Brahmamudi, October 3rd episode: చీటీలో రాజ్ రాసిన విషయం కావ్యకు తెలుస్తుందా? కావ్య ఎలా రియాక్ట్ అవుతుంది!
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో కనకానికి ఫోన్ చేస్తుంది అపర్ణ. ఏంటి మా కోడలు పిలిస్తే రానన్నారంట. రేపు పండక్కి అందరూ కలిసి ఇక్కడికి వస్తున్నారు. అందరం కలిసి పండగు జరుపుకుంటున్నాం అని అపర్ణ అంటుంది. అంటే వదిన గారూ అంటూ ఏదో అంటుంది కనకం. అదేంటి నేను పిలిచినా రారా.. అని అపర్ణ గట్టిగా మాట్లాడుతుంది. మీరు పిలిచాక రాకుండా ఎలా ఉంటాం.. తప్పకుండా వస్తాం వదిన గారూ అని కనకం అంటుంది. సరే అని అపర్ణ ఫోన్ కట్ చేస్తుంది. రేపు మీ వాళ్లే..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో కనకానికి ఫోన్ చేస్తుంది అపర్ణ. ఏంటి మా కోడలు పిలిస్తే రానన్నారంట. రేపు పండక్కి అందరూ కలిసి ఇక్కడికి వస్తున్నారు. అందరం కలిసి పండగు జరుపుకుంటున్నాం అని అపర్ణ అంటుంది. అంటే వదిన గారూ అంటూ ఏదో అంటుంది కనకం. అదేంటి నేను పిలిచినా రారా.. అని అపర్ణ గట్టిగా మాట్లాడుతుంది. మీరు పిలిచాక రాకుండా ఎలా ఉంటాం.. తప్పకుండా వస్తాం వదిన గారూ అని కనకం అంటుంది. సరే అని అపర్ణ ఫోన్ కట్ చేస్తుంది. రేపు మీ వాళ్లే ఇక్కడికి వస్తారు అని కావ్యతో చెప్తుంది. నువ్వు ఇవ్వాల్సిన పనులు.. చేయాల్సిన పనులు ఇక్కడే చేసుకో అంటుంది అపర్ణ. హా సరే అత్తయ్య థాంక్యూ సో మచ్ అని అంటుంది కావ్య.
కావ్య ప్లాన్ సక్సెస్.. కనకాన్ని పుట్టింటికి పిలిచిన అపర్ణ:
నేను నీ కోసం ఏమీ చేయలేదు.. పండగ రోజు నా కొడుకు నా ముందే ఉండాలని చెప్పి చేశాను అంటుంది అపర్ణ. ఇక కావ్య సంతోష పడుతుంది. మా వదిన మరీ ఇంత పిచ్చిది అని అనుకోలేదు.. ఆ కావ్య ప్లాన్ చేసి మరీ తన పుట్టింటి వాళ్లను మా వదిన చేతే పిలిపించుకుంది. ఆ విషయం తెలీక ఏదో వరల్డ్ కప్ సాధించినట్టు వెళ్లింది అంటూ రుద్రాణి మనసులోనే తిట్టుకుంటుంది. రుద్రాణి గారూ దద్దోజనం వేయమంటారా అని కావ్య కావాలనే అడుగుతుంది. వద్దు మీ అత్తయ్యని చేశావుగా చాలు అంటుంది రుద్రాణి.
పండుగ కోసం అంతా సిద్ధం చేస్తారు:
ఇక తెల్లవారుతుంది. వినాయక చవితి కోసం అంతా సిద్ధం అవుతారు. ఇక స్వప్న తన కడుపు గురించి కంగారు పడుతూ ఉంటుంది. ఆ తర్వాత సీతా రామయ్య చాలా అందంగా తయారు చేశారు అని అంటాడు. అందంగా చేస్తే సరిపోతుందా బావా.. సమయానికి అన్నీ సవ్యంగా జరగాలి కదా. మీరేం కంగారు పడకండి అత్తయ్య అన్నీ సమయానికే జరుగుతాయి. ఎక్కడ జరుగుతున్నాయి.. ఇంకా విగ్రహమే పెట్టలేదు. రాజ్ వాళ్లందరూ ఎక్కడ? అని ఇందిరా దేవి అడగ్గానే.. రాజ్, కావ్య, కళ్యాణ్, రాహుల్, ప్రకాశం, సుభాష్ కలిసి విగ్రహాన్ని తీసుకొస్తారు.
కావ్య నుదుటన కుంకం పెట్టిన రాజ్:
అపర్ణ అప్పుడే కావ్య ముఖం చూస్తుంది. కావ్య ముఖానికి బొట్టు ఉండదు. ఏంటి కావ్యా ఇది పండగ పూట బొట్టు పెట్టుకోకుండా అలా ఉంటారా.. అది కూడా నీకు ప్రత్యేకంగా చెప్పాలా.. అని అపర్ణ అనగా.. మర్చిపోయిందేమో వదినా అని ప్రకాశం అంటాడు. తనేమీ మీలా కాదులెండీ మర్చిపోవడానికి అని ధాన్య లక్ష్మి అనగా.. బొట్టు పెట్టుకున్నాను అత్తయ్యా.. ఎక్కడో జారి పోయినట్టుందని కావ్య చెప్తుంది. ఇప్పుడే పైకి వెళ్లి పెట్టుకుని వస్తాను అని కావ్య వెళ్తుండగా.. దాని కోసం పై వరకూ ఎందుకోసం వెళ్లాలి. రాజ్.. అక్కడ కుంకుమ తీసుకుని కావ్య నుదుటన పెట్టు అని ఇందిరా దేవి చెప్తుంది. కానీ రాజ్ మాత్రం అపర్ణ, కావ్య ముఖం చూస్తే అక్కడే ఉంటాడు. ఇందిరా దేవి మళ్లీ వెళ్లు అని చెప్పగా.. వెళ్తాడు.
