Trisha: త్రిషతో ఉన్నఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్.. ఒక్క సినిమాతోనే..
ఛైల్డ్ ఆర్టిస్టుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. చిన్నతనంలోనే స్టార్ హీరోలు, హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఆ తర్వాత హీరోయిన్ గానూ ఎంట్రీ ఇచ్చి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ హీరోయిన్ పేరు తెగ మార్మోగిపోతోంది

పై ఫొటోలో త్రిషతో ఉన్నదెవరో గుర్తు పట్టారా?ఈ అమ్మాయి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ హీరోయిన్. తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాషల్లో వరుసగా సినిమాలు చేస్తోంది. చాలా మంది హీరోయిన్ల లాగే ఈ ముద్దుగుమ్మ కూడా ఛైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. చిన్నతనంలోనే త్రిష, మంజు వారియర్ వంటి స్టార్లతో స్క్రీన్ షేర్ చేసుకుంది. తన నటనా ప్రతిభకు ప్రతీకగా పలువురి ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత హీరోయిన్ గానూ ఎంట్రీ ఇచ్చింది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, మలయాళం భాషల్లో వరుసగా సినిమాలు చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటోంది. ముఖ్యంగా ఇప్పుడు టాలీవుడ్ లో ఈ అమ్మడి పేరు తెగ మార్మోగిపోతోంది. ఆ మధ్యన ఒక డబ్బింగ్ సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు పరిచయమైన ఈ అందాల తార ఇప్పుడు నేరుగా ఓ తెలుగు మూవీలోనే నటిస్తోంది. సినిమా ప్రమోషన్లు, ఫంక్షన్లలో ఈ ముద్దుగుమ్మ తెగ కనిపిస్తోంది. చక్కని చీరకట్టులో అచ్చం పక్కిటమ్మాయిలా కనిపిస్తోంది. ఈ సొగసరి అందానికి తెలుగు ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. ప్రజెంట్ తెలుగు యూత్ క్రష్ గా మారిపోయిన ఈ క్యూటీ మరెవరో కాదు ఛాంపియన్ హీరోయిన్ అనస్వర రాజన్.
గతంలో పలు సినిమాల్లో ఛైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది అనస్వర రాజన్. ఆ తర్వాత హీరోయిన్ గానూ సక్సెస్ అయ్యింది. తమిళం, మలయాళం, హిందీ భాషల్లో పలు హిట్ సినిమాల్లో నటించింది. అయితే తెలుగు ఆడియెన్స్ కు చేరువైంది మాత్రం రేఖా చిత్రం అనే మలయాళం సినిమాతోనే. ఓటీటీలో వచ్చిన ఈ డబ్బింగ్ మూవీలో అనస్వర అందం, అభినయం అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు ఛాంపియన్ సినిమాతో నేరుగా టాలీవుడ్ లోకి అడుగు పెడుతోంది. ఇందులో శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో చంద్రకళ పాత్ర అనే పాత్రలో అనస్వర కనిపించనుంది. ఇప్పటకే ఛాంపియన్ సినిమా నుంచి రిలీజైన అనస్వర పోస్టర్స్, గ్లింప్స్ ఈ మూవీపై అంచనాలను అమాంతం పెంచేశాయి.
ఛాంపియన్ సినిమాలో అనస్వర రాజన్..
View this post on Instagram
ఛాంపియన్ సినిమాకు ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్‌పై ఈ మూవీని రూపొందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. ఈ మూవీని వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్లపై నిర్మించారు. ఛాంపియన్ తో పాటు మీ అర్జున అనే సినిమాలో కూడా హీరోయన్ గా నటిస్తోంది అనస్వర రాజన్. ఈ మూవీ కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




