Jagapathi Babu: మన బుద్దులు మారకుంటే.. ప్రకృతి మనకు గట్టిగా బుద్ది చెబుతుంది : జగపతిబాబు
"గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కరోనా వార్నింగ్ మాత్రమే.. ముందుకు వెళుతుంటే ఇంకా తీవ్ర పరిస్థితులను ఎదర్కోవాల్సి వస్తుందని" జగపతిబాబు మానవాళిని హెచ్చరించారు.
Jagapathi Babu:
“గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కరోనా వార్నింగ్ మాత్రమే.. ముందుకు వెళుతుంటే ఇంకా తీవ్ర పరిస్థితులను ఎదర్కోవాల్సి వస్తుందని” జగపతిబాబు మానవాళిని హెచ్చరించారు. తాజాగా ఆయన తన ఫాం హౌస్‌లో ఓ ధ్యాన మందిరాన్ని ఏర్పాటు చేసుకునే క్రమంలో ఆయన ఈ వాక్యలు చేశారు. ప్రకృతికి దగ్గరగా ఉందామనే.. ప్రకృతితో సహజీవనం చేద్దామనే.. తన కంటూ ధ్యానం చేయడానికి ఓ స్థానాన్ని తన వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసుకోడానికి వచ్చానని ఆయన అన్నారు.”ఇక్కడ నా కోసం.. మీకోసం మన కోసం ప్రతిరోజు ధ్యానం చేస్తాను” అని జగపతి బాబు అన్నారు. ఇప్పుడు ధ్యానం అవసరమని.. అదీకాక మనం ప్రకృతిని చాలా దూరం చేసుకుంటున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మదర్ నేచర్‌కు మనం వ్యాల్యూ ఇవ్వకపోతే మనం తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు కరోనా అనేది వార్నింగ్ మాత్రమేనని.. ఇంక ముందు కూడా మనం ఇలానే ఉంటే.. మన బుద్దులు మారకుంటే.. మనకు ప్రకృతి గట్టిగా బుద్ది చెబుతుందని ఆయన మానవాళిని హెచ్చిరించారు.
ఇలాంటి మరో ఉపద్రవం వస్తే ఎంత మంది ఉంటారో ఎంత మంది పోతారో మీ ఆలోచించుకోవాలని జగపతి బాబు అన్నారు. ప్రకృతిని కాపాడుకుంటూ.. ప్రకృతిలో మమేకం అవుతూ.. అందరూ ధ్యానం చేయాలని ఆయన అందరికీ సూచించారు. జగపతి బాబు ప్రస్తుతం టాలీవుడ్ లో విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా బిజీగా ఉన్నారు. ఇటీవల కాలంలో ఆయన లేకుండా పెద్ద సినిమాలు రావడంలేదు అంటే అతిశయోక్తి కాదు.
మరిన్ని ఇక్కడ చదవండి :