Brahmamudi, September 14th episode: రాజ్-కావ్యల చిలిపి కొట్లాటలు.. మరోసారి కావ్యపై చిందులు తొక్కేందుకు రెడీ అయిన అపర్ణ.. ఈసారి ఏం జరుగుతుందో!!
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో సీతారామయ్య గదిలో నుంచి బయటకు రాగానే.. రాజ్, కావ్యలు తమ గదిలోకి వెళ్తారు. అక్కడ రాజ్ పెద్ద బిల్డప్ ఇచ్చి.. కావ్యకు థ్యాంక్స్ చెప్తాడు. దీంతో కావ్య ఉలిక్కి పడుతుంది. ఏంటి అది థ్యాంక్స్ చెప్పే విధానామా అని అంటుంది. నా హిస్టరీలోనే నేను థ్యాంక్స్ చెప్పలేదు.. నీకే చెప్తున్నా అని రాజ్ అంటాడు. ఎందుకు? అని కావ్య అడుగుతుంది. తాతయ్యకు నిజం చెప్పలేదు కాబట్టి అని చెప్తాడు. అయితే దానికన్నా ముందు మీరు నాకు సారీ చెప్పాలి.. అని అంటుంది కావ్య. థ్యాంక్స్ అంటే చెప్పాను కానీ.. సారీ మాత్రం చెప్పలేను అని అంటాడు రాజ్. దీంతో కావ్య.. మీరు ఏదో నటిస్తున్నట్లు నాకు తేడాగా ఉంది.. అని బాంబ్ పేలుస్తుంది. దాంతో దేవుడా.. దీనికి లేని పోని డౌట్లు అన్నీ వస్తున్నాయని మనసులో..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో సీతారామయ్య గదిలో నుంచి బయటకు రాగానే.. రాజ్, కావ్యలు తమ గదిలోకి వెళ్తారు. అక్కడ రాజ్ పెద్ద బిల్డప్ ఇచ్చి.. కావ్యకు థ్యాంక్స్ చెప్తాడు. దీంతో కావ్య ఉలిక్కి పడుతుంది. ఏంటి అది థ్యాంక్స్ చెప్పే విధానామా అని అంటుంది. నా హిస్టరీలోనే నేను థ్యాంక్స్ చెప్పలేదు.. నీకే చెప్తున్నా అని రాజ్ అంటాడు. ఎందుకు? అని కావ్య అడుగుతుంది. తాతయ్యకు నిజం చెప్పలేదు కాబట్టి అని చెప్తాడు. అయితే దానికన్నా ముందు మీరు నాకు సారీ చెప్పాలి.. అని అంటుంది కావ్య. థ్యాంక్స్ అంటే చెప్పాను కానీ.. సారీ మాత్రం చెప్పలేను అని అంటాడు రాజ్. దీంతో కావ్య.. మీరు ఏదో నటిస్తున్నట్లు నాకు తేడాగా ఉంది.. అని బాంబ్ పేలుస్తుంది. దాంతో దేవుడా.. దీనికి లేని పోని డౌట్లు అన్నీ వస్తున్నాయని మనసులో అనుకుంటాడు. ఇంకా టైం ఉంది కదా.. మారతాను పడుకో అని చెప్తాడు రాజ్.
ఆ తర్వాత కావ్య నేరుగా సీతారామయ్య దగ్గరకు వెళ్లి.. మీ మనవడి మీద డౌట్ గా ఉంది అని చెప్తుంది. ఏమైందమ్మా అని సీతారామయ్య అడుగుతాడు. మూడు నెలల్లోపు మారడానికి ట్రై చేస్తాను.. అని గడువు కోరారు. ఈ లోపు మారకపోతే నేనేం చేయాలి? అని కావ్య అడుగుతుంది. దీంతో సీతారామయ్య ఫైర్ అవుతూ.. మూడు నెలలు గడువు పెట్టాడా.. అంటే నేను చచ్చాక వదిలేస్తాడా? అంటూ అసలు విషయాన్ని బటయ పెడతాడు. ఏంటని కావ్య షాక్ అవుతుంది. దీంతో రాజ్ ఆ మ్యాటర్ అంతా కవర్ చేస్తాడు. నేను కళావతిని బాగానే చూసుకుంటున్నా.. దీంతో కావ్య.. రాజ్ లు ఇద్దరూ దెబ్బలాడుకుంటూంటారు. దీంతో రాజ్ నిద్రలోనుంచి ఉలిక్కి పడుతూ లేస్తాడు. వామ్మో ఇదంతా కలా అని అనుకుంటాడు రాజ్. ఈలోపు టీవీ రిమోట్ ఆన్ అవుతుంది.
