Pallavi Prashanth: ‘ప్రాణం పోయినా మాట తప్పను’..రైతులకు బిగ్‌బాస్‌ ప్రైజ్‌మనీ పంపకంపై పల్లవి ప్రశాంత్‌

రైతు బిడ్డ ట్యాగ్‌ తో హౌజ్లోకి వచ్చిన తాను బిగ్‌ బాస్ ప్రైజ్‌మనీ మొత్తాన్ని రైతులకే వెచ్చిస్తానిని అందరి ముందు ప్రకటించాడు. అన్నదాతలకే తన డబ్బునంతా పంచుతానంటూ బిగ్‌ బాస్‌ వేదికతో పాటు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. దీంతో అందరూ పల్లవి ప్రశాంత్ నిర్ణయంపై ప్రశంసలు కురిపించారు. అయితే సెప్టెంబర్ 17న బిగ్‌ బాస్‌ ఏడో సీజన్‌ ముగిసింది. విజేతగా అవతరించిన ప్రశాంత్ రూ.35 లక్షల ప్రైజ్‌ మనీ అందుకున్నాడు.

Pallavi Prashanth: 'ప్రాణం పోయినా మాట తప్పను'..రైతులకు బిగ్‌బాస్‌ ప్రైజ్‌మనీ పంపకంపై పల్లవి ప్రశాంత్‌
Pallavi Prashanth
Follow us
Basha Shek

|

Updated on: Feb 18, 2024 | 5:02 PM

బిగ్‌ బాస్‌ తెలుగు ఏడో సీజన్‌ ముగిసిపోయి సుమారు రెండు నెలలు గడిచింది. ఈ సీజన్‌లో కామన్‌ బ్యాన్‌ గా హౌజ్‌లోకి అడుగుపెట్టిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌ విజేతగా నిలిచాడు. తనదైన గేమ్‌ స్ట్రాటజీతో స్టార్‌ కంటెస్టెంట్స్‌ను సైతం వెనక్కునెట్టి బిగ్‌ బాస్ టైటిల్‌ ను సొంతం చేసుకున్నాడు. అదే సమయంలో రైతు బిడ్డ ట్యాగ్‌ తో హౌజ్లోకి వచ్చిన తాను బిగ్‌ బాస్ ప్రైజ్‌మనీ మొత్తాన్ని రైతులకే వెచ్చిస్తానిని అందరి ముందు ప్రకటించాడు. అన్నదాతలకే తన డబ్బునంతా పంచుతానంటూ బిగ్‌ బాస్‌ వేదికతో పాటు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. దీంతో అందరూ పల్లవి ప్రశాంత్ నిర్ణయంపై ప్రశంసలు కురిపించారు. అయితే సెప్టెంబర్ 17న బిగ్‌ బాస్‌ ఏడో సీజన్‌ ముగిసింది. విజేతగా అవతరించిన ప్రశాంత్ రూ.35 లక్షల ప్రైజ్‌ మనీ అందుకున్నాడు. అలాగే రూ.15 లక్షల జ్యూయెలరీ, రూ.15 లక్షల కారును బహుమతిగా అందుకున్నాడు. అయితే సుమారు రెండు నెలలవుతున్నా పల్లవి ప్రశాంత్‌ రైతులకు ఒక్క రూపాయి కూడా పంచింది లేదంటున్నారు యాంటీ ఫ్యాన్స్‌.రైతు బిడ్డ పేరు చెప్పుకుని ప్రశాంత్‌ మోసం చేశాడని, మాట తప్పాడని నెట్టింట విమర్శలు వినిపిస్తున్నాయి.

అదే సమయంలో టీవీ షోలు, పార్టీలతో పల్లవి ప్రశాంత్‌ బిజీబిజీగా మారిపోయాడంటూ సామాజిక మాధ్యమాల్లో అతనిపై భారీగా ట్రోలింగ్‌ జరుగుతోంది. గతంలో ఇలాగే ఒక బిగ్‌ బాస్ కంటెస్టెంట్‌ క్యాన్సర్ రోగులకు తన ప్రైజ్ మనీని పంచుతానని మోసం చేశాడని, ఇప్పుడు ప్రశాంత్‌ కూడా అలాగే మాట తప్పాడంటూ నెటిజన్లు రైతు బిడ్డను ఒక ఆట ఆడేసుకుంటున్నారు. తాజాగా ఈ ట్రోలింగ్‌పై స్పందించాడు బిగ్‌ బాస్‌ విన్నర్‌. ‘ప్రాణం పోయినా ఇచ్చిన మాట మరువను. నేను ఇచ్చిన మాట కోసం ఎంత దూరం అయినా వెళ్తా.. నిరుపేద రైతు కుటుంబాల కోసం బిగ్ బాస్ ప్రైజ్ మనీతో త్వరలో మీ ముందుకు వస్తున్నా.. జై జవాన్ జై కిసాన్’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టాడు పల్లవి ప్రశాంత్. దీంతో తనపై వస్తోన్న విమర్శలకు, ట్రోలింగ్‌కు చెక్‌ పెట్టాడీ రైతు బిడ్డ.

ఇవి కూడా చదవండి

డబ్బులు పంచేందుకు వస్తున్నా…

తండ్రితో పల్లవి ప్రశాంత్..

పొలం పనుల్లో పల్లవి ప్రశాంత్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!