Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brahmamudi, June 7th Episode: రాజ్ దెబ్బకు వణికిపోయి బ్యాగ్ సర్దిన దొంగ మాయ..

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. అపర్ణ, ధాన్య లక్ష్మి, అనామిక, ఇందిరా దేవి అందరూ హాలులో కూర్చుని రాజ్, మాయల పెళ్లికి చీరలు తీసుకుంటూ ఉంటారు. అప్పటికే రాజ్ వార్నింగ్‌తో చిత్ర అయోమయంలో ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నావ్? పెళ్లికి చీర తీసుకో అని అపర్ణ అంటుంది. అప్పుడే కావ్య వస్తుంది. అది విని బాధ పడుతుంది. ఈ పెళ్లి ఎలా ఆపాలా అని ఆలోచనలో పడుతుంది. ఇక ఏదో భయం భయంగా..

Brahmamudi, June 7th Episode: రాజ్ దెబ్బకు వణికిపోయి బ్యాగ్ సర్దిన దొంగ మాయ..
Brahmamudi
Follow us
Chinni Enni

|

Updated on: Jun 07, 2024 | 1:12 PM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. అపర్ణ, ధాన్య లక్ష్మి, అనామిక, ఇందిరా దేవి అందరూ హాలులో కూర్చుని రాజ్, మాయల పెళ్లికి చీరలు తీసుకుంటూ ఉంటారు. అప్పటికే రాజ్ వార్నింగ్‌తో చిత్ర అయోమయంలో ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నావ్? పెళ్లికి చీర తీసుకో అని అపర్ణ అంటుంది. అప్పుడే కావ్య వస్తుంది. అది విని బాధ పడుతుంది. ఈ పెళ్లి ఎలా ఆపాలా అని ఆలోచనలో పడుతుంది. ఇక ఏదో భయం భయంగా చీర తీసుకుంటుంది చిత్ర. కావ్య అయితే బాధతో పైకి వెళ్తుంది.

చిత్రకు రాజ్ వార్నింగ్.. కావ్య హ్యాపీస్..

కావ్య దిగాలుగా గదిలోకి వెళ్లి ఆలోచిస్తుంది. అప్పుడే వచ్చిన రాజ్.. నువ్వు బయటకు వెళ్లి ఏం చేస్తావో నాకు తెలీదు. కానీ నేను చేయాల్సింది మాత్రం చేసేసాను. ఈ పెళ్లి జరగదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పెళ్లి జరగనివ్వను. దీంతో కావ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి ఏం చేశారు మీరు? అని అడుగుతుంది. ఆ మాయ అసలు పేరు చిత్ర. డబ్బు కోసమే ఇక్కడికి వచ్చి బిడ్డ తల్లిగా నాటకం ఆడుతుందని తెలుసుకున్నానని రాజ్ అంటే.. అవునా మీకెలా తెలుసు అని కావ్య అడిగితే.. ఆ చిత్ర తండ్రి కనిపించాడు. అప్పుడు అంతా తెలుసుకున్నాను అని రాజ్ చెప్తాడు. దీంతో కావ్య సంతోష పడుతుంది.

ఈ పెళ్లి ఆగిపోతుంది..

ఆ నిజం తెలుసుకోగానే.. ఆ చిత్ర దగ్గరకు వెళ్లి వార్నింగ్ ఇచ్చాను. నీ చరిత్ర అంతా తెలిసిపోయిందని చెప్పాను. తెల్లారేలోపు ఈ ఇంట్లోంచి గుట్టు చప్పుడు కాకుండా వెళ్లిపొమ్మని వార్నింగ్ ఇచ్చాను. వెళ్లకపోతే ఏం జరుగుతుందో కూడా చెప్పాను. నా వార్నింగ్‌కి ఆ చిత్ర వణికిపోయింది. ఖచ్చితంగా అది ఈ ఇంట్లోంచి వెళ్లిపోతుంది. ఈ పెళ్లి కూడా ఆగిపోతుంది. నిజం కూడా బయట పడదని రాజ్ అంటాడు. దీంతో కావ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

ఇంట్లోంచి వెళ్లిపోవడానికి బట్టలు సర్దుకున్న చిత్ర..

కబోర్డు‌లో ఉన్న బట్టలన్నీ బ్యాగులో సర్దుకుంటుంది చిత్ర. రాజ్ దెబ్బకు వణికిపోయి.. కంగారుగా ఈ ఇంట్లోంచి వెళ్లిపోవాలి అంటూ బ్యాగులో బట్టలు సర్దుకుంటుంది. అప్పుడే రుద్రాణి గదిలోకి వచ్చి.. ఏంటి? ఏం చేస్తున్నావ్? బట్టలు ఎందుకు సర్దుకుంటున్నావ్? అని అడుగుతుంది. నేను ఈ ఇంట్లోంచి వెళ్లిపోతున్నానని చిత్ర అనగానే.. రుద్రాణి షాక్ అవుతుంది. ఇదీ ఇవాళ్టి ఎపిసోడ్. రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ముగుస్తుంది.