- Telugu News Photo Gallery Not only the hero and heroine, there is also a war between music directors
హీరో హీరోయిన్సే కాదు, వారి మధ్య కూడా వార్ మాములుగా ఉండదంట!
పోటీ అంటే ఎప్పుడూ హీరోలు, హీరోయిన్ల మధ్యే కాదు.. సంగీత దర్శకుల మధ్య కూడా ఉంటుంది. చూడ్డానికి సాఫ్ట్‌గా ఉంటారు కానీ ఈ స్వర మాంత్రికుల మధ్య కూడా వార్ మామూలుగా ఉండదు. ఇప్పుడు ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ మధ్య పోటీ అలాగే ఉంది. ఈ ముగ్గురిలో ఇద్దరు టాప్ లేపేసారు.. ఇప్పుడు మూడో వాడి వంతు. ఇంతకీ ఎవరా సంగీత త్రయం..?
Updated on: Sep 07, 2025 | 8:52 PM

పోటీ అంటే ఎప్పుడూ హీరోలు, హీరోయిన్ల మధ్యే కాదు.. సంగీత దర్శకుల మధ్య కూడా ఉంటుంది. చూడ్డానికి సాఫ్ట్‌గా ఉంటారు కానీ ఈ స్వర మాంత్రికుల మధ్య కూడా వార్ మామూలుగా ఉండదు. ఇప్పుడు ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ మధ్య పోటీ అలాగే ఉంది. ఈ ముగ్గురిలో ఇద్దరు టాప్ లేపేసారు.. ఇప్పుడు మూడో వాడి వంతు. ఇంతకీ ఎవరా సంగీత త్రయం..?

టాలీవుడ్‌లో మ్యూజిక్ డైరెక్టర్ అనే పేరు వినగానే అయితే తమన్.. లేదంటే దేవీ శ్రీ ప్రసాద్ గుర్తుకొస్తారు. ఈ ఇద్దరి మధ్యే కొన్నేళ్లుగా పోటీ నడుస్తుంది. మధ్య మధ్యలో చాలా మంది వస్తుంటారు పోతుంటారు కానీ స్టాండర్డ్‌గా ఈ ఇద్దరి మధ్యే ఉంటుంది. తాజాగా వీళ్ళకు అనిరుధ్ తోడయ్యారు. దేవరతో ఈయన రేంజ్ పెరిగింది.. కింగ్డమ్, కూలీ మ్యూజిక్ కూడా బాగానే హిట్టైంది.

గతేడాది వరకు సైలెంట్‌గా ఉన్న దేవీ.. పుష్ప 2, తండేల్, కుబేరా లాంటి సినిమాలతో తనేంటో ప్రూవ్ చేసుకున్నారు.. అలాగే అనిరుధ్ నాన్ స్టాప్ చార్ట్ బస్టర్స్ ఇస్తున్నారు. ప్రస్తుతం నాని ప్యారడైజ్‌తో పాటు దేవర 2, టాక్సిక్ లాంటి సినిమాలు అనిరుధ్ చేతిలో ఉన్నాయి. ఈ ఇద్దరితో పోలిస్తే తమన్ కాస్త స్లో అయ్యారు.. కానీ ఈయన చేతిలో ఉన్న ఆయుధం ఓజి.

ఓజి టైటిల్ సాంగ్ అదిరిపోయింది.. ఇక టీజర్‌కు తమన్ ఇచ్చిన హంగ్రీ చీతా ట్యూన్ రెండేళ్లైనా పవర్ తగ్గలేదు.. లేటెస్ట్ టీజర్‌కు బీట్ అదిరిపోయింది. తమన్ చేతిలో ఓజి మాత్రమే కాదు.. అఖండ 2 కూడా ఉంది. ఈ రెండు సినిమాలతో తమన్ మళ్లీ రేసులోకి రానున్నారు. ఇక దేవీ చేతిలో ఉస్తాద్ భగత్ సింగ్, RC17 సినిమాలున్నాయి. మొత్తానికి ఈ స్వర త్రయం సంగీత సామ్రాజ్యాన్ని ఏలేస్తున్నారిప్పుడు.