- Telugu News Photo Gallery Sleep Deprivation and Deficiency: Side Effects of Sleep Deprivation on Your Body and mind
Sleep Deprivation: మీకూ నిద్ర కరువైందా? అయితే త్వరలోనే క్యాన్సర్, హార్ట్ ఎటాక్, స్ట్రోక్ ఇంకా..
సరైన నిద్ర లేకపోతే వివిధ ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ నిద్రలేమి మానసిక చికాకును కలిగించడమే కాకుండా గుండె, కడుపు సంబంధిత సమస్యలను కూడా కలిగిస్తుంది. అంతేకాదు నిద్ర లేమి ఆరోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తుందని అనేక అధ్యయనాలు సైతం నిరూపించాయి. ఇది కొన్ని లక్షణాల ద్వారా..
Updated on: Sep 08, 2025 | 7:30 AM

ఆరోగ్యంగా ఉండటానికి ఆరోగ్యకరమైన ఆహారం ఎంత ముఖ్యమో, నిద్ర కూడా అంతే ముఖ్యం. సరైన నిద్ర లేకపోతే వివిధ ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ నిద్రలేమి మానసిక చికాకును కలిగించడమే కాకుండా గుండె, కడుపు సంబంధిత సమస్యలను కూడా కలిగిస్తుంది. అంతేకాదు నిద్ర లేమి ఆరోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తుందని అనేక అధ్యయనాలు సైతం నిరూపించాయి. ఇది కొన్ని లక్షణాల ద్వారా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ మనం వాటిని సకాలంలో గుర్తించకపోతే వేలకట్టలేని మూల్యం చెల్లించవల్సి వస్తుంది.

ముఖ్యంగా రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రపోని వ్యక్తులు క్యాన్సర్, స్ట్రోక్, గుండె జబ్బులు, మధుమేహం వంటి తీవ్రమైన వ్యాధుల బారిన పడే ప్రమాదం గణనీయంగా ఎక్కువగా ఉంటుందని అనేక అధ్యయనాలు చూపిస్తున్నాయి. ఒక అధ్యయనం ప్రకారం.. తగినంత నిద్ర లేకపోవడం మెదడును తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఇది వివిధ వ్యాధులకు దారితీస్తుంది.

నిద్ర లేకపోవడం జీర్ణవ్యవస్థను కూడా ప్రభావితం చేస్తుంది. నిద్రలేమితో బాధపడేవారు తరచుగా మలబద్ధకాన్ని ఎదుర్కొంటారు. దీనికి సకాలంలో చికిత్స చేయకపోతే, ఇది పేగు అవరోధం వంటి తీవ్రమైన పరిస్థితికి దారితీస్తుంది.

శరీరానికి అవసరమైన నిద్ర లేకపోవడం మెదడు కణాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. క్రమంగా జ్ఞాపకశక్తి బలహీనపడటం ప్రారంభమవుతుంది. ఆలోచించే, అర్థం చేసుకునే సామర్థ్యం కూడా క్షీణించడం ప్రారంభమవుతుంది. మానసిక ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది.

దీనితో పాటు నిద్ర లేకపోవడం కూడా కళ్ళపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ స్థాయి శరీరంలో విపరీతంగా పెంచుతుంది. చర్మం సున్నితంగా ఉండే ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఫలితంగా కళ్ళ కింద నల్లటి వలయాలు, మచ్చలు ఏర్పడతాయి.




