Brahmamudi, October 17th episode: బండిపై రాజ్ ని హగ్ చేసుకున్న కావ్య.. దొంగ చాటుగా పాన్ షాపులో డ్యాన్సులు!
ఈ రోజు బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ లో కావ్య తనకు పాన్ తినాలని ఉంది అని చెప్తుంది. ఈ రోజు ఎలాగైనా నీకు పాన్ ఇప్పించకుండా తిరిగి రాము అని రాజ్ అంటాడు. కారు అయితే అనుమానం వస్తుంది.. బండి మీద వెళ్దాం అని రాజ్ అంటాడు. ఇక రాజ్ ఇంట్లో ఎవరైనా ఉన్నారా అంటూ దొంగ చాటుగా ఇంట్లో అన్ని మూలలూ వెతుకుతూ బయటకు వస్తాడు. ఆ తర్వాత కావ్య డ్రెస్ వేసుకుని.. కిందకు వస్తుంది. అలా ఇద్దరూ కలిసి బండి మీద వెళ్తారు. కావ్య ఇక ప్రేమగా రాజ్ ని హగ్ చేసుకుంటుంది. రాజ్ కూడా షాపు కోసం వెతుకుతూ ఉంటాడు. అర్థరాత్రి ఎన్ని షాపులు చూసినా క్లోజ్ చేసి ఉంటాయి. అలా..
ఈ రోజు బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ లో కావ్య తనకు పాన్ తినాలని ఉంది అని చెప్తుంది. ఈ రోజు ఎలాగైనా నీకు పాన్ ఇప్పించకుండా తిరిగి రాము అని రాజ్ అంటాడు. కారు అయితే అనుమానం వస్తుంది.. బండి మీద వెళ్దాం అని రాజ్ అంటాడు. ఇక రాజ్ ఇంట్లో ఎవరైనా ఉన్నారా అంటూ దొంగ చాటుగా ఇంట్లో అన్ని మూలలూ వెతుకుతూ బయటకు వస్తాడు. ఆ తర్వాత కావ్య డ్రెస్ వేసుకుని.. కిందకు వస్తుంది. అలా ఇద్దరూ కలిసి బండి మీద వెళ్తారు. కావ్య ఇక ప్రేమగా రాజ్ ని హగ్ చేసుకుంటుంది. రాజ్ కూడా షాపు కోసం వెతుకుతూ ఉంటాడు. అర్థరాత్రి ఎన్ని షాపులు చూసినా క్లోజ్ చేసి ఉంటాయి. అలా చివరకు ఒక షాపు కనిపిస్తుంది. ఒక దొంగ తనంగా ఇద్దరూ కలిసి ఆ షాపులోకి వెళ్తారు. ఇక కావ్య కోసం పాన్ రెడీ చేసి ఇస్తాడు రాజ్. అది చైసిన కావ్య షాక్ అవుతుంది. ఇక పాన్ సిద్ధం చేసి కావ్య తింటూ హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్ట్స్ కావ్య కూడా రాజ్ కోసం మసాలా పాన్ కట్టి.. నోట్లో పెడుతుంది. ఆ తర్వాత వాళ్లిద్దరూ కాసేపు సరదాగా ఆడుతూ పాడుతూ గడుపుతారు.
ఇక నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
కనకం భోజనం చేయడం అపర్ణకు అస్సలు నచ్చదు. అందులోనూ పక్కనే ఉండి భోజనం చేయడంతో అస్యహించుకుంటుంది. ఇక కావ్య ఎంతో ఆనందంగా కనకానికి భోజనం వడ్డిస్తుంది. ఇక రుద్రాణి షరా మామూలుగానే కనకాన్ని కించపరిచే విధంగా మాటలు తూటాలు పేలుస్తుంది. భోజనం సరే.. మరి కనకం ఎక్కడ పడుకుంటుంది.. అందరూ జంటలుగానే ఉన్నారు కదా.. ఒక కిచెన్ మాత్రమే ఖాళీగా ఉందంటూ వెటకారంగా మాట్లాడుతుంది. ఈ మాటలకు ఎంతో కోపం వస్తుంది. అయినా ఏమీ మాట్లాడకుండా ఉంటుంది. ఆ తర్వాత ఇందిరా దేవి, ధాన్య లక్ష్మి.. రుద్రాణికి కౌంటర్ లు వేస్తారు. అవును అందరూ జంటలుగా ఉన్నారు.. నువ్వు ఒక్కదానివే ఖాళీగా పడుకుంటున్నావ్ కదా.. కనకం నీ రూమ్ లో పడుకుంటుందని అంటారు. దీంతో రుద్రాణి తాను తీసుకున్న గోతిలో తానే పడుతుంది. ఇక తప్పక కనకం.. కూడా రుద్రాణి గదిలో పడుకుంటుంది.
మనసులో మాట బయట పెట్టిన అప్పు:
ఇక ఆ తర్వాత ఆ కవికి నా మనసు ఎందుకు అర్థం కావడం లేదు పెద్దమ్మా అంటూ.. తన పెద్దమ్మ భుజంపై తల వాల్చి బాధ పడుతుంది. నువ్వు చెప్పింది నిజమే.. నాకు తెలియకుండానే ఆ కవితో ప్రేమలో పడిపోయాను. ఎప్పుడు ఇదంతా జరిగిందో నాకే తెలీదు పెద్దమ్మా.. అసలు ఎప్పుడూ వాడిని ఆ ఉద్దేశంతో చూడలేదు అని అప్పు కన్నీరు పెడుతుంది. దీంతో మొత్తానికి అప్పూ తన మనసులో మాట బయట పెడుతుంది. కనకం అక్క కూడా అప్పూని ఓదార్చుతుంది.
రుద్రాణి గదిలో కనకం కష్టాలు:
ఇక ఆ తర్వాత రుద్రాణి గదిలోకి వస్తుంది కనకం. కానీ ముందుగానే కనకం కోసం చాప పరిచి ఉంచుతుంది రుద్రాణిం. మీకు కింద పడుకునే అవాటు ఉందా అంటూ రివర్స్ లో రుద్రాణికి కౌంటర్ వేస్తుంది కనకం. అప్పుడే కృష్ణ మూర్తి ఫోన్ చేసి ఎలా ఉంది అని అడుగుతాడు. ఇక్కడ ఏసీ ఉంది.. అలవాటు లేదు కదా కానీ పడుకోవాలి అని అంటుంది. ఈ మాటలు విన్న రుద్రాణి.. ఫుల్లుగా ఏసీ పెడుతుంది. కనకం చలితో వణికిపోతుంది. దీంతో కబోర్డ్ లో ఉన్న చీరలను చుట్టుకుని పడుకుంటుంది కనకం.