ట్రెండింగ్‌లో ఆవిడే మా ఆవిడే మూవీ సెకెండ్ హీరోయిన్.. ఆ స్టార్ హీరోపై సంచలన ఆరోపణలు.. ఇప్పుడెలా ఉందో చూశారా?
ఒకప్పుడు దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో గ్లామర్ గర్ల్ గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో హీరోయిన్ హీరా రాజ్ గోపాల్ ఒకరు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 50కి పైగా సినిమాల్లో నటించిందీ అందాల తార.

హీరా రాజ్ గోపాల్.. ఈ పేరు వింటే గుర్తు రాకపోవచ్చు.. కానీ అక్కినేని నాగార్జున నటించిన ఆవిడ మా ఆవిడే లో సెకెండ్ హీరోయిన్ అంటే ఇట్టే కళ్ల ముందు మెదులుతుంది. ఒకప్పుడు తన గ్లామర్ తో ఒక ఊపు ఊపేసిన ఈ అందాల తార ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. దీనికి కారణం ఓ స్టార్ నటుడిని ఉద్దేశిస్తూ ఆమె చేసిన కామెంట్సే. గతంలో ఆ స్టార్ నటుడితో హీరా ప్రేమాయణం నడిపినట్లు ప్రచారం జరిగింది. పెళ్లి కూడా చేసుకుంటారని రూమర్లు వినిపించాయి. అయితే కొన్ని కారణాలతో ఈ లవ్ స్టోరీకి ఫుల్ స్టాప్ పడినట్లు తెలుస్తోంది. చెన్నైకి చెందిన హీరా పబ్లిక్ రౌడీ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత దొంగల రాజ్యం, లిటిల్ సోల్జర్స్, శ్రీకారం, ఆహ్వానం, చెలికాడు, అంతపురం, పెద్ద మనషులు, అల్లుడుగారోచ్చారు తదితర తెలుగు సినిమాల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన దొంగ దొంగ సినిమాతో హీరాకు మంచి గుర్తింపు వచ్చింది. తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 50కి పైగా సినిమాల్లో నటించిందీ హీరా. అయితే క్రమంగా ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి.
చివరిగా 1999లో స్వయంవరం చిత్రంలో నటించింది హీరా. ఆ తర్వాత ఏ సినిమాలోనూ నటించలేదు. 2002లో పుష్కర్ మాధవ్‌ను పెళ్లాడిన హీరా 2006లో విడాకులు తీసుకుంది. ప్రస్తుతం ఆమె అమెరికాలోనే ఒంటరిగా జీవిస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా తాజాగా హీరా రాజగోపాల్ తన బ్లాగులో చేసిన కామెంట్స్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ‘ఒక నటుడు నాకు ద్రోహం చేయడమే కాకుండా తన అభిమానులతో నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా చేశాడు. అతని వల్ల నేను చాలా అవమానాలు పడ్డాను. అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఒకసారి తన వెన్నెముకకు గాయమై శస్త్రచికిత్స చేయించుకున్నానని నాకు చెప్పాడు. దీంతో నేను అతనితోనే ఉండి ఎన్నో సపర్యలు చేశాను. కానీ, అతను ఆరోగ్యం విషయంలో కూడా నాతో అబద్ధం చెప్పాడని తెలుసుకున్నాను’అని హీరా రాసుకొచ్చింది. అలాగే వివాహం, శృంగారం విషయంలో కూడా ఆ నటుడు తనతో చెప్పిన మాటలను కూడా తన బ్లాగులో రాసుకొచ్చింది హీరా. అయితే నిజంగా ఈ వెబ్‌సైట్ హీరా రాజగోపాల్‌దేనా? లేక ఆ స్టార్ హీరో అంటే గిట్టనివాళ్లు చేసిన పనా? అనేది తెలియాల్సి ఉంది.

Actress Heera Rajagopal
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








