Brahmamudi, October 29th Episode: మట్టి పిసుక్కో అంటూ కావ్యని అవమానించిన రాజ్.. అనామికకు చెక్!

రాజ్ ఆఫీస్‌కి వెళ్లడంతో చెడగొట్టేందుకు రుద్రాణి మరో ప్లాన్ వేస్తుంది. కావ్యతో పాటు క్లయింట్స్ అందరూ మీట్ అవుతారు. మీరు మళ్లీ కంపెనీతో టై అప్ అవ్వలని కావ్య అంటే.. మీ మేనేజ్‌మెంట్‌ని నమ్మలేకపోతున్నామని చేతులెత్తేస్తారు క్లయింట్స్. దీంతో కావ్యపై రాజ్ సీరియస్ అవుతాడు.. మరోవైపు అనామికకు చెక్ పెట్టేలా కావ్య ప్లాన్ వేస్తుంది.

Brahmamudi, October 29th Episode: మట్టి పిసుక్కో అంటూ కావ్యని అవమానించిన రాజ్.. అనామికకు చెక్!
Brahmamudi
Follow us
Chinni Enni

|

Updated on: Oct 29, 2024 | 6:57 PM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. అపర్ణ, సీతారామయ్య, ఇందిరా దేవి, స్వప్న, ప్రకాశంలు కలిసి రాజ్‌ని ఆఫీస్‌కి పంపించేందుకు కలిసి ప్లాన్ చేస్తారు. కావాలనే రాజ్ ఇగో రెచ్చగొడతారు. నువ్వేంటో నువ్వు నిరూపించుకో.. నువ్వు కావ్యకి భయపడి కావాలనే మానేశావని అందరూ అనుకుంటారని రాజ్ మీద పడి ప్రశ్నిస్తూ ఉంటారు. దీంతో చచ్చినట్టు ఒప్పుకుంటాడు రాజ్. పై నుంచి అంతా రాహుల్ వింటూ ఉంటాడు. ఆ కళావతి కంటే నేను ఎందుకూలోనూ తక్కువ కాదని.. ఎక్కవేనని రుజువు చేస్తాను. అలా రుజువు చేసి.. మళ్లీ నేను సగర్వంగా నిలబడతాను.. ఛాలెంజ్ అని అంటాడు. ఇక ఆఫీస్‌కి వెళ్లేందుకు రెడీ అవుతాడు రాజ్. రాహుల్ రుద్రాణి దగ్గరకువెళ్లి.. అక్కడ కొంపలు అంటుకుంటుంటే.. నువ్వు ఇక్కడ తీరిగ్గా మేకప్ వేసుకుంటున్నావ్? ఏంటి? అని కంగారుగా అడుగుతాడు. నేను మేకప్ వేసుకోవడం లేదురా.. లైట్‌గా టచ్ అప్ చేసుకుంటున్నానని అంటుంది. అక్కడ అందరూ కలిసి రాజ్‌ని మళ్లీ ఆఫీస్‌కి పంపిస్తున్నారని అంటాడు రాహుల్.

కావ్య, రాజ్‌లను విడగొట్టేందుకు రుద్రాణి ప్లాన్..

ఏంటి రాజ్ మేనేజర్‌గా ఆఫీస్‌కి వెళ్లేందుకు ఒప్పుకున్నాడా? అని రుద్రాణి అంటే.. నిన్నటి నుంచి మా అమ్మా.. వదినలు కలిసి ఇదేనా ప్లాన్ చేస్తున్నారా.. ఇప్పుడు అర్థమైందని అంటుంది. ఇప్పుడు రాజ్ ఆఫీస్‌కి వెళ్లే.. ఇద్దరూ మళ్లీ కలిసి పోతారు. చిలక, గోరింకల్లా ఆఫీస్‌లోనే కాపురం పెడతారు అని రాహుల్ అంటే.. అదంతా చూస్తూ మనం ఊరుకుంటామా.. ఏదో ఒకటి చేస్తాను. ముందు ఆ మేనేజర్‌కి ఫోన్ చేసి అక్కడ జరిగేది అంతా చెప్పమని రాహుల్‌ని అడగమంటుంది రుద్రాణి. దీంతో రాహుల్ మేనేజర్‌కి ఫోన్ చేసి.. ఏడుస్తూ గుడ్ మార్నింగ్ చెబుతూ.. కావ్య మేడమ్ నేను చేసిన తప్పులకు మేనేజర్ పోస్ట్ నుంచి.. సెక్యూరిటీగా మార్చేశారు. ఇన్ని రోజులూ దర్జాగా బతికిన నేను.. ఇలా బతకలేక పోతున్నా.. ఏదో ఒకటి చేయమని మేనేజర్ అంటే.. ఆ బాధ నువ్వే పడు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇదే మేటర్.. ఆ కావ్య ఆఫీస్‌కి వెళ్లగానే మన మనిషిని బయటకు పంపేసిందని రాహుల్ అంటాడు. వాడు కాకపోతే మరొకడు అంటూ రుద్రాణి వెళ్తుంది.

