- Telugu News Photo Gallery Dammu Sreeja to enter Bigg Boss house leaving behind a monthly salary of one lakh
నెలకు లక్షజీతం వదిలి బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ .. ఈ చిన్నదాని గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
తెలుగు ప్రేక్షకులందరూ ఎదురు చూస్తున్న తెలుగు బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 9 (నేడు) స్టెప్టెంబర్ 7న గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఇప్పుడు అందరి ఫోకస్ సీజన్ 9 పైనే ఉంది. ఈ సీజన్‌లో సెలబ్రిటీస్, సామాన్యుల ఆటతీరు ఎలా ఉంబోతుంది. అసలు సామాన్యుల్లో ఎవరు బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Updated on: Sep 07, 2025 | 8:18 PM

బిగ్ బాస్ సీజన్9 పై చాలా మందికి ఆసక్తి కలగడానికి ముఖ్య కారణం ఒకటి కామన్ పీపుల్, అలాగే అగ్నీ పరీక్ష. ఇప్పటికే బిగ్ బాస్ సామాన్యుల కోటాలో చాలా అప్లికేషన్స్ వచ్చాయి. అందులో జడ్జీలుగా ఉన్న నవదీప్,బిందు మాధవి, అభిజిత్ 13 మందిని మాత్రమే సెలక్ట్ చేయడం జరిగింది.

తర్వాత వారి ఆటతీరు, వారి బలం, బలహీనతలు, వారు హౌజ్‌లో కంటీన్యూ అవుతారా? లేరా ఇలా అన్ని విధాలుగా పరీక్షించి, చివరకు 13 మంది సామాన్యుల నుంచి ఐదుగురిని మాత్రమే సెలక్ట్ చేసి బిగ్ బాస్ హౌస్ లోకి పంపించినట్లు సమాచారం.

అయితే ఆ ఐదుగురులో ఉన్న ఒక అమ్మాయి, ఏకంగా లక్ష రూపాయల జీతాన్ని వదిలేసుకొని బిగ్ బాస్ హౌస్‌లోకి ఎట్రీ ఇవ్వబోతున్నదంట. ఇంతకీ ఆ చిన్నది ఎవరంటే? దమ్ము శ్రీజ. ఈ బ్యూటీ గురించి చెప్పాల్సిన పని లేదు. అగ్నీ పరీక్ష షోలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడే అతిగా మాట్లాడేసింది. దీంతో శ్రీజను చూసి ప్రేక్షకులు, జడ్జీలు కూడా చాలా షాక్ అయ్యారు. ఈమె బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లితే ప్రతి ఒక్క రికీ అగ్ని పరీక్షే అనుకున్నారు.

దీంతో బిందు మాధవి , అభిజిత్ ఇద్దరూ కూడా రెడ్ కార్డ్ ఇచ్చారు. కానీ నవదీప్ మాత్రమే, ఏంటో చూద్దా ఈమె సంగతీ అంటూ గ్రీన్ కార్డ్ ఇచ్చారు. దీంతో ఆ ఒక్క అవకాశాన్ని ఉయోగించుకొని, అగ్ని పరీక్షలోని ప్రతి టాస్క్ లో సూర్‌గా ఆడి మంచి పేరు తెచ్చుకుంది. దీంతో జడ్జీల మనసు, ఆడియన్స్ మనసు దోచేసుకొని, బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నది.

ఈ క్రమంలోనే ఈ బ్యూటీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ గా మారిది. దమ్ము శ్రీజ ప్రముఖ MNC కంపెనీ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పని చేస్తూ నెలకు రూ. అక్షరాల లక్షరూపాయలు సంపాదిస్తుందంట. బిగ్ బాస్ పై ఉన్న ఇట్రెస్ట్ తో లక్ష జీతం ఉన్న ఉద్యోగానికి రాజీనామ చేసి తన లక్కు పరీక్షించుకొని హౌస్‌లోకి అడుగు పెట్టబోతుంది.



