Bigg Boss Telugu 9: ఆరో వారం నామినేషన్స్‌లో ఉన్నది వీరే.. డేంజర్ జోన్‌లో టాప్ కంటెస్టంట్స్.. ఎలిమినేట్ తనేనా?
పాత కంటెస్టెంట్స్, కొత్త ఇంటి సభ్యులతో బిగ్ బాస్ కళకళలాడుతోంది. పేరుకు తగ్గట్టుగానే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ కొంచెం వైల్డ్ గానే ప్రవర్తిస్తున్నారు. పాత కంటెస్టెంట్లను టార్గెట్ చేస్తూ గేమ్ ఆడుతున్నారు. అలా ఆరో వారం ఎలిమినేషన్స్ కు సంబంధించి మొత్తం ఆరుగురు నామినేషన్స్ లో నిలిచారు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఆదివారం డబుల్ ఎలిమినేషన్ జరిగింది. ఫ్లోరాశైనీ, దమ్ము శ్రీజ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయారు. అలాగే ఆరుగురు కొత్త కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ తో హౌస్ లోకి అడుగు పెట్టారు. అలేఖ్య చిట్టి పికిల్స్ ఫేమ్ రమ్య మోక్ష, టాలీవుడ్ యంగ్ హీరో శ్రీనివాస్ సాయి, దువ్వాడ (దివ్వల)మాధురి, సీరియల్ నటుడు నిఖిల్ నాయర్, సీరియల్ నటి ఆయేషా జీనథ్, సీరియల్ నటుడు గౌరవ్ గుప్తా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక కొత్త కంటెస్టెంట్స్ రాకతో బిగ్ బాస్ హౌస్ నిజంగానే రణరంగంగా మారింది. నామినేషన్స్ హోరా హోరీగా జరిగాయి. కాగా ఈ వారం నామినేషన్స్ కు సంబంధించి వైల్డ్‌కార్డ్స్ ను మినహాయించాడు బిగ్‌బాస్. అయితే నామినేషన్ చేసే అధికారం ఎవరికి ఇవ్వాలి.. నామినేట్ చేసిన వాళ్ల నుంచి ఎవరిని సెలక్ట్ చేయాలి అనే పవర్స్ మాత్రం వైల్డ్‌కార్డ్స్ కే అప్పగించారు. ఇందుకోసం ‘బాల్ ఆఫ్ ఫైర్’ అంటూ ఒక టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో భాగంగా ఎవరు బాల్ పట్టుకుంటే వారు.. తమకి నచ్చిన హౌస్‌మేట్‌కి నామినేషన్ చేసే అవకాశం ఇవ్వొచ్చు. అప్పుడు ఆ ఇంటి సభ్యుడు ఇద్దరు వ్యక్తులన్ని నామినేట్ చేయాలి. కానీ ఇందులోనుంచి ఒకరిని తప్పించి ఒకరిని మాత్రమే నామినేషన్‌లో ఉంచే అధికారం ఆ బాల్ అందించిన వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్ చేతిలో ఉంటుంది.
ఈ క్రమంలో ‘బాల్ ఆఫ్ ఫైర్’ ప్రక్రియ ముగిసేసరికి మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో నిలిచారు. సుమన్ శెట్టి, భరణి, తనూజ, డీమాన్, దివ్య నికితా నామినేషన్‌ల్స్ లో నిలిచారు. అయితే కెప్టెన్ కల్యాణ్ కు బిగ్‌బాస్ ఒక పవర్ ఇచ్చాడు. పాత హౌస్‌మేట్స్ నుంచి నామినేషన్‌లో లేని ఒక్కరిని నేరుగా నామినేట్ చేయాలని ఆదేశించాడు. దీంతో కల్యాణ్.. రాము రాథోడ్ ను డైరెక్ట్ గా నామినేట్ చేశాడు. అలా ఈ వారం నామినేషన్స్‌లో మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు.
ఈ వారం కంటెస్టెంట్లలో సుమన్ శెట్టి, దివ్య నికితా కాస్త డేంజర్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే భరణి, తనూజ, రాము, డీమాన్ లకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. టాస్కులు కూడా బాగా ఆడుతున్నారు . ముఖ్యంగా గేమ్స్ బాగా ఆడుతున్నప్పటికీ దివ్య ఓటింగ్ లో పెద్దగా ప్రభావం చూపలేకపోతోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