చీటీలో కోరికలు రాసిన దుగ్గిరాల ఫ్యామిలీ:
విగ్రహాన్ని ప్రతిష్టించేశాం కాబట్టి.. మన ఆనవాయితీ ప్రకారం కోరికల చీటీలని పూర్తి చేద్దాం అని ఇందిరా దేవి అనగానే.. కోరికల చిట్టీనా అదేంటి అమ్మమ్మా.. ఎప్పుడూ వినలేదు. ఎక్కడా ఉండదు కూడా.. మన దుగ్గిరాల ఇంట్లోనే జరుగుతుందని ఇందిరా దేవి అంటుంది. మన మనసులో ఉన్న కోరికలను ఒక చీటీలో రాసి వాటిని వినాయకుడి దగ్గర పెట్టాలి. పూజ పూర్తికాగానే వినాయకుడితో పాటు వాటిని కూడా నిమజ్జనం చేయాలి. ఇలా చేస్తే మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. నిజంగా నెరవేరతాయా.. అని స్వప్న అడగ్గా.. తప్పకుండా నెరవేరతాయని ఇందిరా దేవి అంటుంది.
ఆ తర్వాత అందరూ వాళ్ల మనసులోని కోరికలు రాస్తూంటారు. రాజ్, కావ్యని వేరు చేసి నా కొడుక్కి మనశ్శాంతి కలిగించు అని అపర్ణ రాస్తుంది. తాతయ్యకి ఇచ్చిన మాట కోసమే నేనే కళావతితో మంచిగా ఉన్నట్టు నటిస్తున్నా.. ఇలా నటిస్తూ ఉంటే కళావతిని మోసం చేస్తున్నానన్న గిల్టీ ఫీలింగ్ ఎక్కువ అవుతుంది. నువ్వే ఏదో ఒకటి చేసి ఈ నాటకాన్ని ముగించు. నాకు ఈ బాధ నుంచి విముక్తి కల్పించు అని రాజ్ రాస్తాడు. మా ఆయన ఏం కోరుకుంటే.. అదే జరిగేట్టు చూడు స్వామి అని కావ్య కోరుకుంటుంది. ఇక రాజ్ ఏం కోరుకున్నాడో తెలుసుకోవాలని ఆతృతగా ఉంటుంది కావ్య. ఎవరూ లేని సమయంలో వచ్చి.. రాజ్ ఏం రాశాడో తెలుసుకోవాలని వచ్చి చీటీ తీయబోతుంది.
రాజ్ రాసింది కావ్యకు తెలుస్తుందా:
ఈలోపు కళ్యాణ్ వచ్చి వదినా.. అని గట్టిగా అరుస్తాడు. దీంతో కావ్య షాక్ అవుతుంది. ఏంటి కవి గారూ ఎందుకు టెన్షన్ పడుతున్నారు అని కావ్య అడుగుతుంది. పండగని ఇంటికి పిలిచారా.. అని అడుగుతుంది కావ్య. లేదు తనే వస్తుంది అని కళ్యాణ్ చెప్తాడు. అంటే మెల్ల మెల్లగా ఇంట్లోని వారితో క్లోజ్ అయి పెళ్లి వైపు అడుగులు వేయాలని అనుకుంటుంది అన్నమాట అని కావ్య అనగా.. అడుగులు కాదు పరుగులు తీస్తోంది అని కళ్యాణ్ అంటాడు. మంచి విషయమే కదా కవి గారూ అని కళ్యాణ్ అనగా.. మీకు విషయం తెలీకుండా మాట్లాడుతున్నారు. అనామిక వాళ్ల అమ్మానాన్నల్ని తీసుకొస్తుంది. వాళ్లు ఇక్కడికి వచ్చి పెళ్లి గురించి మాట్లాడతారంట.. పెద్దమ్మ, రుద్రాణి అత్తయ్య ఏం మాట్లాడతారో ఏంటో అని భయంగా ఉంది అని కళ్యాణ్ అంటాడు. మీకెందుకు టెన్షన్ నేను ఉన్నాను కదా అని కావ్య చెప్తుంది. ఇక అక్కడి నుంచి కళ్యాణ్ వెళ్తాడు. మళ్లీ కావ్య చీటీ తీయబోతే ధాన్య లక్ష్మి వస్తుంది. ఏం చేస్తున్నావ్ అని అనగా.. పూజకి రెడీ చేస్తున్నా అత్తయ్య అని అంటుంది కావ్య. తర్వాత చేయవచ్చు ముందు మీ అమ్మా నాన్న వచ్చారు పదా అని పిలుస్తుంది. కావ్య సంతోషంగా వస్తుంది. ఇక ఒకేసారి ఇంట్లోని సభ్యులందరూ ఒకసారే వస్తారు.