Bigg Boss 7 Telugu: వామ్మో.. పాటబిడ్డపై రెచ్చిపోయిన సీరియల్ బ్యాచ్.. ‘థూ’ అనేసిన ప్రియాంక.. ఇచ్చిపడేసిన భోలే..
తేజాను నామినేట్ చేసింది శోభా శెట్టి. పనిష్మెంట్ సీరియస్ గా తీసుకోవడం లేదని..వీఐపీ రూంలోకి వెళ్తాను పడుకుంటాను అంటూ అనడం నాకు నచ్చడం లేదంటూ చెప్పేసింది. దీంతో నేను ఫన్ గా అలా అన్నాను బ్రో అంటూ తేజా అనగా.. నీకు ప్రతీదీ ఫన్ బ్రో.. మాకు సీరియస్ బ్రో అంటూ నామినేట్ చేసింది. ఇక ఆ తర్వాత పాటబిడ్డ భోలేను నామినేట్ చేసింది. 'నీకు కోపం వస్తే నాకు పాపం అనిపిస్తుంది. ఆడపిల్లలు మీకు మంచి భవిష్యత్
బిగ్‌బాస్ ఏడో వారం నామినేషన్స్ రసవత్తరంగా సాగింది. సోమవారం నాటి ఎపిసోడ్లో సందీప్ వర్సెస్ పల్లవి ప్రసాంత్ మధ్య పెద్ద గొడవే జరిగింది. నువ్వా నేనా అన్నట్లుగా మాటలతో రెచ్చిపోయారు. ముఖ్యంగా గత ఐదువారాలుగా టాప్ లో ఉన్న పల్లవి ప్రశాంత్ నిన్నటి ఎపిసోడ్‌తో అట్టడుగు స్థాయికి చేరిపోయాడు. సందీప్ నామినేట్ చేస్తూ మాట్లాడుతున్నా అవేం వినకుండా పిచ్చిగా ప్రవర్తించాడు ప్రశాంత్. ఇక ఈరోజు కూడా హౌస్ లో నామినేషన్స్ కొనసాగింది. తాజాగా విడుదలైన ప్రోమోలో సీరియల్ బ్యాచ్ శోభా శెట్టి, ప్రియాంక పాటబిడ్డ పై రెచ్చిపోయారు. భోలే పైకి వెళ్తు మాటల దాడి చేశారు. ముఖ్యంగా భోలే పై థూ అనేస్తూ నోరు జారింది ప్రియాంక. దీంతో ప్రియాంక, శోభాకు గట్టిగానే ఇచ్చిపడేశాడు భోలే.
తాజాగా విడుదలైన ప్రోమోలో.. తేజాను నామినేట్ చేసింది శోభా శెట్టి. పనిష్మెంట్ సీరియస్ గా తీసుకోవడం లేదని..వీఐపీ రూంలోకి వెళ్తాను పడుకుంటాను అంటూ అనడం నాకు నచ్చడం లేదంటూ చెప్పేసింది. దీంతో నేను ఫన్ గా అలా అన్నాను బ్రో అంటూ తేజా అనగా.. నీకు ప్రతీదీ ఫన్ బ్రో.. మాకు సీరియస్ బ్రో అంటూ నామినేట్ చేసింది. ఇక ఆ తర్వాత పాటబిడ్డ భోలేను నామినేట్ చేసింది. ‘నీకు కోపం వస్తే నాకు పాపం అనిపిస్తుంది. ఆడపిల్లలు మీకు మంచి భవిష్యత్ ఉంది’ అని భోలే అన్నాడు. దీంతో మధ్యలోకి దూరిపోయింది ప్రియాంక. ‘ఆడపిల్లా.. ఆడపిల్లా అంటూ నటిస్తున్నావ్ కదా..కనిపిస్తుంది’ అంటూ రెచ్చిపోయింది. దీంతో భోలే నీలాంటోళ్లని చాలా మందిని చూశా పో అని అన్నాడు.
View this post on Instagram
దీంతో ‘ఏంటీ నాలాంటోళ్లను నువ్వు చూసేది. ఈ మాటలు నేను వినలేకపోతున్నాను బిగ్ బాస్ ‘ అంటూ సీరియస్ అయ్యింది. నువ్వు నటించావ్.. నువ్వు నటించావ్ అంటూ మరింత రెచ్చిపోయింది. అటు శోభా సైతం మోనితగా మారిపోయింది. పక్కన ఆడపిల్ల ఉన్నప్పుడు నోరు అదుపులో పెట్టుకో అంటూ వార్నింగ్ఇచ్చింది. ఇక చివరగా ప్రియాంక కంట్రోల్ తప్పింది. భోలే ను చూస్తూ థూ అంటూ నోరు జారింది. కానీ భోలే మాత్రం మెల్లగా ‘నువ్వు నన్ను థూ అన్నావ్.. అదే థూ నేను ఊస్తే నీ బతుకు ఏం కావాలి ‘ అంటూ ఇచ్చిపడేశాడు. ఇక ఆ తర్వాత నువ్వు మోనితవే అని భోలే అనగానే సైకోలా బిహేవ్ చేసింది శోభా. ఆ తర్వాత శోభా నామినేట్ చేయడంతో తేజా ఫీల్ అయినట్లుగా తెలుస్తోంది. ఇంట్లో ఉన్న 12 మంది నామినేట్ చేస్తే బాధ ఉండేది కాదు.. కానీ నువ్వు చేశావ్ అంటూ ఎమోషనల్ అయ్యాడు తేజ.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.