Rekha: పాకిస్తాన్ PM ఇమ్రాన్ ఖాన్‏తో బాలీవుడ్ నటి రేఖ పెళ్లి ?.. సోషల్ మీడియాలో వార్త హల్‏చల్..

తన అందంతో పాటు అభినయంతోనూ ఒక తరం ప్రేక్షకులను ఉర్రూతలూగించిన నటి రేఖ. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్‌తో రేఖ ప్రేమాయణం గురించి అందరికీ తెలిసిందే.

Rekha: పాకిస్తాన్ PM ఇమ్రాన్ ఖాన్‏తో బాలీవుడ్ నటి రేఖ పెళ్లి ?.. సోషల్ మీడియాలో వార్త హల్‏చల్..
Rekha
Follow us
Rajitha Chanti

|

Updated on: May 14, 2021 | 12:53 PM

తన అందంతో పాటు అభినయంతోనూ ఒక తరం ప్రేక్షకులను ఉర్రూతలూగించిన నటి రేఖ. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్‌తో రేఖ ప్రేమాయణం గురించి అందరికీ తెలిసిందే. అయితే రేఖ జీవితంలో మరో ఆసక్తికర ప్రేమకథ కూడా ఉందట. ప్రముఖ క్రికెటర్, ప్రస్తుత పాకిస్థాన్ ప్రధానితోనూ రేఖ ప్రేమాయణం సాగించిందట. వీరి బంధం పెళ్లి వరకు వెళ్లి బ్రేక్ పడిందట. వీరి లవ్‌స్టోరికి సంబంధించిన ఓ పేపర్‌ క్లిప్పింగ్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది.

బాలీవుడ్‌ భామలు…క్రికెటర్ల మధ్య అవినాభావ సంబంధం ఉంది. ఎందరో బాలీవుడ్‌ అందెగత్తెలు టీమ్‌ఇండియా క్రికెటర్లను ప్రేమించారు. కొందరు పెళ్లి దాకా వెళితే..మరికొందరు మధ్యలోనే బ్రేకప్ చెప్పేశారు. ఇప్పటికీ ఆ ఆనవాయితీ కొనుసాగుతోంది. అయితే ఇది భారత క్రికెట్‌తోనే ఆగిపోలేదు. పాక్‌ మాజీ క్రికెటర్‌, ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ బాలీవుడ్‌ అలనాటి ముద్దుగుమ్మ రేఖ పెళ్లి చేసుకోవాలని భావించారట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ కథనం నెట్టింట వైరల్‌గా మారింది.

ఆల్ రౌండర్ ఇమ్రాన్‌ సారథ్యంలో 1992లో పాక్‌ జట్టు వరల్డ్‌ కప్‌ కూడా గెలుచుకుంది. ఇక అప్పట్లో ఇమ్రాన్‌కు లేడీ ఫాలోయింగ్‌ విపరీతంగా ఉండేది. వీరిలో మన దేశానికి చెందిన వారు కూడా ఉన్నారు. గతంలో ఇరు దేశాల మధ్య తరచుగా ద్వైపాక్షిక టెస్ట్‌ సిరీస్‌లు జరిగేవి. దాంతో బాలీవుడ్‌ సెలబ్రిటీలు, క్రికెటర్ల్‌ మధ్య మంచి సంబంధాలు ఉండేవి. ఇమ్రాన్‌కు పలువురు బాలీవుడ్‌ అందాల హీరోయిన్లతో పరిచయం ఏర్పడింది. అలా ఒకరోజు ఇమ్రాన్ ఇన్‌స్వింగర్‌కు రేఖ బౌల్డ్ అయిందంటూ కథనాలు వచ్చేవి. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. ఇద్దరూ బీచులు, ఉద్యానవనాల్లో ప్రేమించుకొనేవాళ్లని ఆ కథనంలో రాశారు. ఈ క్రమంలో ఇమ్రాన్‌ ఓ నెల రోజుల పాటు ముంబైలోనే ఉన్నాడని క్లిప్పింగ్‌ కోట్‌ చేసింది. అయితే కారణాలు తెలియదు కానీ ఆ తర్వాత విడిపోయారని రాసుకొచ్చింది. ఈ క్లిప్పింగ్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజనులు వీరిద్దరికీ వివాహం జరిగి ఉంటే.. ఇండియా-పాక్‌ మధ్య చాలా సమస్యలకు పరిష్కారం దొరికేదేమో అంటూ కామెంట్‌ చేస్తున్నారు. ఇమ్రాన్ 1992 లో క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. ఆ తర్వాత అతను రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగాడు. 2018లో అతను పాకిస్తాన్ ప్రధానిగా ఎన్నికయ్యాడు.

Also Read: Jr.NTR : ‘హ్యాపీ ఈద్’.. రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎన్టీఆర్.. తన ఆరోగ్యం పై క్లారిటీ ఇచ్చిన యంగ్ టైగర్..