టీవీలో ఆసనాల ప్రోగ్రామ్ వస్తుంది. మీరు మీ భార్యతో వేగలేకపోతున్నారా? అయితే ఈ ఆసనం ట్రై చేయండి అని వస్తుంది. దీంతో రాజ్ ఇదేదో బాగుందే.. ట్రై చేద్దాం అంటూ రెడీగా కూర్చుంటాడు. టీవీలో అతను చెప్పినట్టు చేస్తాడు. పద్మాసనంలో కూర్చొని.. రెండు చేతులు వెనక్కి పెట్టి నమస్కారం చేస్తాడు.. ఇప్పుడే టీవీలో బ్రేక్ వస్తుంది. దీంతో ఇక రాజ్.. లబోదిబో మంటాడు. అప్పుడే కావ్య వస్తుంది. రాజ్ ని చూసి ఇదేం ఆసనం అండీ? అని అడుగుతుంది. సాయం చేయ్ తట్టుకోలేక పోతున్నా నొప్పి అని అంటాడు. రాత్రి చెప్పాల్సిన సారీ ఇప్పుడు చెప్పేస్తా సహాయం చేస్తా అని కావ్య చెప్తుంది. దీంతో రాజ్ తప్పక సారీ చెప్తాడు. దీంతో ఊపిరి పీల్చుకుంటాడు రాజ్. ఆ తర్వాత కావ్య రాజ్ పక్కనే కూర్చుంటుంది. అప్పుడే టీవీలో యాడ్ అయిపోయి ఆ వ్యక్తి వస్తాడు. ఇలా రోజూ ఆసనాలు వేయడం వల్ల మీ భార్యను భరించే నుంచి ఎదుర్కొనే శక్తి లభిస్తుంది అని చెప్తాడు.
ఇది చూసిన కావ్య.. రాజ్ వైపు కోపంగా చూసి.. వచ్చిందా శక్తి అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇంతలో కావ్యను చూసి ఏయ్ ఏయ్ నిన్నే అంటూ రుద్రాణి పిలుస్తుంది. నాకు ఒక పేరు ఉంది అది పెట్టి పిలవండి అని కావ్య అంటుంది. ఇక్కడ నేను కూర్చుంది కనిపించడం లేదా? కాఫీ ఇవ్వడం అవసరం లేదా? అని రుద్రాణి ప్రశ్నిస్తుంది. ఒక పది నిమిషాలు ఆగండి ఇస్తాను.. లేదంటే మీరే వెళ్లి కలుపుకోండి అని అంటుంది. ఎంత పొగరు నీకు? ఇక్కడ రాచరికం వెలగబెడుతున్నావా? నాలుగు రోజుల నుంచి నీ భర్త నీ వెనక తిరిగే సరికి నీకు కొమ్ములు వచ్చాయా? ఏం మందు పెట్టావే? అంటూ నోరు పారేసుకుంటుంది రుద్రాణి. అయ్యో మీరు చాలా పొరడుతున్నారు. భర్త మనసు గెలుసుకోవాలంటే.. ఏ మందులూ, మాకులూ అవసరం లేదు. ప్రేమ, సహనం కావాలి. ఈ విషయం తెలియక మీరు ఎన్నాళ్ల నుంచో ఒంటరిగానే ఉన్నారు అంటూ చురకలు అంటిస్తుంది. దీంతో రుద్రాణి నాకే కౌంటర్ వేస్తావా? నీ సంగతి చెప్తా అంటూ ఫైర్ అవుతుంది.