సెక్యూరిటీగా రాజ్..

ఆ తర్వాత రాజ్ ఆఫీస్‌కి వస్తాడు. అక్కడ ఉన్న మేనేజర్.. సార్ అంటూ పిలుస్తాడు. ఏంటి డ్యూటీకి కొత్త.. గుడ్ మార్నింగ్ అనకుండా సాగ దీస్తున్నావ్? ఏంటి? అంటే.. ముందు మీరు నన్ను చూసి నేను ఎవరో తెలుసుకోమని టోపీ తీస్తాడు. మేనేజర్‌ని చూసి రాజ్ షాక్ అయి.. ఏమైందని అడుగుతాడు. ఎవరు ఇలా చేశారు? అని రాజ్ అడిగితే.. ఏంటి ఈ అన్యాయం.. పదా వెళ్లి అడిగి కడిగి పారేస్తానని మేనేజర్‌ని తీసుకుని కావ్య దగ్గరకు వెళ్తాడు రాజ్. ఏంటి ఈ అన్యాయమం.. డిమోషన్ ఇచ్చి అవమానిస్తావా? ఈ అన్యాయాన్ని ధిక్కరించేవాళ్లు లేరా? ఇప్పుడు సమాధానం చెప్పు అని రాజ్ నిలదీస్తాడు. మిమ్మల్ని కూడా ఎండీ పోస్ట్ నుంచి పీకేసి.. మేనేజర్ పోస్ట్‌కి పడేశాం.. మీరేం చేశారు? అని కావ్య అడిగింది. ఇతన్ని తీసే అధికారం నీకు ఎవరు ఇచ్చారు? అని రాజ్ అంటే.. ఈ సీట్ ఇచ్చిందని కావ్య అంటుంది. ఇప్పుడు అతనికి మేనేజర్ పోస్ట్ ఇచ్చేస్తాను.. మీ డ్రెస్ తీసుకొచ్చి.. ఆయనకు ఇచ్చేమని కావ్య అంటే.. సెక్యూరిటీని తిట్టి పంపించేస్తాడు రాజ్. దీంతో కావ్య ఓ ఆట ఆడుకుంటుంది.

ఇవి కూడా చదవండి

మీ కంపెనీని నమ్మలేమని చేతులెత్తేసిన క్లయింట్స్..

అప్పుడే శ్రుతి వచ్చి అందరూ వచ్చేశారు.. మీటింగ్ హాలుకు రమ్మని పిలుస్తుంది. అప్పుడే కావ్య మీటింగ్‌కి వెళ్తుంది. అక్కడ ఫొటోను తీసి.. అనామికకు మెసేజ్ చేస్తుంది కావ్య. అది చూసి అనామిక షాక్ అవుతుంది. మీకు మా బ్రాండ్ వల్ల ఇప్పటికే ఎన్నో లాభాలు వచ్చాయి. మధ్యలో చిన్న చిన్న డిస్టెబెన్స్ వచ్చే సరికి.. పక్క కంపెనీతో అసోసియేట్ అవ్వడం కరెక్ట్ కాదని కావ్య అంటుంది. మరి ఇది కరెక్ట్ కాదు.. కానీ రాహుల్ వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. రాహుల్ మమ్మల్ని బాగా అవమానించాడని చెప్తారు. కానీ రాజ్ సర్ చైర్మన్ సార్‌లా, సుభాష్‌ సార్‌లా గౌరవంగా చూసుకున్నారు. ఆ తర్వాత రాహుల్ వచ్చాడు.. మళ్లీ రాజ్ సార్ వచ్చాడు. ఇప్పుడు మీరు.. ఆ తర్వాత ఎవరు వస్తారో తెలీదు. మీరు మా పెట్టుబడితో జూదం ఆడుతున్నారు. కంపెనీ మీద ఉన్న గౌరవంతో వచ్చాం. కానీ కంపెనీలో జాయిన్ కావడానికి రాలేదని క్లయింట్స్ చెప్పి వెళ్లిపోతారు. కావ్య చెబుతున్నా వినిపించుకోరు.

