AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rathika, Bigg Boss 7: ‘షోలో చూసి నన్ను జడ్జ్‌ చేయకండి’.. ఎలిమినేషన్ తరువాత రతిక ఫస్ట్ రియాక్షన్

బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్‌ నుంచి హాట్ బ్యూటీ రతికా రోజ్‌ ఎలిమినేట్ అయిపోయింది. షో ప్రారంభం నుంచి టైటిల్‌ ఫేవరేట్‌గా భావించిన ఆమె అనూహ్యంగా హౌజ్ నుంచి బయటకు రావడం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. ఆదివారం (అక్టోబర్‌ 1) నాటి ఎపిసోడ్‌లో రతికను ఎలిమినేట్‌ చేస్తున్నట్లు హోస్ట్‌ నాగార్జున ప్రకటించడంతో కన్నీళ్లు పెట్టుకుంటూ హౌజ్‌ నుంచి బయటకు వచ్చిందీ అందాల తార. కాగా బిగ్‌బాస్‌ నుంచి ఎలిమినేట్‌ కావడంపై రతిక నుంచి ఫస్ట్‌ రియాక్షన్‌ వచ్చింది.

Rathika, Bigg Boss 7: 'షోలో చూసి నన్ను జడ్జ్‌ చేయకండి'.. ఎలిమినేషన్ తరువాత రతిక ఫస్ట్ రియాక్షన్
Bigg Boss 7 Telugu
Basha Shek
|

Updated on: Oct 03, 2023 | 6:00 AM

Share

బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్‌ నుంచి హాట్ బ్యూటీ రతికా రోజ్‌ ఎలిమినేట్ అయిపోయింది. షో ప్రారంభం నుంచి టైటిల్‌ ఫేవరేట్‌గా భావించిన ఆమె అనూహ్యంగా హౌజ్ నుంచి బయటకు రావడం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. ఆదివారం (అక్టోబర్‌ 1) నాటి ఎపిసోడ్‌లో రతికను ఎలిమినేట్‌ చేస్తున్నట్లు హోస్ట్‌ నాగార్జున ప్రకటించడంతో కన్నీళ్లు పెట్టుకుంటూ హౌజ్‌ నుంచి బయటకు వచ్చిందీ అందాల తార. కాగా బిగ్‌బాస్‌ నుంచి ఎలిమినేట్‌ కావడంపై రతిక నుంచి ఫస్ట్‌ రియాక్షన్‌ వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌ పెట్టిందామె. ‘ డోంట్ జడ్జ్‌ ఏ బుక్‌ బై ఇట్స్‌ కవర్‌’ అనే సామెతను గుర్తుచేసిన ఆమె షోలో తనను చూసి మీరు ఓ అంచనాకు రావొద్దు. బిగ్‌ బాస్‌ హౌజ్‌లో చూసిన దాని కంటే మీకు తెలియాల్సింది ఇంకా చాలా ఉంది’ అని రాసుకొచ్చింది. ఇదే సందర్భంగా తనకు సపోర్టుగా నిలిచిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది రతిక. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పోస్ట్‌ వైరలవుతోంది. ఈ పోస్ట్ బట్టి చూస్తే తన విషయంలో బిగ్‌బాస్ అన్యాయం చేసినట్లు రతిక ఫీలవుతుందని అర్థమవుతోంది. బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌లో మొత్తం 14 కంటెస్టెంట్లు అడుగుపెట్టింది. అయితే షో ప్రారంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది రతికా రోజ్‌. తన గ్లామర్‌ లుక్స్‌తో షోను రక్తికట్టించింది. బిగ్‌బాస్‌ హౌజ్‌కు కావాల్సిన కంటెంట్‌ను కూడా బాగానే అందించింది. దీంతో కచ్చితంగా టాప్‌-5లో ఉంటుందని చాలామంది భావించారు. నెట్టింట కూడా ఈ అందాల తారకు ఆదరణ బాగా పెరిగింది.

అయితే షో సాగే కొద్దీ పూర్తిగా మారిపోయింది రతిక. తన ఆటతీరుతో విరక్తి తెప్పించింది. ఆట ఆడే బదులు.. మనుషుల ఎమోషన్స్‌తో ఆడుకుంటుందన్న కామెంట్లు వినిపించాయి. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్, ప్రిన్స్‌ యావర్‌పై ప్రేమను ఒలకబోసి వారితోనే గొడవలకు దిగడం జనాలకు అసలు నచ్చలేదు. దీంతో వెన్నుపోటు పొడవడంతో కట్టప్పను మించి పోయిందన్నారు ఆడియెన్స్‌. వీరి విషయంలోనే కాదు చిన్న చిన్న విషయాలకు కంటెస్టెంట్స్‌తో గొడవలు పడుతూ వచ్చింది. దీంతో ఓటింగ్‌ శాతమూ తగ్గిపోయింది. ఇదే సమయంలో నాలుగో పవరాస్త్ర కోసం పెట్టిన టాస్కుల్లోనూ రతిక పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో నాలుగో వారమే ఎలిమినేట్‌ అయ్యి హౌజ్‌ నుంచి బయటకు వచ్చేసింది.

ఇవి కూడా చదవండి

రతికా రోజ్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!