Allu Arjun: పుష్పతో అంతకంతకూ పెరుగుతోన్న బన్నీ పాపులారిటీ.. ఆ విషయంలో రజనీని అధిగమించిన అల్లు అర్జున్‌..

'పుష్ప'( Pushpa) సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌ గా మారిపోయాడు ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్‌ (Allu Arjun). సుకుమార్‌ (Sukumar) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో దుమ్మురేపింది

Allu Arjun: పుష్పతో అంతకంతకూ పెరుగుతోన్న బన్నీ పాపులారిటీ.. ఆ విషయంలో రజనీని అధిగమించిన అల్లు అర్జున్‌..
Follow us
Basha Shek

|

Updated on: Feb 03, 2022 | 4:40 PM

‘పుష్ప'( Pushpa) సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌ గా మారిపోయాడు ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్‌ (Allu Arjun). సుకుమార్‌ (Sukumar) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో దుమ్మురేపింది. రికార్డు కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా తర్వాత సోషల్‌ మీడియాలో బన్నీ క్రేజ్‌ కూడా బాగా పెరిగిపోయింది. ఇటీవల ఇన్‌స్టా్గ్రామ్‌లో 15 మిలియన్ల మంది ఫాలోవర్లను సంపాదించుకున్న అల్లు అర్జున్.. పది రోజుల్లోనే 1 మిలియన్ అభిమానులను సొంతం చేసుకున్నాడు. కేవలం పుష్ప క్రేజ్‏తో కేవలం పది రోజుల్లోనే సోషల్ మీడియా రికార్డ్ బ్రేక్ చేశాడు. ప్రస్తుతం బన్నీకి ఇన్‏స్టాగ్రామ్‏లో 16 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

ఇదిలా ఉంటే సామాజిక మాధ్యమాల్లో మరో ఘనత అందుకున్నాడు ఐకాన్‌ స్టార్‌. సాధారణంగా దక్షిణాదిన తలైవా రజనీకాంత్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అన్ని భాషల, అన్ని వర్గాల పేక్షకులు ఆయనను విపరీతంగా అభిమానిస్తారు. ప్రస్తుతం తలైవాను ట్విట్టర్ లో సుమారు 6.1 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. అలాంటిది ఇప్పుడు ఆయనను మించిన ఫాలోయింగ్ ను బన్నీ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్‌ ను ట్విట్టర్‌ లో 6.5 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. రజనీకాంత్‌ ట్విట్టర్‌ లో 24 మందిని ఫాలో అవుతుంటే బన్నీ మాత్రం ఎవరినీ ఫాలో అవ్వకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఐకాన్‌ స్టార్‌ పుష్ప సెకండ్ పార్ట్ పుష్ప ది రూల్ షూటింగ్ కోసం సిద్ధమవుతున్నాడు. ఫిబ్రవరిలో పుష్ప ది రూల్ షూరు కానుంది. ఇందులో సునీల్, రష్మిక మందన్న, అనసూయ, ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలలో నటిస్తుండగా.. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.

Also read:Nayanthara: హైదరాబాద్‌ లో సందడి చేసిన నయనతార.. ఆ సినిమా షూటింగ్‌ కోసమేనా?

LIC IPO: త్వరలో ఎల్ఐసీ ఐపీఓ.. పాలసీదారులు ఇందులో పాల్గొనడానికి ఈ పని చేయాలి..

Facebook: ప్రమాదంలో ఫేస్‌బుక్.. టిక్‌టాక్, యూట్యూబ్ నుంచి గట్టి పోటీ..