Bigg Boss 9 Telugu : అప్పుడే మొదలైందిరోయ్.. ఆ ఇద్దరు కామనర్స్ మధ్య గొడవ.. వెళ్లిపోతానంటూ ఫైర్..
సెలబ్రెటీలు వర్సెస్ కామనర్స్ మధ్య ఇక రణరంగం ఉంటుందని ముందే చెప్పేశారు నాగార్జున. మొదటి రోజే ఇద్దరు వేరు వేరుగా ఉండాలని వారికి సెపరేట్ హౌస్ లు సైతం కేటాయించారు. తాజాగా ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేశారు. మొదటి రోజే ఇద్దరు కామనర్స్ మధ్య గొడవ మొదలైంది. ఇంతకీ ఏ ఇద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయ్యిందో తెలుసా..

బిగ్‌బాస్ సీజన్ 9 ఫస్ట్ డే ప్రోమో రిలీజ్ అయింది. సెప్టెంబర్ 7న గ్రాండ్ గా మొదలైన ఈ షోలోకి మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. అందులో కామనర్స్ ఆరుగురు, సెలబ్రెటీలు 9 మంది ఉన్నారు. కామనర్స్ వర్సెస్ సెలబ్రెటీల మధ్య రణరంగమే అంటూ ముందే చెప్పేశారు నాగ్. అలాగే రెండు హౌస్ లు ఉంటాయని.. ఇద్దరు వేరుగా ఉంటారని చెప్పారు. తాజాగా ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేశారు. మొదటి రోజే సాఫిగా ఉంటుందనుకున్న ప్రోమో.. గొడవలతోనే మొదలైంది. ఉదయాన్నే సాంగ్ రావడంతో అందరూ ఎవరి టాలెంట్ వాళ్లు చూపిస్తూ స్టెప్పులు వేశారు. నా జీవితంలో మొదటిసారి పడుకున్నప్పుడు చెమటలు పట్టాయ్ బిగ్ బాస్ అంటూ పంచులు వేశారు ఇమ్మాన్యుయేల్.
ఇవి కూడా చదవండి : Actress: తస్సాదియ్యా.. క్రేజీ ఫోటోలతో గత్తరలేపుతున్న యాంకరమ్మ.. ఈ ముద్దుగుమ్మను గుర్తుపట్టరా.. ?
ఇక ఆ తర్వాత అసలు పని స్టార్ట్ చేశాడు బిగ్‌బాస్ . ఇంటి సభ్యులు ఎవరు ఏయే పనులు చేయాలన్నదానిపై డిస్కషన్ నడించింది. ఒకరికొకరు బ్యాడ్జులు కట్టుకుని పనులను కేటాయించుకున్నారు. అయితే అందరూ కలిసి తిన్న గిన్నెల్ని రీతూ చౌదరి క్లీన్ చేస్తుందని బ్యాడ్జ్ ఇచ్చాడు పవన్. అక్కడి వరకు బాగానే ఉంది.. అప్పుడే మొదలైంది అసలు గొడవ. హౌస్ క్లీనింగ్ అంటే స్టౌవ్ కూడానా అని అడిగింది రీతూ చౌదరి.
ఇవి కూడా చదవండి : Serial Actres: 16 ఏళ్లకే ఆడిషన్.. ఆపై బీ గ్రేడ్ సినిమాలు.. ఈ సీరియల్ హీరోయిన్ కష్టాలు చూస్తే..
హౌస్ క్లీనింగ్ అంటే అన్నీ వస్తాయి. కిచెన్ టేబుల్ కూడా హౌస్ క్లీనింగ్ లో భాగమే కదా అని అడిగాడు హరీష్. అన్నీ మేం క్లీనింగ్ చేస్తే నెక్ట్స్ వచ్చే వాళ్లు కూడా అలాగే చేయలి అన్నాడు. కుక్ చేసేవాళ్లు క్లీనింగ్ చేయరు.. కుక్ ఒక్కరే చేస్తారు అని చెప్పింది ప్రియ. దీంతో ఖాళీగా ఉన్న సంజనా క్లీనింగ్ చేస్తే బాగుంటుందని అన్నాడు హరీష్. అయితే మధ్యలో మనీష్ కల్పించుకుని అది కరెక్ట్ కాదని అన్నాడు. దీంతో హరీష్ సీరియస్ అయ్యాడు. మనీష్ నీకు బ్యాడ్జ్ రాలేదు కదా.. మీరు మాట్లాడొద్దు అని అనడంతో ఎందుకు మాట్లాడొద్దు అంటూ మనీష్ సీరియస్ అయ్యారు. ఇద్దరి మధ్య గొడవ పెరగడంతో భరణి కూల్ చేయడానికి ట్రై చేశాడు. కానీ హరీష్ సీరియస్ అవుతూ.. ఏదైనా అయితే నేను చూసుకుంటా.. వెళ్లిపోవడానికైనా నేను రెడీ అని అన్నాడు. మొత్తానికి మొదటిరోజే హౌస్మేట్స్ మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి.
ఇవి కూడా చదవండి : Tollywood : ఒకరు తోపు డైరెక్టర్.. ఇంకొకరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్.. ఈ ఇద్దరి టాలెంట్‌కు ప్రపంచమే జై కొట్టింది..
ఇవి కూడా చదవండి : Cinema: ఇది సక్సెస్ అంటే.. రూ.4 కోట్లు పెడితే.. రూ.121 కోట్ల కలెక్షన్స్.. థియేటర్లను శాసించిన సినిమా..








