Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్ 2.0 లాంచ్.. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో సర్‌ప్రైజ్ ఇవ్వనున్న సెలబ్రిటీలు వీరే
బిగ్‌బాస్ 2.0 లాంచ్‌పై హోస్ట్ నాగార్జున హింట్ ఇచ్చారు. 'ఈ సీజన్ లో ఇంకా ఎన్నో ఊహించనివి జరుగుతాయి. గుర్తుపెట్టుకోండి. ఈ సీజన్ ఉల్టా పుల్డా. ఈ ఆదివారం బిగ్‌బాస్ ఇంట్లో విషయాలను నాగార్జున ఉల్టా పుల్టా చేయనున్నారు. మిమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తే ఊహించని ట్విస్ట్ కోసం రెడీగా ఉండండి' అంటూ తాజాగా రిలీజైన ప్రోమోలో చెప్పుకొచ్చారు నాగార్జున. తద్వారా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయన్న హింట్ ఇచ్చారు.
బిగ్‌బాస్ 2.0 లాంచ్‌పై హోస్ట్ నాగార్జున హింట్ ఇచ్చారు. ‘ఈ సీజన్ లో ఇంకా ఎన్నో ఊహించనివి జరుగుతాయి. గుర్తుపెట్టుకోండి. ఈ సీజన్ ఉల్టా పుల్డా. ఈ ఆదివారం బిగ్‌బాస్ ఇంట్లో విషయాలను నాగార్జున ఉల్టా పుల్టా చేయనున్నారు. మిమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తే ఊహించని ట్విస్ట్ కోసం రెడీగా ఉండండి’ అంటూ తాజాగా రిలీజైన ప్రోమోలో చెప్పుకొచ్చారు నాగార్జున. తద్వారా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయన్న హింట్ ఇచ్చారు. దీనికి తోడు హౌజ్‌లోకి అడుగుపెట్టిన మొత్తం 14 మంది కంటెస్టెంట్లలో నలుగురు ఇప్పటికే ఎలిమినేట్ అయ్యారు. కిరణ్ రాథోడ్, షకీలా, దామని భట్ల, రతికా రోజ్ హౌజ్ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఈ వారం కూడా మరొక కంటెస్టెంట్ హౌజ్‌ను వీడనున్నారు. దీంతో హౌజ్‌లో ఎంటర్‌టైన్మెంట్ తగ్గకుండా ఉండేందుకే ఈ వారంలోనే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లకు ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం బిగ్ బాస్ సీజన్ సెవెన్ మినీ లాంచ్ ఈవెంట్ ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారట. ఆదివారం (అక్టోబర్ 8) సాయంత్రం 7 గంటలకు ఈ స్పెషల్ ఈవెంట్ ప్రారంభం కానుందని ప్రోమోలో చెప్పుకొచ్చారు నాగార్జున.
కాగా బిగ్‌బాస్ ఏడో సీజన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు సంబంధించి మొదటి నుంచి వినిపిస్తున్న పేరు అంబటి అర్జున్. తన బిగ్‌బాస్ ఎంట్రీకి సంబంధించి వరుసగా హింట్స్ కూడా ఇస్తున్నాడీ సీరియల్ ఆర్టిస్ట్. అలాగే మొగలి రేకులు ఫేమ్ అంజలి పవని, మరో సీరియల్ నటి పూజా మూర్తి, సోషల్ మీడియా సెలబ్రిటీ నయని పావని, మ్యూజిక్ డైరెక్టర్ భోలే షామిలి, జబర్దస్త్ కెవ్వు కార్తీక్ కూడా బిగ్ బాస్ హౌజ్‌లోకి రానున్నారని తెలుస్తోంది. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం అంజలి పవని చివరి నిమిషంలో పక్కకు తప్పుకుందని తెలుస్తోంది. ఆమె స్థానంలోనే కెవ్వు కార్తీక్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాని సమాచారం. మొత్తానికి వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో హౌజ్‌లో మరింత ఫన్‌ను జనరేట్ చేసేందుకు రెడీ అయ్యారట బిగ్‌బాస్ నిర్వాహకులు.
అంబటి అర్జున్, కెవ్వు కార్తీక్ లతో పాటు..
View this post on Instagram
నయని పావని ..
View this post on Instagram
అంజలి పవన్ షాక్ ఇచ్చిందా?
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.