Brahmamudi, May 17th episode: వాటే ఎపిసోడ్.. టుడే బ్రహ్మముడిలో ట్విస్టులే ట్విస్టులు..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కావ్యని ఎవరూ లేని చోటికి తీసుకొచ్చి.. ప్లాన్ చేసి కిడ్నాప్ చేస్తారు. కావ్యని బలవంతంగా బండి ఎక్కించి.. ఫోన్ లాక్కుంటారు. ఆమె దగ్గర ఉన్న ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారు. ఈ లోపు కావ్యని కిడ్నాప్ చేసి తీసుకెళ్తుండగా.. అప్పూ వస్తుంది. కావ్యని కిడ్నాప్ చేయడం చూసి.. వెనకాలే పరుగెడుతుంది. ఇక మధ్యలో పరిగెత్తలేక ఆగి పోతుంది అప్పూ. ఇక ఏం చేయాలా అని అప్పూ కంగారు పడుతూ..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కావ్యని ఎవరూ లేని చోటికి తీసుకొచ్చి.. ప్లాన్ చేసి కిడ్నాప్ చేస్తారు. కావ్యని బలవంతంగా బండి ఎక్కించి.. ఫోన్ లాక్కుంటారు. ఆమె దగ్గర ఉన్న ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారు. ఈ లోపు కావ్యని కిడ్నాప్ చేసి తీసుకెళ్తుండగా.. అప్పూ వస్తుంది. కావ్యని కిడ్నాప్ చేయడం చూసి.. వెనకాలే పరుగెడుతుంది. ఇక మధ్యలో పరిగెత్తలేక ఆగి పోతుంది అప్పూ. ఇక ఏం చేయాలా అని అప్పూ కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే రాజ్‌కి కాల్ చేస్తుంది అప్పూ. సరిగ్గా అదే సమయంలో రాజ్ కారులో వెళ్తూ ఉంటాడు. అప్పుడే రాజ్‌కి సెక్యూరిటీ గార్డ్ కాల్ చేస్తాడు. కావ్య మేడమ్ ఫిబ్రవరి 19th ఆఫీస్‌కి వచ్చారు. ఆ రోజు ఎవరన్నా గెస్టులు వచ్చారా? అని అడిగారు. నేను ఎవరూ రాలేదని చెప్పినా వినకుండా.. సీసీ కెమెరా చెక్ చేశారు.
నిజం తెలుసుకున్న రాజ్.. కంగారులో అప్పూ..
అప్పుడే అప్పూ.. రాజ్‌కి కాల్ చేస్తూ కంగారు పడుతూ ఉంటుంది. మేడమ్ హార్డ్ డిస్క్ తీసుకెళ్లారని సెక్యూరిటీ చెప్తాడు. దీంతో షాక్ అయిన రాజ్.. అంటే ఆ బిడ్డకు తండ్రి మా డాడ్ అన్న విషయం కళావతికి తెలిసి పోయింది అన్నమాట అని మనసులో అనుకుంటాడు. మేడమ్ ఇంకా హార్డ్ డిస్క్ పంపలేదు సర్. ఇక్కడ రికార్డ్ పెట్టడానికి బేకప్ లేదు అందుకే కాల్ చేశానని సెక్యూరిటీ చెప్తాడు. ఈ లోపు రాజ్ ఫోన్‌కి చార్జింగ్ అయిపోవడంతో స్విచ్ ఆఫ్ అవుతుంది. ఆ తర్వాత అప్పూ.. కళ్యాణ్‌కి కాల్ చేస్తుంది. కానీ కవి కూడా ఫోన్ ఎత్తడు. దీంతో నేరుగా ఇంటికి వెళ్తుంది అప్పూ.
నీ వల్ల నేను ప్రశాంతంగా నిద్రపోయిందే లేదు..
