Bigg Boss Season 7: ఈ సారి గట్టిగా దిగిందయ్యా కత్తి..! నామినేషన్సా మజాకా.. కంటెస్టెంట్స్ దిమ్మతిరిగిపోలే..

బిగ్‌బాస్‌ మండే ఎపిసోడ్స్‌లో ఉండే మజానే వేరు. ఎందుకంటే ఆరోజే నామినేషన్స్‌ ఉంటాయి. హౌజ్‌ లో కలివిడిగా ఉండే కంటెస్టెంట్ల అసలు రూపం ఇక్కడే బయటపడుతుంది. ఒకరిని ఒకరు తిట్టుకుంటారు. అలా ఐదో వారం నామినేషన్స్‌లో ఓ రేంజ్‌లో జరిగాయి. ముఖ్యంగా శివాజీ తోటి ఇంటి సభ్యులపై శివాలెత్తిపోయాడు. అబద్ధాలు ఆడుతూ, తప్పుడు మాటలతో తన హౌజ్‌మేట్ స్థానాన్ని తీసేసిన కంటెస్టెంట్లపై ఫైరయ్యాడు. ముఖ్యంగా సీరియల్‌ బ్యాచ్‌ లీడర్‌ అమర్‌దీప్‌కు ఓ రేంజ్‌లో ఇచ్చి పడేశాడు

Bigg Boss Season 7: ఈ సారి గట్టిగా దిగిందయ్యా కత్తి..! నామినేషన్సా మజాకా.. కంటెస్టెంట్స్ దిమ్మతిరిగిపోలే..
Bigg Boss 7 Telugu 29th Episode
Follow us
Basha Shek

|

Updated on: Oct 03, 2023 | 2:04 AM

బిగ్‌బాస్‌ మండే ఎపిసోడ్స్‌లో ఉండే మజానే వేరు. ఎందుకంటే ఆరోజే నామినేషన్స్‌ ఉంటాయి. హౌజ్‌ లో కలివిడిగా ఉండే కంటెస్టెంట్ల అసలు రూపం ఇక్కడే బయటపడుతుంది. ఒకరిని ఒకరు తిట్టుకుంటారు. అలా ఐదో వారం నామినేషన్స్‌లో ఓ రేంజ్‌లో జరిగాయి. ముఖ్యంగా శివాజీ తోటి ఇంటి సభ్యులపై శివాలెత్తిపోయాడు. అబద్ధాలు ఆడుతూ, తప్పుడు మాటలతో తన హౌజ్‌మేట్ స్థానాన్ని తీసేసిన కంటెస్టెంట్లపై ఫైరయ్యాడు. ముఖ్యంగా సీరియల్‌ బ్యాచ్‌ లీడర్‌ అమర్‌దీప్‌కు ఓ రేంజ్‌లో ఇచ్చి పడేశాడు. డాక్టర్‌ బాబును గట్టిగనే వాయించాడు. మరి ఈ వారం నామినేషన్స్‌లో ఎంతమంది చేరారో, అందుకు కారణాలేంటో చూద్దాం రండి. ఈ వారం ప్రతి కంటెస్టెంట్ తాను నామినేట్ చేయాలనుకున్న ఇద్దరిని ఎంచుకుని సరైన కారణాలతో నామినేట్ చేయాలని ఆదేశించాడు బిగ్‌బాస్‌. ఇందుకు గానూ వారు నామినేట్ చేస్తున్న వాళ్ల మెడలో ఉన్న షీటుపై కత్తితో పొడవాల్సి ఉంటుందన్నాడు.అయితే టేస్టీ తేజ డైరెక్ట్‌గా నామినేట్ కావడంతో అతన్ని ఎవరూ నామినేట్ చేయాల్సిన అవసరం లేదంటూ బిగ్‌బాస్ సూచించాడు. ఈ వీక్‌ అందరికంటే ముందుగా శివాజీకి అవకాశం ఇచ్చాడు బిగ్‌బాస్‌ దీంతో అతను అమర్‌దీప్‌ను నామినేట్ చేస్తున్నట్లు తెలిపాడు. ఈ సందర్భంగా ‘జులాయి’ సినిమాలో బ్యాంక్ రాబరీ స్టోరీ చెబుతూ అమర్‌దీప్‌ను ఓ ఆటాడేసుకున్నాడు శివాజీ. ‘ ప్రతిసారి అన్నా నువ్వు చూడట్లేదు చూడట్లేదు అని అమర్ అంటున్నాడు.. తర్వాత ప్రతిసారి నా మీద నీకు నెగిటివ్ అభిప్రాయం ఉంది.. నిన్న నువ్వు చేయి ఎత్తినదానికి కూడా నీ దగ్గర సరైన రీజన్ లేదు.. నేను ఎక్కడా పక్షపాతంగా వ్యవహరించలేదు’ అంటూ క్లియర్‌గా చెప్పాడు. దీనికి రెస్పాండ్‌ అయిన అమర్‌.. ‘ యావర్, ప్రశాంత్‌కి ఎక్కువ ఎందుకిచ్చారన్నా.. అదే పక్షపాతం’ అని అన్నాడు. దీనికి రిప్లైగా ‘ వాళ్లకి అన్యాయం జరిగింది. అందుకే ఇచ్చాను’ అంటూ శివాజీ అనడంతో అమర్ దండం పెట్టి సైలెంట్‌ అయిపోయాడు. అమర్‌ తర్వాత తన రెండో నామినేషన్‌గా ప్రియాంకను ఎంచుకున్నాడు శివాజీ. ‘నువ్వు నా విషయంలో చెయ్యి గుడ్డిగా ఎత్తడం నాకు నచ్చలేదు’ అని ఆమె మెడలో ఉన్న షీటుపై కత్తితో పొడిచాడు.

