AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rocketry: సోషల్ మీడియా ట్రోల్స్‌పై స్పందించిన మాధవన్‌.. నా అజ్ఞానంతోనే ఆ మాటలన్నానంటూ..

Madhavan: ప్రముఖ సినీ హీరో, ఇప్పుడు డైరెక్టర్‌గా మారిన మాధవన్‌ (Madhavan)పై ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఓ రేంజ్‌లో ట్రోలింగ్ జరుగుతోంది. అనవసరంగా నోరు జారావంటూ నెటిజన్లు..

Rocketry: సోషల్ మీడియా ట్రోల్స్‌పై స్పందించిన మాధవన్‌.. నా అజ్ఞానంతోనే ఆ మాటలన్నానంటూ..
Actor R Madhavan
Basha Shek
| Edited By: |

Updated on: Jun 27, 2022 | 6:36 AM

Share

Madhavan: ప్రముఖ సినీ హీరో, ఇప్పుడు డైరెక్టర్‌గా మారిన మాధవన్‌ (Madhavan)పై ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఓ రేంజ్‌లో ట్రోలింగ్ జరుగుతోంది. నోరు జారావంటూ నెటిజన్లు మాధవన్‌ను ఏకిపారేస్తున్నారు. సైంటిఫిక్‌ విషయాలపై అవగాహన లేకుండా మాట్లాడితే ఏమవుతుందో మాధవన్‌ ఎపిసోడ్‌ ఓ ఎగ్జాంపుల్‌ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా మాధవన్‌ తొలిసారి దర్శకత్వం వహించిన ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ (Rocketry: The Nambi Effect) సినిమా జులై 1న విడుదల కాబోతోంది. ఈ సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అతను చేసిన కొన్ని వ్యాఖ్యలు నెటిజన్లను ఆగ్రహానికి తెప్పించాయి. అంతరిక్షంలోకి రాకెట్‌ను ప్రయోగించేందుకు, అంగారకుడి కక్ష్యలోకి అది చేరుకునేందుకు ఇస్రోకు పంచాంగం సాయపడిందని, ముహూర్త బలంతో భారత్ మార్స్ మిషన్ అవాంతరాలను దాటిందని, గ్రహ గతులన్నీ పంచాంగంలో నిక్షిప్తమై ఉంటాయన్న వ్యాఖ్యలతో అనవసరంగా నెటిజన్ల నోట్లో పడ్డాడీ స్టార్‌ హీరో. సైన్స్ గురించి తెలియకపోయినా పర్వాలేదు కానీ, ఏవి ఎలా పనిచేస్తాయో తెలియనప్పుడు నోరు విప్పకపోవడం మంచిదని ఓ యూజర్ మాధవన్‌కు సలహా ఇచ్చాడు. ‘మరీ ఇంత మూర్ఖత్వమా?’ అని మరో యూజర్ కోప్పడ్డాడు. మాధవన్ ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదని ఇంకొందరు అన్నారు. తాజాగా తనపై వస్తోన్న విమర్శలు, ట్రోల్స్‌పై స్పందించారు మాధవన్‌.

‘నాకు ఈ శాస్తి జరగాల్సిందే. ఇయర్ బుక్‌ను తప్పుగా తమిళ్‌లో పంచాంగం అని చెప్పాను. నా అజ్ఞానంతోనే ఆ మాటలను అన్నాను. మార్స్ మిషన్‌ను మనం రెండు ఇంజిన్స్‌తో విజయవంతం చేశాం. నా మాటలు ఈ విజయాన్ని ఏ మాత్రం తక్కువ చేయలేవు. ఆ మిషన్ ఇప్పటికీ రికార్డే. వికాస్ ఇంజిన్ రాక్‌స్టార్’ అని సోషల్‌ మీడియాలో రాసుకొచ్చాడీ స్టార్‌ హీరో. కాగా ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ సినిమాను మాజీ శాస్త్రవేత్త, ఇస్రో ఏరోస్పేస్ ఇంజినీర్ నంబి నారాయణ జీవిత కథ ఆధారంగా తీశారు. నంబి నారాయణపై అప్పట్లో గూఢచర్యం ఆరోపణలు వచ్చాయి. తర్వాత ఆయన క్లీన్‌చిట్‌తో బయటపడ్డారు. ఈ సినిమాలో మాధవన్ టైటిల్ రోల్‌లో కనిపించనున్నారు. హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, ఇంగ్లిష్ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. షారుఖ్‌, సూర్య ఈ సినిమాలో కీలకపాత్రల్లో కనిపించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..