కష్టసమయంలో ముందుకువచ్చిన హీరోలు…ముఖ్యమంత్రి సహాయ నిధికి భారీవిరాళాలు అందించిన సినిమాతారలు..

దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి విజృంభించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు

కష్టసమయంలో ముందుకువచ్చిన హీరోలు...ముఖ్యమంత్రి సహాయ నిధికి భారీవిరాళాలు అందించిన సినిమాతారలు..
Tamil Heros

దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి విజృంభించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వేల సంఖ్యలో ప్రజలు ఆసుపత్రి పాలవుతున్నారు. వందల మంది మృత్యువాత పడుతున్నారు. రోజురోజుకు కరోనా రోగుల సంఖ్య పెరుగుతుంది. ప్రజలను రక్షించేందుకు ఫ్రంట్ లైన్ వారియర్స్ నిరంతరం కృషి చేస్తున్నారు. వారికోసం సెలబ్రిటీలు విరాళాలు ఇస్తున్నారు. ఈ క్రమంలో స్టార్ హీరో సూర్య ఆయన ఫ్యామిలీ భారీగా విరాళం అందించారు. తాజాగా.. కొత్త ముఖ్యమంత్రి స్టాలిన్ ను కలిసి ఏకంగా కోటిరూపాయలను అందించారు. కొవిడ్ బాధితులను ఆదుకోవాలంటు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ మొత్తాన్ని అందజేశారు. అంతే కాదు అగరం ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఇప్పటికే ఎంతో మందిని చదవిస్తున్నారు. ఈ ఫౌండేషన్ ద్వారా.. ఎన్నో సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఇక తొలిదశ కరోనా వేళ కూడా ముందుకొచ్చి ఎంతో మందికి సేవలు అందించారు సూర్య బ్రదర్స్.

వీరితోపాటు రజనీకాంత్, ఉదయనిధి స్టాలిన్, అజిత్, దర్శకుడు ఎఆర్ మురుగదాస్ సహా పలువురు తమిళ నటులు తమిళనాడు ముఖ్యమంత్రి సహాయ నిధికి భారీ మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు. అజిత్ సీఎం సహాయనిధికి 25 లక్షలు విరాళం అందించారు. అలాగే ఆర్ మురుగదాస్ కూడా రూ .25 లక్షలు అందించినట్లు తెలుస్తుంది. అదేవిదంగా అన్నతే షెడ్యూల్ ముగించుకుని ఇటీవల చెన్నైకి తిరిగి వచ్చిన తలైవర్ రజనీకాంత్ కూడా ముఖ్యమంత్రి సహాయనిధికి రూ .1 కోటిరూపాయలు విరాళంగా ఇచ్చినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఇటీవలే రాజకీయాల్లో విజయం సాధించిన యంగ్ హీరో ఉదయ్ నిధి స్టాలిన్ కూడా రూ 25లక్షల చెక్ ను ముఖ్యమంత్రి స్టాలిన్ కు అందజేశారు. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత స్టాలిన్ ఈ మధ్యనే ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఘన విజయం సాధించింది.

మరిన్ని ఇక్కడ చదవండి :

onu Sood: పెను ప్రమాదం నుంచి కోవిడ్ రోగులను రక్షించిన సోనూసూద్ బృందం.. ప్రశంసలు కురిపించిన ఆసుపత్రి యాజమాన్యం..

Aakasam Nee Haddura: మ‌రో అరుదైన ఘ‌న‌త సాధించిన ఆకాశం నీ హ‌ద్దురా… ఇంట‌ర్‌నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో..