్య అంటుంది. ఇంటికి రానన్న కావ్య..

నా మీద ఆయనకు ప్రేమే లేదు..

రావా.. అలాంటప్పుడు నన్ను పిలిచి ఇదంతా ఎందుకు చెబుతున్నావ్? అసలు నువ్వు నాకు సంజాయిషీ ఇవ్వాలని పిలిచావా.. నా ద్వారా వాడికి నిజం చేరవేయాలని అనుకున్నావా.. వాడు తప్పుగా అనుకున్నాడనే కదా అని అపర్ణ అంటే.. కాదు మీకు సంజాయిషీ ఇవ్వాలనే అని కావ్య అంటే.. ఇద్దరికిద్దరు సరిపోయారు. నా ప్రాణానికి.. మీ కాపురం ఇలా అయిందేంటని మేము బాధ పడాలి. వాడు నీ పట్ల అమానుషంగానే ప్రవర్తించాడు. అందుకు వాడికి గడ్డి పెడుతూనే ఉన్నాను. నువ్వు నాతో రా తీసుకెళ్తానని అపర్ణ అంటే.. నేను రానని కావ్య అంటుంది. అదిగో మళ్లీ అదే పాట అని సీరియస్ అవుతుంది అపర్ణ. అత్తయ్యా మీ అబ్బాయికి అసలు నా మీద ప్రేమే లేదు. నన్ను అస్సలు ఆయన అర్థం చేసుకోలేదని కావ్య అంటుంది.

మీ ఇద్దరికీ కింద నుంచి ఇగో పెరిగిపోయింది..

సరే నువ్వు చెప్పాల్సింది నువ్వు చెప్పావ్.. ఇక నేను చేయాల్సింది నేను చేస్తానని అపర్ణ అంటుంది. ఏం చేస్తారు? అని కావ్య అంటుంది. చూస్తాను.. నువ్వు ఎన్నాళ్లు అక్కడ ఉంటావో నేను చూస్తాను. దేవుడి సమక్షంలో ఉండి చెబుతున్నాను. మీ ఇద్దరికీ కింద నుంచి పై దాకా ఇంట్లో ఇగో అనేది సరఫరా అవుతుంది. అది తగ్గిస్తే కానీ దారిలోకి రారని సీరియస్‌గా వార్నింగ్ ఇస్తుంది అపర్ణ. ఆ తర్వాత కావ్య ఎమోషనల్‌గా బ్లాక్ మెయిల్ అవుతుంది. అప్పుడే రాహుల్ గుడికి మరో అమ్మాయితో వస్తాడు. అక్కడ అపర్ణ, కావ్యలను చూస్తాడు. నువ్వు ఎందుకు ఇంటికి రాకుండా ఉంటావో నేనూ చూస్తాను.. తేదీ రాసి పెట్టుకో.. మీ ఇద్దర్నీ కలుపుతానని అంటుంది అపర్ణ. ఇక ఈ విషయాన్ని వెంటనే రుద్రాణికి ఫోన్ చేసి చెప్తాడు రాహుల్. ఇక తన స్టైలో పుల్లలు పెట్టడానికి సిద్ధం అవుతుంది రుద్రాణి. ఇక హాలులోకి వస్తాడు రాజ్. అమ్మ ఏదని రాజ్ అడగ్గా.. నీకు తెలీదా అమ్మా.. అని రుద్రాణి పుల్ల పెడుతుంది. మీ అమ్మ గుడికి వెళ్లింది.. నీ భార్యని కలవడానికి వెళ్లిందని చెప్పేస్తుంది. అప్పుడే అపర్ణ ఇంటికి వచ్చి ప్రసాదం ఇస్తుంది.

రాహుల్‌ని అడ్డంగా ఇరికించిన అపర్ణ..

వెంటనే అపర్ణను నిలదీస్తాడు రాజ్. మా అత్తగారు, మామగారు ఓ దోషాన్ని ఇంటికి తీసుకొచ్చారు. ఆ దోషాన్ని బయటకు తరి మేసిన రోజు ఇంటికి మంచి జరుగుతుందని చెప్పారని అపర్ణ అంటుంది. నువ్వు ఎవర్ని కలవడానికి వెళ్లావో చెప్పు.. అని రాజ్ అడుగుతాడు. అవును రా.. నా కోడల్ని కలవటానికి వెళ్లాను. అనామిక ఆడిన గేమ్‌లో మోసపోయిందని చెప్పి బాధ పడిందని అపర్ణ అంటుంది. నీ ప్రాణాల మీదకు అవసరం లేదు కదా.. మన కంపెనీకి నష్టం వచ్చినా నీకు అవసరం లేదని రుద్రాణి కావాలనే రెచ్చిపోతుంది. ఆ కళావతిని కలవడం నాకు ఇష్టం లేదని చెప్పి సీరియస్‌గా వెళ్లిపోతాడు రాజ్. అప్పుడే ఇంటికి రాహుల్ వస్తాడు. ఇక కావాలనే తన స్టైల్‌లో ఇరికిస్తుంది అపర్ణ. ఇంట్లో అందమైన భార్యను పెట్టుకుని వేరే అమ్మాయితో షికార్లు చేస్తున్నాడని చెబుతుంది అపర్ణ. ఇక స్వప్న తగులుకుంటుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!