- Telugu News Photo Gallery Cinema photos Can You Guess This Actress In This Photo, She Is Heroine Mrunal Thakur
Tollywood : డీగ్లామర్ లుక్లో షాకిచ్చిన హీరోయిన్.. ఒక్కో సినిమాకు దిమ్మతిరిగే రెమ్యునరేషన్.. ఎవరంటే..
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ హీరోయిన్ త్రోబ్యాక్ ఫోటో తెగ వైరలవుతుంది. ఇప్పుడు ఆమె టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. తెలుగు, హిందీ భాషలలో పలు చిత్రాలతో ఫేమస్ అయిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు ఒక్కో మూవీకి దిమ్మతిరిగే రెమ్యునరేషన్ తీసుకుంటుంది. ఇంతకీ ఆమె ఎవరంటే.. ప్రస్తుతం ఆమె పాన్ ఇండియా హీరోయిన్.
Updated on: Sep 08, 2025 | 9:32 AM

పైన ఫోటోలో డీగ్లామర్ లుక్ లో.. అమాయకంగా చూస్తున్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా..? ఆమె తెలుగులో క్రేజీ హీరోయిన్. నార్త్ టూ సౌత్ అత్యధిక ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోయిన్. ఈమధ్యకాలంలో ఎక్కువగా వివాదాలతోనే ఫేమస్ అవుతుంది. ఇంతకీ ఆమె ఎవరంటే..

ఆ బ్యూటీ మృణాల్ ఠాకూర్. సీతారామం సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది. మొదటి సినిమాతోనే ఊహించని మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇందులో సీతామహలక్ష్మి పాత్రలో అద్భుతమైన నటనతో జనాలను కట్టిపడేసింది.

ఆ తర్వాత హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇప్పుడు ఈ అమ్మడు బాలీవుడ్ సినిమాలపై ఫోకస్ పెట్టింది. అలాగే తెలుగులోనూ ఒక సినిమా చేస్తుంది. అదే డెకాయిట్. ఇందులో అడివి శేష్ హీరోగా నటిస్తున్నారు.

ఈ సినిమాకు ఆమె రూ.2.5 కోట్లు పారితోషికం తీసుకుంటుందని సమాచారం. అలాగే ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్లలో ఆమె ఒకరు. బుల్లితెర నుంచి సిల్వర్ స్క్రీన్ వరకు ఆమె ప్రయాణం ఎంతోమందికి స్పూర్తి.

సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి విపరీతమైన క్రేజ్ ఉంది. అటు చీరకట్టులో.. ఇటు గ్లామర్ లుక్కులో మెస్మరైజ్ చేస్తుంది మృణాల్. ఇటీవల ఆమెకు సంబంధించిన ఓ త్రోబ్యాక్ వీడియో నెట్టింట వైరలవడంతో మృణాల్ తీరుపై నెటిజన్స్ మండిపడ్డారు.