అప్పటికే దుగ్గిరాల ఇంట్లో కళ్యాణ్, అనామిక రచ్చ కొనసాగుతుంది. ఇప్పటి వరకూ మీ అమ్మాయి.. తన పడుతున్న కష్టాల గురించి మాత్రమే చెప్పింది. కానీ నేను పడుతున్న మానసిక బాధ గురించి మీతో చెప్పిందా? అని కళ్యాణ్ నిలదీస్తాడు. నా వల్ల నువ్వేం బాధ పడుతున్నావ్ కళ్యాణ్? అని అనామిక అడిగితే.. నేను పుట్టి పెరిగిన ఇన్ని సంవత్సరాల వరకూ నేను ఎవరి వల్లా కాస్త కూడా బాధ పడలేదు. పెళ్లి అయినప్పటి నుంచి నీ వల్ల బాధ పడుతూనే ఉన్నాను. అన్నీ నువ్వే చేస్తున్నావ్.. అందరి ముందూ నన్ను దోషిలా నిలబెడుతున్నావ్. నీ అనుమానాలతో నన్ను అవమానిస్తున్నావ్. నన్ను పోలీస్ స్టేషన్‌లో కూర్చోబెట్టావ్. అయినా మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వకుండా.. ఇప్పుడు ఈ పంచాయితీ పెట్టించావ్. నీ వల్ల నేను ప్రశాంతంగా నిద్రపోయిందే లేదని కళ్యాణ్ తన ఫ్రస్ట్రేషన్‌ను బయట పెడతాడు.
నాకు విడాకులు కావాలి: కళ్యాణ్
సరే ఇద్దరూ సర్దుకు పోతేనే కదా సంసారం నిలబడేదని పెద్దావిడ అంటే.. సంస్కారం తెలీని ఆడదానితో సంసారం సాగదు. నేను నీకు విడాకులు ఇవ్వాలి అనుకుంటున్నానని కళ్యాణ్ అంటాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. కళ్యాణ్‌కి ఒకరి తర్వాత మరొకరు నచ్చచెప్తూ ఉంటారు. తప్పు ఏవో ఇబ్బందులు ఉంటే చూసుకోవాలి కానీ.. విడాకులు ఎందుకు? అని అంటారు. ఇక అప్పుడే అప్పూ కంగారుగా ఇంటికి వస్తుంది. అది చూసి అనామిక మరింత ఆవేశం తెచ్చుకుంటుంది. ఏంటి ఈ అమ్మాయి ఇప్పుడే వచ్చింది అనుకుంటారు.
పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లినా నీకు ఇంకా బుద్ధి రాలేదా..
చూశారా.. కళ్యాణ్ విడాకులు ఇస్తాడని ఎందుకు అన్నారో ఇప్పుడైనా అర్థమైందా? ఇద్దరూ కలిసి మాట్లాడుకునే ఇదంతా చేస్తున్నారని అనామిక అంటే.. మళ్లీ అప్పూ గురించి మాట్లాడితే మర్యాదగా ఉండదని కళ్యాణ్ వార్నింగ్ ఇస్తాడు. అనామిక మాట్లాడిన దానిలో తప్పేం ఉందిరా? దేని గురించి గొడవ జరుగుతుందో.. ఆ పిల్ల ఇప్పుడే సమయానికి రావాలా? మీరిద్దరూ కలిసి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఏంటి? అని రుద్రాణి అడుగుతుంది. ఏం బాగోతం జరుగుతుంది ఇక్కడ? అని అప్పూ అడిగితే.. అనామికకు, కళ్యాణ్‌కు నీ వల్లే గొడవలు జరుగుతున్నాయట అని స్వప్న అంటుంది. ఏం తల్లీ పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లినా నీకు ఇంకా బుద్ధి రాలేదా? వీళ్లిద్దర్నీ విడదీసే దాకా నిద్రపోవా? అని ధాన్య లక్ష్మి అడుగుతుంది.
లేచి పోదాం రారా భయ్..