కావ్యని అవమానించిన రాజ్..

దీంతో రాజ్ చప్పట్లు కొడుతూ.. ఇప్పుడు అర్థమైందా? నువ్వేంటో.. నీ స్థానం ఏంటో.. ఇది కోట్లలో వ్యాపారం.. ఈ కంపెనీతో అసోసియేట్ అవ్వడానికి ఎవరూ ఒప్పుకోరు. మళ్లీ నువ్వు వెళ్లి మట్టి పిసుక్కుని బొమ్మలు చేసుకుని బతకాల్సిందేనని రాజ్ అంటాడు. వాళ్లు కంపెనీని తప్పుబట్టారు.. నన్ను కాదు. చెప్పినా వినకుండా ఆ రాహుల్‌ని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఇప్పుడు ఏం జరిగింది? చూడండి ఈ అవమానం మీది.. ఈ కంపెనీది.. దుగ్గిరాల కుటుంబానిదని కావ్య అంటుంది. ఆ తర్వాత శ్రుతి వచ్చి.. మిస్టర్ అరవింద్ మీ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారని చెబుతుంది. కావ్య వెళ్లి అతన్ని కలుస్తుంది. మీ కంపెనీలో నేను పదేళ్లుగా బిజినెస్ చేస్తున్నా.. యాక్సిడెంట్ చేయడం వల్ల సరిగా నడపలేకపోయా.. ఇప్పుడు నా కంపెనీని బ్యాంక్ వాళ్లు వేలం వేస్తున్నారు. బయట కంపెనీలు తక్కువకి పాడుకోవాలని చూస్తున్నారు. కానీ నాకు పది కోట్ల దాకా అప్పు ఉంది. కాబట్టి మీ కంపెనీ నా కంపెనీని టేక్ ఓవర్ చేస్తే నాకు చాలా హెల్ప్ అవుతుందని చెప్తాడు.

కావ్య ప్లాన్‌తో రుద్రాణికి చెక్..

అప్పుడే శ్రుతిని వచ్చి ఫైల్ ఇచ్చాక.. మేనేజర్‌ని నా కాబిన్‌కి రమ్మని చెబుతుంది. దీంతో కావ్య భయ పడుతూ ఉంటుంది. వీళ్ల మద్దరి మధ్యలో నేను చస్తున్నా అని అంటుంది. రాజ్ దగ్గరకు వెళ్లి.. క్యాబిన్‌కి రమ్మని చెబుతుంది. దీంతో రాజ్ సీరియస్ అవుతూ.. నేను వెళ్లనని చెప్తాడు. సరే సర్.. అయితే ప్రొడక్షన్ ఆఫీస్‌లో ఓ సెక్యూరిటీ జాబ్ ఖాళీగా ఉందంట సర్.. అది మీకో నాకో అని శ్రుతి అంటే.. సరే నేను వస్తానని వెళ్తాడు రాజ్. ఈలోపు కావ్య ఆలోచించి.. అరవింద్ గారు మీరు వేలానికి వెళ్లండి.. మీకు లాభం వచ్చేలా నేను చూస్తాను. మీ లాభంలో 50 శాతం మాకు అని కావ్య అంటుంది. ఇక క్లయింట్ ఎంతో సంతోషంగా వెళ్తాడు. అప్పుడే రాజ్ వస్తాడు. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్‌లో కావ్య స్వప్నకి ఫోన్ చేసి ప్లాన్ ఏంటో చెబుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!