AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మల్లెపూలు తీసుకెళ్లినందుకు.. ప్రముఖ నటికి రూ.1.14 లక్షల జరిమానా!

ప్రముఖ మలయాళీ నటి నవ్యా నాయర్‌కి ఎయిర్‌పోర్టులో షాకింగ్‌ అనుభవం ఎదురైంది. ఓ ఈవెంట్‌ కోసం ఆస్ట్రేలియాకు వెళ్లిన ఆమెకు అక్కడి అధికారులు ఊహించిన షాకిచ్చారు. ఆమె హ్యాండ్‌ బ్యాగ్‌లో మల్లెపూలు తీసుకెళ్లినందుకు ఏకంగా లక్షల్లో జరిమానా విధించారు. దక్షిణాదిలో కేరళ రాష్ట్రంలోని మలయాళీలకు ఓనం పండగ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ పండగ సీజనల్లో అక్కడి మహిళలు ఓనం ఆడటం సంప్రదాయంగా వస్తుంది. అయితే ఓనం సందర్భంగా నటి నవ్య నాయర్‌ ఖరీదైన పాఠం నేర్చుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే..

మల్లెపూలు తీసుకెళ్లినందుకు.. ప్రముఖ నటికి రూ.1.14 లక్షల జరిమానా!
Actress Navya Nair
Srilakshmi C
|

Updated on: Sep 08, 2025 | 12:18 PM

Share

ఆస్ట్రేలియాలోని మలయాళీ అసోసియేషన్ ఆఫ్ విక్టోరియా ఓనం వేడుకలను నిర్వహించింది. ఈ వేడకల్లో పాల్గొనేందుకు తాజాగా నటి నవ్య నాయర్‌ ఆస్ట్రేలియా వెళ్లారు. మెల్‌బోర్న్ ఎయిర్‌పోర్టులో దిగిన సమయంలో ఆమె బ్యాగ్‌లో 15 సెంటీ మీటర్ల మల్లెపూల మాల ఒకటి కనిపించింది. దీంతో మెల్‌బోర్న్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ అధికారులు ఆమెను ఆపి, మల్లెపూలు తీసుకెళ్లినందుకు ఏకంగా రూ.1.14 లక్షల ఫైన్‌ విధించారు. దీని గురించి ఆమె మాట్లాడుతూ..

‘నేను ఆస్ట్రేలియాకు రాకముందు నా కోసం మా నాన్న మల్లెపూలు తీసుకువచ్చాడు. వాటిని రెండు భాగాలుగా చేసి.. ఒక భాగం కొచ్చి నుండి సింగపూర్‌కు వెళ్లేటప్పుడు నా తలలో పెట్టుకున్నాను. ఎందుకంటే నేను అక్కడికి చేరుకునే సమయానికి మల్లెల్లు వాడిపోతాయి. సింగపూర్‌ నుంచి తదుపరి ప్రయాణంలో మిగిలిన పూలు పెట్టుకోవచ్చని.. వాటిని హ్యాండ్‌ బ్యాగ్‌లో ఉంచుకున్నాను. అయితే నేను చేసింది చట్ట విరుద్ధం. ఇది నేను తెలియకుండా చేసిన తప్పు. అజ్ఞానం క్షమించబడదు. 15 సెంమీ మల్లె మాలను తెచ్చినందుకు, ఎయిర్‌పోర్ట్‌ అధికారులు రూ.1.14 లక్షలు జరిమానా చెల్లించమని అడిగారు. అయితే అది ఉద్దేశపూర్వకంగా చేయలేదు. ఈ జరిమానాను 28 రోజుల్లోపు చెల్లించాలని వారు నాకు చెప్పారు’ అని నటి నవ్వ అక్కడ జరిగిన బహిరంగ కార్యక్రమంలో వెల్లడించారు. ఈ వ్యవహారం ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Navya Nair (@navyanair143)

మెల్‌బోర్న్‌కు ప్రయాణానికి ముందు నవ్య నాయర్ ఎయిర్‌పోర్టులో కూర్చుని అదే లుక్‌లో ఉన్న ఫోటోలను, వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్ చేశారు. జరిమానా చెల్లించే ముందు షో-ఆఫ్ అని నటి నవ్య వ్యంగ్యంగా వీడియోకి క్యాప్షన్‌ ఇచ్చారు. కాగా నవ్యనాయర్‌ ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును రెండుసార్లు అందుకున్నారు. నవ్య నాయర్ సిబి మలైల్స్‌ ఇష్టం (2001) మువీతో సినీ రంగంలోకి అరంగెట్రం చేశారు. ఆ తర్వాత ఆమె నందనం, మజతుల్లికిలుక్కం, కుంజికూనన్, కళ్యాణరామన్, వెళ్లితీర, అమ్మకిలిక్కూడు, గ్రామఫోన్, పట్టనతిల్ సుందరన్, జలోత్సవం, చతికథా చంతు, అళగీయ తీయే, పందిప్పాడ, సైరా, కన్నెల మదంగుళాలు, సైరా, కన్నెల మదంగుళాలు వంటి మువీల్లో వరుస హిట్లు అందుకున్నారు. దృశ్య, దృశ్య 2, ఒరుతీ, జానకి జానే వంటి మలయాళం, తమిళం, కన్నడ భాషల్లోనూ నటించారు.

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.