Jr.NTR : ‘హ్యాపీ ఈద్’.. రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎన్టీఆర్.. తన ఆరోగ్యం పై క్లారిటీ ఇచ్చిన యంగ్ టైగర్..

Jr.NTR: దేశాన్ని అతలాకుతలం చేస్తోన్న కరోనా వైరస్.. సినీ ఇండస్ట్రీపై తీవ్రంగానే ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన ఎంతో మంది

Jr.NTR : 'హ్యాపీ ఈద్'.. రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎన్టీఆర్.. తన ఆరోగ్యం పై క్లారిటీ ఇచ్చిన యంగ్ టైగర్..
Ntr
Follow us
Rajitha Chanti

|

Updated on: May 14, 2021 | 9:26 AM

Jr.NTR: దేశాన్ని అతలాకుతలం చేస్తోన్న కరోనా వైరస్.. సినీ ఇండస్ట్రీపై తీవ్రంగానే ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన ఎంతో మంది సినీ ప్రముఖులు పడిన సంగతి తెలిసిందే. ఇందులో పలువురు ప్రాణాలు సైతం పోగోట్టుకున్నారు. ఇక ఈ వైరస్ మహమ్మారి బడా హీరోలకు కూడా సోకింది. ఇటీవల స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, ఎన్టీఆర్ లకు కరోనా సోకిన విషయం తెలిసిందే. ఇక రెండు రోజుల క్రితం స్టైలీష్ స్టార్ బన్నీ ఈ మహమ్మారిని జయించినట్లుగా ట్వీట్ చేసాడు. ఇక ఈ క్రమంలోనే తమ అభిమాన హీరో ఎలా ఉన్నాడంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆరా తీస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ తన హెల్త్ కండిషన్ పై అప్ డేట్ ఇచ్చారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని… త్వరలోనే కరోనా రిపోర్ట్ నెగిటివ్ రావాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు. అలాగే ఈరోజు రంజాన్ పర్వదినం కావడంతో ముస్లింలకు ఈద్ శుభాకాంక్షలు తెలిపారు ఎన్టీఆర్. Eid Mubarak

ప్రస్తుతం ఎన్టీఆర్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో ఎన్టీఆర్ తోపాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా లీడ్ రోల్ లో నటిస్తుండగా.. కరోనా కారణంగా ఈ మూవీ షూటింగ్ ఇప్పుడు వాయిదా పడింది. ఈ క్రమంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కరోనా బారిననపడ్డారు. ఈ విషయాన్ని తానే స్వయంగా సోషల్ మీడియా ద్వారా చెప్పారు. ఎవ‌రూ కంగారు ప‌డాల్సిన ప‌నిలేద‌ని ప్రస్తుతం తాను బాగానే ఉన్నాన‌ని తార‌క్ తెలిపారు. త‌న‌తో పాటు కుటుంబ సభ్యులంద‌రూ హోమ్ ఐసోలేష‌న్ లో ఉన్నట్లు చెప్పారు. డాక్ట‌ర్ల ప‌ర్యవేక్షణలో ఉంటూ అన్ని కోవిడ్ నియ‌మ నిబంధ‌న‌లు పాటిస్తున్నట్లు చెప్పారు.

ట్వీట్..

Also Read: కస్టమర్లకు అలర్ట్… పోస్టాఫీస్ వర్క్ టైమింగ్స్ మారాయి..రోజుకూ కొన్ని గంటలే పనిచేయనున్న కార్యాలయాలు..

అదిరిపోయే స్కీమ్.. ప్రతి నెల రైతుల ఖాతాల్లోకి రూ.3 వేలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!