Kodiguddu Karam Podi: కోడి గుడ్డు కారం ఇలా చేశారనుకోండి.. ఇక మాటలు ఉండవు! అంత టేస్టీగా ఉంటుంది!!

ఒక్కొక్కరికి ఒక్కొటి అంటే ఇష్టం. అలా కోడి గుడ్డు కూడా కొంత మందికి చాలా ఇష్టం. ఎగ్ తో ఏ వంటకం చేసినా మొత్తం లాగించేస్తారు. అందులోనూ గుడ్లు ఆరోగ్యానికి మంచిది కూడా. వయసుతో తేడా లేకుండా ఎవరైనా రోజుకో గుడ్డు తినాలని చెబుతూంటారు. ఎగ్ తో ఎప్పుడూ ఒకే రకం కూరలు, పులుసులు చేసుకుని బోర్ కొట్టి ఉంటే.. ఈసారి ఇలా కోడి గుడ్డు కారం చేసి చూడండి. టేస్ట్ అదిరిపోతుంది అంతే. ఒక్కసారి రుచి చూశారనుకోండి.. మళ్లీ మళ్లీ చేయమంటారు. అంత బావుంటుంది. అందులో వాతావరణం కాస్త చల్లగా ఉన్నప్పుడు ఇలా స్పైసీగా చేసుకుని తింటే.. ఇంకా బావుంటుంది. మరి ఇంకెందుకు లేట్....

Kodiguddu Karam Podi:  కోడి గుడ్డు కారం ఇలా చేశారనుకోండి.. ఇక మాటలు ఉండవు! అంత టేస్టీగా ఉంటుంది!!
Kodiguddu Karam
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Sep 18, 2023 | 9:00 PM

ఒక్కొక్కరికి ఒక్కొటి అంటే ఇష్టం. అలా కోడి గుడ్డు కూడా కొంత మందికి చాలా ఇష్టం. ఎగ్ తో ఏ వంటకం చేసినా మొత్తం లాగించేస్తారు. అందులోనూ గుడ్లు ఆరోగ్యానికి మంచిది కూడా. వయసుతో తేడా లేకుండా ఎవరైనా రోజుకో గుడ్డు తినాలని చెబుతూంటారు. ఎగ్ తో ఎప్పుడూ ఒకే రకం కూరలు, పులుసులు చేసుకుని బోర్ కొట్టి ఉంటే.. ఈసారి ఇలా కోడి గుడ్డు కారం చేసి చూడండి. టేస్ట్ అదిరిపోతుంది అంతే. ఒక్కసారి రుచి చూశారనుకోండి.. మళ్లీ మళ్లీ చేయమంటారు. అంత బావుంటుంది. అందులో వాతావరణం కాస్త చల్లగా ఉన్నప్పుడు ఇలా స్పైసీగా చేసుకుని తింటే.. ఇంకా బావుంటుంది. మరి ఇంకెందుకు లేట్.. ఆ రెసిపీ ఏంటి? ఎలా చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం.

కోడిగుడ్డు కారానికి కావాల్సిన పదార్థాలు:

గుడ్లు, ఉల్లిపాయలు, కరివేపాకు, ధనియాలు, జీలకర్ర, కారం, ఉప్పు, ఎండు మిర్చి, నువ్వులు, వెల్లుల్లి రెబ్బలు, పుట్నాల పప్పు, నూనె, కరివేపాకు, ఎండు కొబ్బరి పొడి.

ఇవి కూడా చదవండి

తయారీ విధానం:

ఈ కోడి గుడ్డు కారం చేయడం చాలా ఈజీ. ముందుగా గుడ్లును ఉడక పెట్టుకుని పక్కకు పెట్టుకోండి. ఆ తర్వాత మీ రుచికి తగినట్టుగా ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, నవ్వులు, పుట్నాల పప్పు, ఎండు కొబ్బరి ఉప్పు వేసి కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ మీద ఓ గిన్నె లేదా కళాయి పెట్టి నూనె వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కాక కారం, ఉప్పు వేసి కలపాలి. ఇందులో గుడ్లను వేసి వేయించుకుని పక్కకు పెట్టుకోవాలి.

అదే పాన్ లో ఉల్లి పాయ ముక్కలను కూడా వేసుకుని.. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేయించుకుని పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు, వేయించిన గుడ్లను కూడా వేసి ఓ రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి. నెక్ట్స్ మిక్సీ పట్టుకున్న కారం పొడిని కూడా వేసుకోవాలి. ఇలా ఓ రెండు, మూడు నిమిషాలు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే కోడి గుడ్డు కారం రెడీ. ఈ కారాన్ని కూడా కావాలనుకున్న వారు నెయ్యి వేసుకుని వేడి వేడి అన్నంలోకి తింటే అద్భుతంగా ఉంటుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి