Bigg Boss 8 Telugu: విష్ణు ప్రియను పట్టించుకోని ‏చీఫ్స్.. నిఖిల్‏కు హ్యాండిచ్చిన ప్రేరణ..

ఆ తర్వాత అభయ్, పృథ్వీలను తన టీంలో చేరాలని కోరాడు నిఖిల్. కానీ వారిద్దరు యష్మీ టీంలోకి వెళ్లిపోయారు. చివరకు నిఖిల్ టీంలో చేరింది సోనియా. నైనిక, యష్మీ క్లాన్స్ లో మెంబర్స్ ఎక్కువగా ఉండడంతో ఇద్దరిలో ఎవరు బెస్ట్ అన్నది నిరూపించుకోవాలని చెప్పాడు బిగ్‏బాస్ .

Bigg Boss 8 Telugu: విష్ణు ప్రియను పట్టించుకోని ‏చీఫ్స్.. నిఖిల్‏కు హ్యాండిచ్చిన ప్రేరణ..
Bigg Boss
Follow us

|

Updated on: Sep 06, 2024 | 8:15 AM

బిగ్‏బాస్ సీజన్ 8 ఇప్పుడిప్పుడే రసవత్తరంగా సాగుతుంది. నామినేషన్స్ తర్వాత హౌస్‏లో పరిస్థితులు మారిపోయాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో నాగ మణికంఠ పేరు మారుమోగుతుంది. సింపథీ స్టార్ అంటూ మొదటి నుంచి ట్యాగ్ తెచ్చుకున్న మణికంఠ ప్రతిసారి తన గతం గురించి మాట్లాడుతూ అందరినీ కన్నీళ్లు పెట్టిస్తున్నాడు. ఇక నిన్నటి ఎపిసోడ్‏లోనూ మరోసారి ఎమోషనల్ అయ్యాడు. కెమెరాలతో ఒంటరిగా మాట్లాడుతూ ఏడ్చేస్తున్నాడు. మైండ్ బ్లాక్ పాటతో హౌస్మేట్స్ ను నిద్రలేపాడు బిగ్‏బాస్. ఆ తర్వాత వాష్ రూంలో పృథ్వీ కామెడీ హైలెట్ అయ్యింది. పొరపాటుగా టూత్ పేస్ట్ బదులుగా బ్రష్ కు ఫేష్ వాష్ పెట్టుకోవడంతో హౌస్ లో నవ్వులు పూశాయి. దీంతో అతడిని నిఖిల్ తోపాటు మిగిలిన హౌస్మేట్స్ ఆటపట్టించారు. ఇక ఆతర్వాత శేఖర్ బాషాకు బేబక్క కరాటే పాఠాలు చెప్పింది. ఇక ఆ తర్వాత నాగ మణికంఠతో నామినేషన్లో జరిగిన గొడవలపై క్లారిటీ ఇచ్చింది విష్ణుప్రియ. అందరూ తననే నామినేట్ చేయడంతో కుంగిపోతున్నావంటూ అతడికి ఓదార్చానంటూ చెప్పుకొచ్చింది. హౌస్ లో అందరితో కలిసిపోవాలని సలహా ఇచ్చింది ప్రేరణ.

హౌస్ లో చీఫ్స్ గా ఉన్న ముగ్గురు తమకంటూ సొంత సైన్యాన్ని నిర్మించుకునే టాస్క్ ఇచ్చాడు. బేబక్క, శేఖర్ బాషా, నబీద్ లు ముగ్గరు తమకు నచ్చిన క్లాన్ లో చేరే అవకాశాన్ని ఇచ్చాడు. దీంతో ముందుగా శేఖర్ బాషా యష్మి టీంలో చేరగా.. నిఖిల్ టీంలో బేబక్క చేరిపోయింది. ఇక బడ్డీగా వచ్చాం.. కలిసే ఆడతామంటూ నైనిక టీంలో చేరిపోయాడు నబీద్. ఇక ఆ తర్వాత మిగిలిన హౌస్మేట్స్ ను చీఫ్స్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రేరణ కోసం నిఖిల్, యష్మీ పోటీపడ్డారు. కానీ నిఖిల్ కు హ్యాండిచ్చి యష్మీ టీంలోకి వెళ్లిపోయింది ప్రేరణ. ఆ తర్వాత ఆదిత్య, సీత, విష్ణుప్రియలను తన టీంలోకి తీసుకుంది నైనిక. అయితే విష్ణు ప్రియ ను సెలక్ట్ చేసుకోవడానికి ముగ్గురు చీఫ్స్ ముందుకు రాలేదు. చివరకు నైనిక తన టీంలోకి తీసుకుంది. ఆ తర్వాత అభయ్, పృథ్వీలను తన టీంలో చేరాలని కోరాడు నిఖిల్. కానీ వారిద్దరు యష్మీ టీంలోకి వెళ్లిపోయారు. చివరకు నిఖిల్ టీంలో చేరింది సోనియా. నైనిక, యష్మీ క్లాన్స్ లో మెంబర్స్ ఎక్కువగా ఉండడంతో ఇద్దరిలో ఎవరు బెస్ట్ అన్నది నిరూపించుకోవాలని చెప్పాడు బిగ్‏బాస్ .

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.