Bigg Boss 8 Telugu: నా భార్య నన్ను యాక్సెప్ట్ చేయదు.. అలాంటి పర్సనాలిటీ నాది.. మళ్లీ ఏడుపు స్టార్ట్ చేసిన మణికంఠ..

ఈ షో నుంచి బయటకు వెళ్లాక వైఫ్ యాక్సెప్ట్ చేయదు.. నా మిస్టే్క్ కదా నెగిటివ్ గా ఆలోచించే పర్సనాలిటీ నాది.. అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. లేదు తను అర్థం చేసుకుంటుందిలే అంటూ కాసేపు సర్ది చెప్పింది విష్ణుప్రియ. కానీ తన వల్ల వాళ్ల లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది కదా అంటూ మళ్లీ బోరున ఏడ్చేశాడు మణికంఠ. మొత్తానికి నిన్నటి ఎపిసోడ్ మొత్తం అడియన్స్ కు నస పెట్టినట్లే సాగింది.

Bigg Boss 8 Telugu: నా భార్య నన్ను యాక్సెప్ట్ చేయదు.. అలాంటి పర్సనాలిటీ నాది.. మళ్లీ ఏడుపు స్టార్ట్ చేసిన మణికంఠ..
Bigg Boss 8 Telugu
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 06, 2024 | 11:46 AM

బిగ్‏బాస్ సీజన్ 8 గత రెండు రోజులుగా కన్నీళ్లతోనే సాగుతుంది. గతం గురించి చెబుతూ అందరిని ఏడిపించేస్తున్నాడు నాగ మణికంఠ. ప్రతిసారి ఎమోషనల్ అయిపోతూ సింపథీ స్టార్ అనే ట్యాగ్ తెచ్చుకున్నాడు మణికంఠ. ఇక నిన్నటి ఎపిసోడ్‏లోనూ మరోసారి ఏడ్చేశాడు. అయితే కంటెస్టెంట్స్ ఎంతగా ధైర్యం చెబుతూ.. స్నేహం చేయాలని చూస్తున్నా మణికంఠ మాత్రం తన తీరు మార్చుకోవడం లేదు. నిన్నటి ఎపిసోడ్ లో మణికంఠను ఓదార్చే ప్రయత్నం చేసింది విష్ణు ప్రియ. దీంతో మరోసారి తన భార్య గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు మణికంఠ. ఈ షో నుంచి బయటకు వెళ్లాక వైఫ్ యాక్సెప్ట్ చేయదు.. నా మిస్టే్క్ కదా నెగిటివ్ గా ఆలోచించే పర్సనాలిటీ నాది.. అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. లేదు తను అర్థం చేసుకుంటుందిలే అంటూ కాసేపు సర్ది చెప్పింది విష్ణుప్రియ. కానీ తన వల్ల వాళ్ల లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది కదా అంటూ మళ్లీ బోరున ఏడ్చేశాడు మణికంఠ. మొత్తానికి నిన్నటి ఎపిసోడ్ మొత్తం అడియన్స్ కు నస పెట్టినట్లే సాగింది.

ఇక ఆ తర్వాత మనుషులతో మాట్లాడం స్టార్ట్ చేశాడు మణికంఠ. నువ్వు ఇప్పటికే స్పేస్ తీసుకోవడం అందరూ చూసేశారు. ఇక అందరితో కలవడం చూస్తే బాగుంటుంది అంటూ సలహా ఇచ్చింది ప్రేరణ. కాసేపటికి ఆదిత్య కూడా మణికంఠ దగ్గరికొచ్చి మాట్లాడాడు. నీ లోపల నీపై లవ్, కేరింగ్ తప్ప ఇంకేం లేదు.. హార్ట్ ఫెల్ట్ గా నీకు కనెక్ట్ అయ్యాను.. జనాలు నిన్ను కాపాడతారు అంటూ ధైర్యం చెప్పాడు ఆదిత్య. దీంతో మళ్లీ ఏడుపు మొదలెట్టాడు మణికంఠ. నేను ఈరోజు నుంచి ఏడవను అంటూనే మళ్లీ మళ్లీ కెమెరా ముందు ఏడ్చేశాడు.

అయితే మణి విషయంలో ఏడ్చేశాడు నిఖిల్. చీఫ్స్ తన సైన్యం కోసం ఎంపిక చేసుకోవాలంటూ గేమ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే విష్ణుప్రియను సెలక్ట్ చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో చివరకు నైనిక తన టీంలోకి తీసుకుంది. అయితే తనను అందరూ వీక్ అనుకున్నారంటూ నిఖిల్ దగ్గర చెప్పుకుంది విష్ణుప్రియ. దీంతో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు నిఖిల్. మణికంఠ కోసం తను ముందుకు రాకపోతే వేరెవాళ్లు ఎవరూ అతడిని సెలక్ట్ చేయరంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.