ఈ లోపు పని మనిషి అపర్ణకు కాఫీ పెట్టి ఇస్తుంది. దీంతో నువ్వు ఇస్తున్నావేంటి? కావ్య ఇంకా నిద్ర లేవలేదా? అని ప్రశ్నిస్తుంది. ఆ తర్వాత అమ్మగారూ.. నాకు కొంచెం డబ్బులు అవసరం ఉంది.. అడ్వాన్స్ కావాలి అని అడుగుతుంది. ఎన్ని సార్లు అడ్వాన్స్ తీసుకుంటావ్? ఇవ్వను అంటుంది అపర్ణ. ఇదంతా చూసిన రుద్రాణి.. కావ్యను ఇరికించడానికి ప్లాన్ దొరికింది అని అంటుంది. పని మనిషి బయటకు రాగానే.. రుద్రాణి శాంతా నీకు డబ్బు కావాలా? అయితే కావ్యను అడుగు ఇస్తుంది అని చెప్తుంది. దీంతో పని మనిషి సరే అంటుంది. ఆ తర్వాత కూరగాయలు కట్ చేస్తున్న కావ్యను.. పని మనిషి డబ్బులు అడుగుతుంది. దీంతో కావ్య సరే అని అంటుంది. ఈలోపు అనామిక కళ్యాణ్ కు కాల్ చేసి ట్యాబ్లెట్స్ వేసుకోమని జాగ్రత్తలు చెప్తుంది. ఆ తర్వాత కళ్యాణ్ అనామిక కూడా నన్ను ఇష్టపడుతుందనుకుంట.. అయితే మన ప్రేమ విషయం చెప్పేయాలి. ఎలా అంటూ అప్పూకి కాల్ చేస్తాడు. ఒకసారి కలవమని చెప్తాడు.
ఈ సీన్ కట్ చేస్తే.. మీ ఆసనాలు అప్పుడే అయిపోయాయా అని రాజ్ ని అడుగుతంది కావ్య. వెటకారం చేయడానికి వచ్చావా? అని అంటాడు. కాదు డబ్బు కోసం వచ్చాను అని అంటుంది. నీకు డబ్బులు అవసరం వచ్చినప్పుడు నన్ను కాదు.. ఆ డ్రాలో ఉంటాయి తీసుకోమని చెప్పాను కదా అని రాజ్ అనగా.. అవసరం వస్తే చెప్పే తీసుకుంటాను అని నేను కూడా చెప్పాను కదా. శాంతాకు ఏదో అవసరం వచ్చిందట.. అని కావ్య చెప్పగా.. మంచి పనికే కదా ఇవ్వు అని అంటాడు రాజ్. దీంతో కావ్య డబ్బు తీసుకుని పని మనిషికి ఇవ్వడానికి వస్తుంది.
ఈలోపు రుద్రాణి తగల బెట్టడానికి రెడీ అయిపోతుంది. అపర్ణ దగ్గరకు వెళ్లి.. అక్కడ అంత జరుగుతుంటే.. నువ్వు తాపీగా బుక్ చదువుతున్నావా వదినా అని రుద్రాణి అనగా.. ఏమైంది అని అపర్ణ అడుగుతుంది. నీ కోడలు నీ పరువును గంగలో కలిపేస్తుంది. నువ్వు పని మనిషికి డబ్బులు ఇవ్వను అని చెప్పావా.. కానీ కావ్య మాత్రం వెళ్లి డబ్బులు ఇస్తుంది అని చెప్తుంది. ఇది విన్న అపర్ణ.. ఆవేశంతో రెచ్చిపోతుంది. ఇక ఈ రోజుతో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్లీ రేపటి ఎపిసోడ్ మళ్లీ కలుద్దాం.