AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sonu Sood: పెను ప్రమాదం నుంచి కోవిడ్ రోగులను రక్షించిన సోనూసూద్ బృందం.. ప్రశంసలు కురిపించిన ఆసుపత్రి యాజమాన్యం..

సోనూసూద్ సినిమాల్లో చేసేవి విలన్ పాత్రలే అయినా రియల్ లైఫ్ లో మాత్రం సూపర్ హీరో అనిపించుకున్నాడు.

Sonu Sood: పెను ప్రమాదం నుంచి కోవిడ్ రోగులను రక్షించిన సోనూసూద్ బృందం.. ప్రశంసలు కురిపించిన ఆసుపత్రి యాజమాన్యం..
Sonu Sood
Rajeev Rayala
|

Updated on: May 14, 2021 | 4:42 PM

Share

Sonu Sood: సోనూసూద్ సినిమాల్లో చేసేవి విలన్ పాత్రలే అయినా రియల్ లైఫ్ లో మాత్రం సూపర్ హీరో అనిపించుకున్నాడు. అడిగినది లేదనకుండా..కాదనకుండా.. సాయం చేస్తూ ప్రజల పాలిట దైవంగా మారాడు. మొదటిసారి లక్ డౌన్ విధించిన సమయంలో వలస కార్మికులను తమ స్వగ్రామాలకు చేర్చి అందరి చేత ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పుడు ఈ కష్టసమయంలో సోనుసూద్ తో పాటు అతని NGO సభ్యులు కూడా చాకచక్యంగా వర్క్ చేస్తున్నారు. ఇటీవల స్థానిక పోలీసుల బృందంతో కలిసి బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి (శ్రేయాస్ హాస్పిటల్) వద్ద ఆక్సిజన్ లీక్‌ను గుర్తించారు. వారు ప్రమాదాన్ని గుర్తించి వెంటనే స్పందించి దాదాపు 30 మంది కోవిడ్ -19 రోగుల ప్రాణాలను కాపాడారు.  లీక్ గుర్తించినప్పుడు సోనుసూద్ బృందం తగినంత సంఖ్యలో ఆక్సిజన్ సిలిండర్లతో ఆసుపత్రికి చేరుకుంది. ఆక్సిజన్ లీక్ అయిన సమయంలో రోగులకు ఆక్సిజన్ సరఫరా చేయడానికి  గంట మాత్రమే మిగిలి ఉంది. ఆ సమయంలో ఆసుపత్రిలోని ఒక వైద్యుడు సమిత్ హవినల్ వెంటనే సంక్షోభం నుండి బయటపడటానికి సోనుసూద్ ఫౌండేషన్, మేఘా చౌదరి మరియు పోలీసు హెల్ప్‌లైన్ బృంద సభ్యులను సంప్రదించామని అన్నారు. పోలీసులు వచ్చినప్పుడు సోనుసూద్ బృందం ఆస్పత్రిలో పనిలో ఉందని . వారు సమీప ప్రాంతమైన పీన్యలోని ఇతర ఆసుపత్రులు మరియు ఆక్సిజన్ ప్లాంట్లను సంప్రదించడం ద్వారా ఆక్సిజన్ సిలిండర్లను ఏర్పాటు చేసారని అన్నారు.  క్లిష్టమైన పరిస్థితుల్లో వెంటనే స్పందించినందుకు ఆసుపత్రి యాజమాన్యం తో పాటు ప్రజలు రోగులు సోనుసూద్ బృందాన్ని ప్రశంసించారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Rekha: పాకిస్తాన్ PM ఇమ్రాన్ ఖాన్‏తో బాలీవుడ్ నటి రేఖ పెళ్లి ?.. సోషల్ మీడియాలో వార్త హల్‏చల్..

Tamannaah: అభిమానులు మెచ్చుకుంటేనే నాకు నిజమైన ఆనందం ఉంటుంది: ‘నవంబర్‌ స్టోరీ’పై తమన్నా

Chatrapathi Hindi Remake: ఛ‌త్ర‌ప‌తి హిందీ రీమేక్‌లో హీరోయిన్ ఎవ‌రో తెలుసా.? ఈ వార్త‌లో అయినా నిజం ఉందా.!