ఇక ఆ తర్వాత వంతు ప్రియాంకకు వచ్చింది. ఆమె వెంటనే శివాజీని నామినేట్ చేసేసింది. అలాగే సెకండ్ నామినేషన్‌గా ప్రిన్స్‌ యావర్‌ను ఎంచుకుంది. అయితే నామినేషన్‌కు ప్రియాంక చెప్పిన కారణాలపై ఆమెతో వాదనకు దిగారు శివాజీ, ప్రిన్స్‌ యావర్‌. ఇక గౌతమ్ మొదట అమర్‌ని నామినేట్‌ చేశాడు. ‘నువ్వు ఓటమిని తీసుకోకపోవడం నాకు నచ్చలేదు’ అని దీనికి కారణం చెప్పాడు. ఆతర్వాత ‘స్మైలింగ్ ఛాలెంజ్ గేమ్‌లో తేజ నన్ను బెల్టుతో కొడుతుంటే మీరు ఒక్క మాట కూడా అనకపోవడంనాకు నచ్చలేదు’ అంటూ శివాజీని సెకండ్‌ నామినీగా ఎంచుకున్నాడు గౌతమ్‌. ఇక తర్వాత శుభశ్రీ.. అమర్‌, ప్రియాంకలను నామినేట్ చేసింది. ఇక చివరిగా ప్రిన్స్‌ యావర్.. అమర్‌దీప్‌ని తన మొదటి నామినీగా ఎంచుకున్నాడు. అలాగే రెండో నామినీగా సెలెక్ట్‌ చేశాడు.

ఇవి కూడా చదవండి

ఆ ముగ్గురు తప్ప అందరూ నామినేట్..

View this post on Instagram

A post shared by STAR MAA (@starmaa)

మొత్తానికి ఐదో వారం నామినేషన్స్‌లో ఏడుగురు నిలిచారు. టేస్టీ తేజా, ప్రియాంక జైన్‌, అమర్ దీప్, శివాజీ, గౌతమ్ కృష్ణ, శుభశ్రీ, ప్రిన్స్ యావర్ నామినేట్ అయిన వారిలో ఉన్నారు. పవర్ అస్త్ర పొందిన ముగ్గురు.. సందీప్, శోభా, ప్రశాంత్‌ కు నామినేషన్స్‌ నుంచి మినహాయింపు లభించింది.

బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో..

View this post on Instagram

A post shared by STAR MAA (@starmaa)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.