ఏందమ్మా నీ బాధ? వాడేందో.. వాడి పెళ్లాం ఏంటో.. ఈ తొక్కలో పంచాయితీ ఏంటో నాకేం తెలుస్తలేదు. నీ కొడుకు ఏమన్నా జగదేక వీరుడు అనుకుంటున్నావా? లేక నీ కోడలు అతిలోక సుందరి అనుకుంటున్నావా? వీరిద్దరూ కొట్టుకుని చస్తే.. నామీద పడతారేంటి? 24 గంటలూ నా కోడలూ నా కోడలూ అని ఆ సోది తప్పితే ఇంకేం దొరకదా? అరేయ్ రారా భయ్.. వీళ్లు అనుకున్నదే నిజం చేద్దాం లేచి పోదాం రా అని అప్పూ అనేసరికి.. అందరూ షాక్ అవుతారు. ఏంటి అప్పూ నువ్వు కూడా అని కళ్యాణ్ అంటాడు. ఏందిరా భయ్ నీలాంటి సరస్వతీ పుత్రుడిని పట్టుకుని ఇంత ఘోరంగా అవమానిస్తుంటే.. వీళ్లందరూ మట్టి కొట్టుకుని పోతారు. అయినా నీ ఏడుపేదో నువ్వే ఏడు.. ఏరి కోరి చేసుకున్నావ్? కదా.. చచ్చేదాకా ఆ పిల్లతోనే కాపురం చేయాలి. నీ తిప్పలు నువ్వు పడాల్సిందే అని అప్పూ అంటుంది. అసలు ఏం పని మీద వచ్చావ్ నువ్వు? అని స్వప్న అడిగితే.. రాజ్ బావగారి కోసం వచ్చాను. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది అని అప్పూ అంటుంది. లేరే అని స్వప్న అంటే.. అబ్బా నేనేం చేయాలి ఇప్పుడు సరేలే వస్తాను అని అప్పూ వెళ్తుంది.
పల్లు రాలతాయ్.. మూసుకుని నీ పని నువ్వు చూసుకో..
ఏయ్ ఆగు.. అని శైలూ తల్లి ఆపితే.. అప్పటికే కోపంతో ఉన్న అప్పూ పల్లు రాలతాయ్.. మూసుకుని నీ పని నువ్వు చూసుకో అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది. మీరు కూడా ఉన్నారు కదా.. అప్పూ కూడా కళ్యాణ్, అనామికలు కడదాకా కలిసి ఉండాలని కోరుకుంటుంది. కాబట్టి అప్పూ విషయంలో మీ అమ్మాయి అస్సలు గోడవ పడకూడదు. వస్తే చుట్టపు చూపుగా రండి.. లేకపోతే రాకండి అని అనామిక పేరెంట్స్‌కు వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు సీతా రామయ్య.
కావ్యని కిడ్నాప్.. రాజ్‌కు చెప్పిన అప్పూ
ఈ సీన్ కట్ చేస్తే.. కావ్యని కారులో కిడ్నాపర్ ముఠా ఉన్న చోటికి తీసుకొస్తారు. రేయ్ ఎవర్రా మీరంతా.. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని కావ్య అడిగితే.. నిన్ను అమ్మేయడానికి తీసుకొచ్చాం. రేయ్ ఎక్కడ పట్టార్రా? మంచి ఫిగర్ అని అంటాడు. రేయ్ నేను ఎవర్నో తెలుసా? దుగ్గిరాల వారి ఇంటి కోడల్ని. ఈ విషయం మా ఆయనకు తెలిస్తే.. నువ్వు కుక్క చావు చస్తావ్ అని కావ్య అంటే.. నువ్వు ఎవరైతే ఏంటే.. ఒక్కసారి మాకు చిక్కితే మూడో కంటికి తెలీకుండా దేశం దాటించేస్తాం అని అంటాడు. ఇక కావ్యని కిడ్నాప్ చేసిన అమ్మాయిల దగ్గర పడేస్తారు. ఈలోపు అప్పూ టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే రాజ్ ఇంటికి వస్తాడు. ఏంటి బావా ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసుకున్నావ్? అక్కని ఎవరో కిడ్నాప్ చేశారు అని చెప్తుంది. దీంతో రాజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్‌తో మళ్లీ కలుద్దాం.