Brahmamudi, September 6th Episode: రాహుల్ ప్లాన్‌లో ఇరుక్కున్న కావ్య.. ఇంట్లోంచి బయటకు కళావతి..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కళ్యాణ్‌ని కవితలు రాసుకోమని చెబుతుంది అప్పూ. ఆ తర్వాత అప్పూ చేత కేక్ కట్ చేయిస్తుంది. ఆ తర్వాత దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం హాలులో ఉంటుంది. అప్పుడే ధాన్య లక్ష్మి పై నుంచి దిగుతుంది. అప్పుడే కావ్య కాఫీ తీసుకురానా? అని అడుగుతుంది. వద్దు ఓ కెమెరా తీసుకురా.. అందరూ ఎంత ఆనందంగా ఉన్నారో ఫోటో తీయడానికి. నా కొడుకు బయటకు వెళ్లడానికి వాడి విషయాలు అన్నీ మర్చిపోయారు కదా..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కళ్యాణ్‌ని కవితలు రాసుకోమని చెబుతుంది అప్పూ. ఆ తర్వాత అప్పూ చేత కేక్ కట్ చేయిస్తుంది. ఆ తర్వాత దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం హాలులో ఉంటుంది. అప్పుడే ధాన్య లక్ష్మి పై నుంచి దిగుతుంది. అప్పుడే కావ్య కాఫీ తీసుకురానా? అని అడుగుతుంది. వద్దు ఓ కెమెరా తీసుకురా.. అందరూ ఎంత ఆనందంగా ఉన్నారో ఫోటో తీయడానికి. నా కొడుకు బయటకు వెళ్లడానికి వాడి విషయాలు అన్నీ మర్చిపోయారు కదా అని ధాన్య లక్ష్మి అంటుంది. ఏంటి ఆ వంకర విషయం ఏంటో చెప్పు అని ఇందిరా దేవి అడిగితే.. ఈ రోజు కళ్యాణ్ బర్త్ డే అని ధాన్య లక్ష్మి అంటుంది. అది విని అందరూ నవ్వుతారు. అప్పుడే ధాన్య లక్ష్మికి ఓ కథ చెబుతుంది ఇందిరా దేవి. కళ్యాణ్ పుట్టిన రోజుకు రాజ్ అన్ని ఏర్పాట్లు చేశాడని అపర్ణ అంటుంది. వాడి పేరు మీద గుడిలో పూజ చేయించి, అభిషేకం కూడా ఏర్పాటు చేశామని రాజ్ అంటాడు.
అపర్ణను చంపేందుకు రాహుల్ స్కెచ్..
అందరం కలిసి గుడికి వెళ్దాం. ధాన్యలక్ష్మి చేతుల మీదుగా అన్నదానం చేద్దామని ఇందిరా దేవి అంటుంది. మీరందరూ వెళ్లండి.. నేను రాను. నాకు ఆరోగ్యం బాలేదని అపర్ణ అంటే.. అయితే నేను ఉంటానని సుభాష్ అంటాడు. అవసరం లేదని అపర్ణ అంటుంది. ఇక అప్పుడే కావ్య నేను తోడుగా ఉంటానని కావ్య అంటుంది. చాలా జాగ్రత్తగా చూసుకోమని రాజ్ అంటాడు. సరే అని కావ్య అంటుంది. మరోవైపు రుద్రాణిని గదిలోకి లాక్కొస్తాడు రాహుల్. ఏంట్రా ఇలా లాక్కొస్తున్నావ్ అని రుద్రాణి అంటే.. ఈ ఇంటి మొత్తానికి షాక్ ఇస్తాను అని రాహుల్ అంటాడు. ఏం చేస్తున్నావ్ అని రుద్రాణి అంటే.. పెద్ద అత్తయ్య ఒక్కర్దే ఇంట్లో ఉంటుంది కదా.. ఈ సమయంలో అపర్ణా అత్తయ్యకు ఏమన్నా జరిగితే.. అత్తయ్య చచ్చిపోతే అని రాహుల్ అంటాడు.
ట్యాబ్లెట్స్ మార్చేసిన అపర్ణ..
అది చచ్చి.. అందుకు అపర్ణ కారణం అయితే రాజ్ కావ్యని ఇంట్లో ఉండనిస్తాడా? బయటకు గెంటేస్తాడు. దీంతో ఎలాంటి అడ్డం ఉండదు. అపర్ణ అత్తయ్య వేసుకునే ట్యాబ్లెట్స్‌లో వీటిని మార్చేయమని రాహుల్ అంటాడు. ఇందుకు రుద్రాణి కూడా సరే అంటుంది. ఒకే దెబ్బకు మూడు కుక్కలు అని సంబర పడతారు. ఇక అందరూ కలిసి గుడికి బయలు దేరతారు. ఈలోపు రుద్రాణి అపర్ణ గదిలోకి వెళ్లి ట్యాబ్లెట్స్ మార్చేస్తుంది. ఇక కావ్య అపర్ణకు టిఫిన్ చేస్తానని అంటుంది. ముందు నువ్వు నీ ఆరోగ్యం గురించి చూసుకో.. ఆ తర్వాత అందరి గురించి ఆలోచించమని అపర్ణ అంటుంది. ఆ తర్వాత కళ్యాణ్, అప్పూలు కలిసి గుడిలోకి వెళ్లి దర్శనం చేసుకుంటారు. ప్రసాదం తింటూ వాళ్ల ఇంట్లోని వాళ్లను గుర్తు చేసుకుంటాడు కళ్యాణ్. అప్పుడే దుగ్గిరాల ఫ్యామిలీ గుడికి వస్తారు.
అట్ల కాడ తీసిన అపర్ణ..
వాళ్లకు కనిపించకుండా ఉండేందుకు కళ్యాణ్ వాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోతారు. కళ్యాణ్, అప్పూలు పారిపోవడం రాహుల్ చూస్తారు. రుద్రాణిని పక్కకు పిలిచి రాహుల్ చెప్తాడు. ఇప్పుడు వీళ్ల గురించి మనకు అనవసరం. కాబట్టి ముందు ఆ పని చూడమని రాహుల్‌కి చెబుతుంది. ఇక రాహుల్ చెప్పిన్నట్టుగానే ప్లాన్ అమలు చేస్తాడు. మరోవైపు కావ్యకు వంటకు సిద్ధం చేస్తుంది. సరే ఆ కూరగాయలు కట్ చేసి ఇవ్వు.. నేను వంట చేస్తానని అపర్ణ అంటే.. కావ్య నవ్వి.. వద్దని చెబుతుంది. అప్పుడే కావ్య చాకు తీసి ఏయ్ తీయ్ కూరగాయలు తీయమని అంటుంది అపర్ణ. అయ్యయ్యో హత్యా ప్రయత్నమా అని కావ్య అంటుంది. ఇప్పుడు అట్ల కాడ తీసి.. వంట చేయనిస్తావా? లేదా అని అపర్ణ అంటుంది. అనంతరం దుగ్గిరాల ఫ్యామిలీ అంతా వెళ్లి గుడిలో పూజ చేస్తారు. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్‌లో మళ్లీ కలుద్దాం.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.